Actress Habits: అందమైన భామలు తెరపై ఎంత స్టైల్ గా కనిపిస్తారో ప్రైవేట్ లైఫ్ లో కూడా అంతే పర్ఫెక్ట్ గా ఉంటారని అనుకుంటాము. కానీ వాళ్లకి కూడా మనలాగే కొన్ని వింత అలవాట్లు ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా ?ఇంతకీ కెమెరా వెనకాల వారి వింతైన అలవాట్లు ఎలా ఉన్నాయో చూసేద్దాం.
ఐశ్వర్యా రాయ్
ముందుగా ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ విషయానికి వస్తే ఈ వెటరన్ బ్యూటి డిసిప్లిన్‌కు మరో పేరు అని అందరూ అంటారు. కానీ ఆమెకు ఉన్న ఒక చిన్న వీక్‌నెస్ ఏంటో తెలుసా ..ఐస్‌క్రీమ్.మాములుగా ఎవరైనా డే లో తింటారు.కానీ ఈవిడ అలా కాదు.అర్థరాత్రి మూడు గంటలైనా లేచి ఐస్‌క్రీమ్ తినేస్తుందట.ఎంత డైట్‌లో ఉన్నా ఈ అలవాటును మాత్రం వదలలేదని చాలా సార్లు చెప్పుకొచ్చింది ఈ మాజీ విశ్వ సుందరి.
తమన్నా
ఇక మిల్కీ బ్యూటీ తమన్నా చెప్పిన వింత అలవాటు ఏంటో తెలుసా ?ఉదయం నిద్రలేవగానే వచ్చే ఉమ్మిని మొటిమలపై రాస్తే తగ్గుతాయని నమ్ముతుందట.అవును ఆమె చెప్పిన ఒక బ్యూటీ టిప్ వింటే చాలామంది షాక్ అయ్యారు కూడా.ఇక తన అందానికి సీక్రెట్ ఇదే అని ఒక ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా చెప్పడంతో అప్పట్లో బాగా వైరల్ అయింది కూడా.
విద్యా బాలన్
మాములుగా ఈ రోజుల్లో ఐదు నిమిషాలు ఫోన్ లేకపోతె పిచ్చెక్కినట్టు అయిపోతాము.కానీ కానీ విద్యా బాలన్ అలా కాదు.ఫోన్‌ను గంటల తరబడి, కొన్ని సార్లు రోజుల తరబడి కూడా పక్కన పెట్టేస్తుందట. కాల్స్ మిస్ అయినా, మెసేజ్‌లకు ఆలస్యంగా రిప్లై ఇచ్చినా ఆమె పెద్దగా పట్టించుకోదట కూడా. ఇది వింత అలవాటు ఏంటి అంటారా. అసలైన వింత అలవాటు ఇదే మరి.ఈ రోజుల్లో ఫోన్ ని అలా పక్కన పెట్టేసేవారు ఎవరుంటారు చెప్పండి.
దీపికా పదుకోణె
ఇక దీపికా పదుకోణెకి షాపింగ్ కంటే, సినిమా కంటే ఇంకో పని ఏంటో తెలుసా ?ఎయిర్‌పోర్ట్‌లో కానీ, కేఫేలో కానీ కూర్చొని అక్కడికి వచ్చే వాళ్లను గమనిస్తూ ఉండిపోతుందట. వాళ్ల హావభావాలు, నడక, మాట్లాడే తీరు చూసి ఎంజాయ్ చేస్తుందట. దీనినే ‘పీపుల్ వాచింగ్’ అంటారని చెప్పక్కర్లేదనుకుంటా .బహుశా సినిమాల్లో అదే అబ్జర్వేషన్ అని అప్లయ్ చేస్తుంది కాబోలు.
కరీనా కపూర్
ఇక స్టైల్ ఐకాన్‌గా పేరున్న కరీనా కపూర్‌కూ ఒక చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఉందండోయ్.ఏంటి అంటారా .. ఖాళీగా ఉంటే చాలు తెలియకుండానే గోళ్లు నమిలేస్తుందట మరి. ఈ అలవాటు తగ్గించుకోవడానికి డార్క్ కలర్ నెయిల్ పాలిష్ వేసుకుంటానని కూడా ఒకసారి చెప్పింది కూడా.మరి ఇప్పుడు కూడా ఇలాగే నమిలేస్తున్నావా బెబో.
ప్రీతి జింటా
ఇక ప్రీతి జింటా శుభ్రత విషయంలో చాలా స్ట్రిక్ట్ అన్న సంగతి తెలుసా.ఏంటి మీరు కూడా నా.ఆగండి.ఎంత స్ట్రిక్ట్ అంటే ఏ హోటల్‌లో దిగినా ముందుగా బాత్‌రూమ్‌ను చెక్ చేస్తుందట. శుభ్రంగా లేకపోతే వెంటనే సిబ్బందికి చెప్పడమో, అవసరమైతే తనే క్లీన్ చేసుకోవడమో చేస్తుందట. అందుకే ఆమెను చాలామంది ‘క్లీన్‌నెస్ ఫ్రీక్’ అంటుంటారని చెబుతుంటారు కూడా ,
మొత్తంగా స్క్రీన్‌పై ఎంత గ్లామర్‌గా కనిపించినా… స్టార్ హీరోయిన్లు కూడా చివరికి మనలాగే సాధారణ మనుషులే అని ఈ అలవాట్లతో ఒక క్లారిటీ వచ్చేసింది కదా !
also read :ఎన్టీఆర్‌కి భుజానికి గాయం..డాక్టర్లు ఏం చెప్పారంటే?