Tsunami hits: ప్రళయం మొదలైందా? సునామీ వార్నింగ్ ఏం చెబుతోంది? ఒకేసారి రెండు దేశాలను గురిపెట్టిందా? 14 ఏళ్ల తర్వాత ప్రపంచంలో ఆ స్థాయి భూకంపం ఇప్పుడు రష్యాలో వచ్చిందా? ఈసారి నష్టం ఏ స్థాయిలో ఉండబోతోంది? ఇదే చర్చ ప్రపంచవ్యాప్తంగా మొదలైంది.
ప్రళయం ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో చెప్పలేము. దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. తాజాగా బుధవారం ఉదయం రష్యాని భారీ భూకంపం వణికించింది. కమ్చాట్కా ద్వీపకల్పంలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం పసిఫిక్ మహా సముద్రం పెట్రోపావ్లోవ్స్క్-కమ్చాట్స్కీ నుంచి 136 కిలోమీటర్లు దూరంలో గుర్తించారు.
భూమిలోపల 19.3 కిలోమీటర్ల లోతులో సంభవించింది. భూకంపం కారణంగా రష్యా, జపాన్, హవాయి, అలాస్కా, అమెరికా, పశ్చిమ తీరాల్లో సునామీ హెచ్చరికలు మొదలయ్యాయి. కమ్చాట్కా ప్రాంతంలో 3 నుంచి 4 మీటర్ల ఎత్తున సముద్రపు అలలు ఎగిసిపడ్డాయి. దీని ప్రభావంతో సెవెరో-కురిల్స్క్ ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
అక్కడ ఓడరేవు ఒకటి మునిగి పోయిందని రష్యా మీడియా తెలిపింది. ఈ ప్రాంతంలో దాదాపు 2 వేల మంది నివాసం ఉంటున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు రష్యా అధికారులు వెల్లడించారు. సఖాలిన్ ద్వీపంలోని నివాసితులను ఖాళీ చేస్తున్నామని అధికారులు తెలిపారు. హవాయిలో మొదటి సునామీ అల 7.17 నిమిషాలకు నమోదు అయ్యింది.
ALSO READ: టేకాప్ అయిన కొద్దిసేపటికే మేడే కాల్.. రెండున్నర గంటలు గాల్లో విమానం
ఇక జపాన్‌లో హోక్కైడో నుంచి క్యూషూ వరకు మీటరు ఎత్తు అలలు రావచ్చని హెచ్చరించింది ఆ దేశ వాతావరణ శాఖ. ఈ భూకంపం ప్రభావం పశ్చిమ తీరంలోని కాలిఫోర్నియా, ఒరెగాన్, వాషింగ్టన్‌లలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో భూ శాస్త్రీయ కార్యకలాపాల ఫలితంగా జరిగిందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
భూకంపం ప్రభావంతో అనేక భవనాలు కొన్ని నిమిషాల పాటు ఊగాయి. పరిస్థితి గమనించిన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన ఎలాంటి సమాచారం బయటకు తెలియరాలేదు. కామ్చాట్‌స్కీ ప్రాంతంలో విద్యుత్, సెల్‌ఫోన్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ప్రపంచంలో ఈ స్థాయిలో భూకంపం రావడం 2011 తర్వాత ఇప్పుడు వచ్చిందని అంటున్నారు. సునామీ నేపథ్యంలో జపాన్ తీరప్రాంతాల్లో అలలు 3 మీటర్ల వరకు ఎగసి పడుతున్నాయి. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. భూకంపం, సునామీ నేపథ్యంలో అమెరికాలోని భారత కాన్సులేట్ జనరల్ అప్రమత్తమైంది.
ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అమెరికా అధికారులు జారీ చేసే అలర్ట్‌లను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలకు ఛార్జింగ్ ఉండేలా చూసుకోవాలని, సాయం కోసం ఎమర్జెన్సీ నెంబర్లను సంప్రదించాలని కాన్సులేట్ జనరల్ ‘ఎక్స్’ ద్వారా వెల్లడించింది.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రియాక్ట్ అయ్యారు. అమెరికాలో పసిఫిక్ తీర ప్రాంతాలకు ముప్పు పొంచి ఉందని, ప్రజలంతా ధైర్యంగా ఉండాలన్నారు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలన్నారు. అధికారుల సూచనలను ఎప్పటికప్పుడు పాటించాలని సూచన చేశారు.
#earthquake #tsunami #Russia #Japan #Hawaii #Alaska
Massive 8.7 magnitude earthquake shook Russia
One of the deadliest earthquake of the century
Alert of Tsunami pic.twitter.com/bxf2eGFQqD
— Killer Cool ⚡ (@Killercool63) July 30, 2025