BigTV English

OTT Movies: శవం జేబులో ఫోన్.. సమాధి నుంచి కుర్రాడికి మెసేజులు, ఆ తర్వాత జరిగేది చూస్తే చలి జ్వరమే!

OTT Movies: శవం జేబులో ఫోన్.. సమాధి నుంచి కుర్రాడికి మెసేజులు, ఆ తర్వాత జరిగేది చూస్తే చలి జ్వరమే!


OTT Movies: మీకు హర్రర్, థ్రిల్లర్స్ ఇష్టమా? అయితే, ఇది అందుకు చాలా భిన్నమైన చిత్రం. ఈ మూవీని చూస్తుంటే మీకు భారత ప్రముఖ వాణిజ్యవేత్త టాటా, ఆయన యంగ్ ఫ్రెండ్ శాంతాను నాయుడుల ఫ్రెండ్‌షిప్ గుర్తుకొస్తుంది. అయితే, అది కొంతవరకు మాత్రమే. మిగతాది అంతా ఫిక్షనల్. ఇక మూవీ విషయానికి వస్తే.. స్టీఫెన్ కింగ్ రాసిన ‘ఇఫ్ ఐట్ బ్లీడ్స్’ అనే నవలలోని ఒక కథ ఆధారంగా దీన్ని తెరక్కించారు. ఈ మూవీ టైటిల్ ‘మిస్టర్ హారిగన్స్ ఫోన్’. అయితే, ఇది రెగ్యులర్ థ్రిల్లర్.. హర్రర్ టైప్ మూవీ కాదు. మానవ సంబంధాలు, సామాజిక అంశాలను మిళితం చేసి తెరకెక్కించిన ఒక మాస్టర్ పీస్. ఒక యువకుడు, ఒక వృద్ధ బిలియనీర్ మధ్య స్నేహం, వారి జీవితాలను టెక్నాలజీ ఎలా ప్రభావితం చేసిందనేది కథ.

కథేంటంటే


ఇది 2000 మధ్యకాలంలో, అమెరికాలోని ఒక చిన్న పట్టణంలో జరుగుతుంది. క్రెయిగ్ (జాడెన్ మార్టెల్) అనే విద్యార్థి.. మిస్టర్ హారిగన్ (డొనాల్డ్ సదర్లాండ్) అనే ఒక రిటైర్డ్ బిలియనీర్‌తో స్నేహం చేస్తాడు. హారిగన్‌కు తోడు ఎవ్వరూ ఉండరు. ఆయనకు పుస్తకాలంటే ఆసక్తి. దీంతో క్రెయిగ్ ఆయనకు పుస్తకాలు చదివి వినిపిస్తుంటాడు. దీంతో వారి మధ్య స్నేహం మొదలవుతుంది. దీంతో ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అవుతారు.

ఒక రోజు క్రెయిగ్‌ లాటరీలో గెలిచిన డబ్బుతో మిస్టర్ హారిగన్‌కు ఒక ఐఫోన్ కొనిస్తాడు. ఈ ఫోన్ ద్వారా వారిద్దరూ మెసేజ్‌లు పంపుకుంటారు. అయితే, ఒక రోజు మిస్టర్ హారిగన్ హఠాత్తుగా మరణిస్తాడు. ఈ విషయం తెలిసి క్రెయిగ్‌ చాలా బాధపడతాడు. ఐఫోన్‌ను శవపేటికలో ఉన్న హారిగన్ జేబులో పెడతాడు. ఆ తర్వాత హారిగన్‌ను పూడ్చి పెడతారు. అయితే, కథ ఇక్కడి నుంచే రసవత్తరంగా మారుతుంది.

సమాధి నుంచి మెసేజులు.. ఆ తర్వాత హత్యలు

క్రెయిగ్ తనకు ఏ కష్టం వచ్చినా హారిగన్‌ నెంబర్‌కు మెసేజుల ద్వారా చెప్పకుంటుంటాడు. ఓ రోజు అతడి ఫోన్ నుంచి రిప్లై వస్తుంది. ఆ మెసేజ్ చూసి క్రెయిగ్ ఉలిక్కిపడతాడు. ఆ తర్వాత అతడు తీవ్ర భయాందోళనకు గురవ్వుతాడు. అనుమానంతో ఒక రోజు సమాధి దగ్గరకు వెళ్లి హారిగన్ ఫోన్‌కు కాల్ చేస్తాడు. సమాధి నుంచి ఫోన్ రింగ్ వినిపిస్తుంది. అప్పటి నుంచి క్రెయిగ్ భయం భయంగా గడుపుతాడు. క్రెయిగ్‌ను స్కూల్‌లో కెన్నీ యాంకోవిచ్ అనే విద్యార్థి హేళన చేస్తాడు. అతడిపై కోపంతో క్రెయిగ్ మిస్టర్ హారిగన్ ఫోన్‌కు మెసేజ్ చేస్తాడు. ఆ మెసేజ్ చేసిన కొన్ని రోజుల తర్వాత.. క్రెయిగ్‌ను హేళన చేసిన కెన్నీ అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు.

టీచర్ మరణంతో..

అలాంటి సంఘటనే మరోకొటి కూడా జరుగుతుంది. క్రెయిగ్ ఎంతో ఇష్టపడే టీచర్ మిస్ హార్ట్ రోడ్డు ప్రమాదంలో మరణిస్తుంది. టీచర్ మరణానికి హారిగన్ ఫోన్‌కు పంపిన మెసేజ్‌లతో సంబంధం ఉందని క్రెయిగ్ సందేహిస్తాడు. ఈ సంఘటనలు క్రెయిగ్‌ను మరింత ఆందోళనకు గురిచేస్తాయి. ఇలా చేయడం తగదని భావిస్తాడు. ఆ మరణాలకు తానే కారణమని బాధపడతాడు. మరి, మిస్టర్ హారిగన్ నిజంగానే ఫోన్ ద్వారా సంప్రదిస్తున్నాడా? ఆ హత్యలతో హారిగన్‌కు కూడా సంబంధం ఉందా? క్రెయిగ్‌ను హేళన చేసేవారినే కాకుండా.. అతడు ఇష్టపడే వ్యక్తులను కూడా హారిగన్ ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నాడనేది తెలియాలంటే మూవీ చివరి వరకు చూడాల్సిందే. ఈ మూవీ పూర్తిగా హర్రర్ కాదు.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎక్కువగా డ్రామా నడుస్తుంది. అయితే, కథనం మాత్రం మిమ్మల్ని నిరాశకు గురిచెయ్యదు.

ఏ ఓటీటీలో ఉంది?

జాన్ లీ హాన్‌కాక్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో జాడెన్ మార్టెల్ (క్రెయిగ్), డొనాల్డ్ సదర్లాండ్ (మిస్టర్ హారిగన్), కిర్బీ హోవెల్-బాప్టిస్ట్ (మిస్ హార్ట్) కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ మూవీ Netflix ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంది.

Related News

OTT Movie : పెళ్ళైన డాక్టర్ తో మోడల్ మెంటల్ పని… జీవితాన్నే మార్చేసే లింగరీ యాడ్… క్లైమాక్స్ ట్విస్ట్ నెక్స్ట్ లెవెల్ భయ్యా

OTT Movie : తల్లి, చెల్లి ఒకేసారి డెడ్… చెరువులో దాగి ఉన్న మిస్టరీ… మైండ్ బెండయ్యే టైమ్ ట్రావెల్ మూవీ

OTT Movies: ఒక్క సినిమాలో 27 ముద్దులా? హాలీవుడ్‌‌కు సైతం షాకిచ్చిన మన ఇండియన్ మూవీ ఇదే

OTT Movie : టెర్రరిస్టు గ్రూప్ తో కుమ్మక్కు… లేడీ ఏజెంట్ రివేంజ్ ప్లాన్ కు మైండ్ బ్లాక్.. యాక్షన్-ప్యాక్డ్ సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : అమ్మాయి ప్రైవేట్ వీడియో రికార్డు చేసి, చేయకూడని పని… ఈ క్రైమ్ థ్రిల్లర్లో ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్

Coolie OTT: అప్పుడే ఓటీటీకి రజనీకాంత్ ‘కూలీ’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!

Big Stories

×