E-Paper
Advertisement

Sunny Deol: సిగ్గు అనిపించడం లేదా? ఇంట్లోకి తొంగి చూస్తున్న మీడియా ప్రతినిధులపై సన్నీ డియోల్ ఫైర్!

Sunny Deol: సిగ్గు అనిపించడం లేదా? ఇంట్లోకి తొంగి చూస్తున్న మీడియా ప్రతినిధులపై సన్నీ డియోల్ ఫైర్!
Advertisement

Sunny Deol Fire On Media:

సీనియర్ నటుడు ధర్మేంద్రను బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చిన నేపథ్యంలో మీడియా ప్రతినిధులు ఆయన ఇంటి ముందట గుమిగూడారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన బాలీవుడ్ నటుడు, ధర్మేంద్ర కుమారుడు స‌న్నీ డియోల్ మీడియా హడావిడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి ముందు పడిగాపులు కాస్తున్న జర్నలిస్టులను సిగ్గుందా? అంటూ కోపాన్ని వెల్లగక్కారు.  ఓవైపు చేతులు జోడిస్తూనే, మరోవైపు తన బాధను కోపం రూపంలో చూపెట్టే ప్రయత్నం చేశారు. “మీకు సిగ్గు అనిపించ‌డం లేదా? మీకు త‌ల్లిదండ్రులు, పిల్ల‌లు లేరా? ఎందుకు ఉన్నవి లేనట్లు.. లేనివి ఉన్నట్లు ప్రచారం చేస్తారు?” అంటూ మండిపడ్డారు.

గత కొద్ది రోజులుగా మీడియా హడావిడి

ధర్మేంద్రకు సంబంధించిన వార్తలను ప్రస్తారం చేసేందుకు గత కొద్ది రోజులుగా మీడియా ప్రతినిధులు, ఆయన ఇంటి దగ్గర, బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ దగ్గర ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆయనను హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇంటి దగ్గర మీడియా ప్రతినిధుల హడావిడి ఎక్కువైంది. ఈ నేపథ్యంలో సన్నీ ఫ్రస్టేష‌న్‌ కు గురయ్యారు. త‌న కోపాన్ని బయటపెట్టారు. తమకు ప్రైవసీ ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన తిట్టడంలో తప్పులేదంటూ మరికొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. బాధలో ఉన్న వారి ఇంట్లోకి తొంగి చూడటం మంచిది కాదంటున్నారు.

హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన ధర్మేంద్ర  

Advertisement

బుధవారం నాడు ధర్మేంద్ర ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చారు. ప్రస్తుతం ఆయనకు ఇంట్లోనే ట్రీట్మెంట్ కొనసాగుతుంది. ఈ సమయంలో కుటుంబ గోప్యతను గౌరవించాలని మీడియాను రిక్వెస్ట్ చేశారు సన్నీ. “మిస్టర్ ధర్మేంద్ర ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన అభిమానుల ప్రేమ, ప్రార్థనలు త్వరగా కోలుకునేలా చేశాయి. ప్రస్తుతం తను ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. ఈ సమయంలో మీడియా,  ప్రజలకు తప్పుడు సమాచారాన్ని అందించే ప్రయత్నం చేయకూడదు. మా ప్రైవసీకి ఇబ్బంది కలిగించకూడదు” అని చెప్పుకొచ్చారు.

ధర్మేంద్ర చనిపోయారంటూ వార్తలు

ఈవారం ప్రారంభంలో ధర్మేంద్ర చనిపోయారంటూ వార్తలు ప్రసారం అయ్యాయి. బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చనిపోయారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలను అతడి భార్య హేమ మాలినితో పాటు కూతురు ఇషా డియోల్ వరకు తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియా వేదికగా ఈ ప్రచారాన్ని తప్పుబట్టారు.  “నా తండ్రి ధర్మేంద్ర గారు ఆరోగ్యంగానే ఉన్నారు. ఆయన కేవలం సాధారణ పరీక్షల కోసం ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌ కు వెళ్లారు. శ్వాస సంబంధిత సమస్యలకు చికిత్స తీసుకుంటున్నారు. దయచేసి ఎవ్వరూ తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దు. మా నుంచి కచ్చితమైన సమాచారం లేకుండా వార్తలు ప్రసారం చేయకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం” అని వెల్లడించారు.

Advertisement

Read Also: ఐసీయూలో ధర్మేంద్ర.. బాబీ డియోల్, సన్నీ డియోల్ భావోద్వేగం.. వీడియో వైరల్

Related News

OGకి కొరియన్ కనకరాజుకి ఉన్న కనెక్షన్ ఏంటి?

NBK 111: కాకినాడ షూటింగ్ లో నందమూరి బాలకృష్ణకు గాయాలు.. హెల్త్ కండిషన్ పై డాక్టర్ల క్లారిటీ!

‘ఒడిస్సీ’ లాంటి ప్లానింగ్ మనకు సాధ్యమేనా నాగ్?

నోరు జారితే అంతే.. నెక్స్ట్ స్కిట్‌లో నో ఛాన్స్! జబర్దస్త్ సీక్రెట్ లీక్ చేసిన నటి సత్యశ్రీ

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

Big Stories

Advertisement
×