ఈ రోజుల్లో ఎవరి చేతిలో చూసి స్మార్టు ఫోన్లు దర్శనం ఇస్తున్నాయి. స్కూల్ పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు సెల్ ఫ్లోన్లు వాడుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. కొందరు ఫాలోవర్స్ ను పెంచుకునేందుకు రకరకాల ప్రయత్నిలు చేస్తున్నారు. అబ్బాయిలు డేంజర్ స్టంట్స్ చేస్తూ, అమ్మాయిలు అందాలను ఆరబోస్తున్నారు. అభ్యంతరకర కంటెంట్ ను షేర్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అనుచిత వీడియోలను షేర్ చేస్తున్న వారిపై యూపీ పోలీసులు కఠిన చర్యలకు దిగుతున్నారు. సంభాల్ కు చెందిన ముగ్గురు యవతులను అరెస్ట్ చేశారు..
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
తాజాగా సంభాల్ పోలీసులకు ఓ ఫిర్యాదు అందింది. సోషల్ మీడియాలో ముగ్గురు అమ్మాయిలు అభ్యతరకర వీడియోలను షేర్ చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు. అభ్యంతకర వీడియోలు, అనుచిత సంభాషనలు వారి ఇన్ స్టాలో ఉన్నట్లు గుర్తించారు. ఈ ఇన్ స్టా అకౌంట్ రన్ చేస్తున్న ముగ్గురు యువతులతో పాటు ఓ యువకుడిని అరెస్టు చేశారు. ఈ కంటెంట్ నుంచి వాళ్లు నెలకు రూ. 25,000 నుంచి రూ. 30,000 వరకు సంపాదిస్తున్నట్లు గుర్తించారు.
కీలక విషయాలు వెల్లడించిన సంభాల్ ఎస్పీ
అస్మోలి పోలీస్ స్టేషన్ లో ఈ ఇన్ స్టా అకౌంట్ గురించి ఫిర్యాదు అందినట్లు సంభాల్ సూపరింటెండెంట్ కృష్ణ కుమార్ బిష్ణోయ్ వెల్లడించారు. విచారణలో ఇన్ స్టాగ్రామ్ ఖాతాను మెహ్రుల్ నిషా అలియాస్ పారి, మెహక్, హీనా అనే ముగ్గురు యువతులు నడుపుతున్నారని తేలిందన్నారు. ఆన్ లైన్‌లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ను పొందడానికి అభ్యంతరకరమైన వీడియోలను సృష్టించి అప్ లోడ్ చేసినట్లు గుర్తించామన్నారు. అటు జర్రర్ ఆలం అనే వ్యక్తి కూడా ఈ రకమైన కంటెంట్ సృష్టించి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నట్లు తెలిపారు. ఈ గ్రూప్ ను బాగా పాపులర్ చేసేందుకు, ఆదాయాన్ని పొందేందుకు రెచ్చగొట్టే వీడియోలను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరికీ సామాజిక వేదికలలో తమను తాము వ్యక్తీకరించుకునే హక్కు ఉందన్న ఎస్పీ.. మర్యాద, సామాజిక నిబంధనలను విస్మరిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
🚨 Commendable action by Sambhal Police 👏
Mahak, Pari, Hina, and their associate Zarrar Alam who were misusing Instagram by spreading vulgarity, abusing in reels, and chasing popularity have been rightfully arrested by Sambhal Police.
Salute to the team for taking a bold stand… pic.twitter.com/wKyleekyZ8
— 🇮🇳 Indrani 🇮🇳 (@Anti_Congressi) July 16, 2025
Read Also: రైలు ఇంజిన్ పైకి ఎక్కిన మహిళ, రైల్వే స్టేషన్ లో టెన్షన్ టెన్షన్!
నిందితులపై కఠిన చర్యలు
అస్మోలి పోలీస్ స్టేషన్‌లో మెహక్, పారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు నలుగురు నిందితులను కస్టడీకి తరలించారు.స్థానికులు వారి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అటు అధికారులు సోషల్ మీడియా వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేశారు. అభ్యంతరకరమైన కంటెంట్‌ను షేర్ చేయవద్దన్నారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలన్నారు. లేదంటే, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియాలో విప్పి చూపించే వాళ్లు, ఈ ఘటనతోనైనా మారాలని నెటిజన్లు సూచిస్తున్నారు. లేదంటే, వారి లాగే జైల్లో చిప్పకూడు తినక తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు.
Read Also: వేగంగా వెళ్తున్న లారీ స్టీరింగ్ వదిలేసి.. డ్రైవర్ డేంజరస్ స్టంట్.. వీడిని అరెస్ట్ చెయ్యాల్సిందే!