BigTV English

OTT Movie : సమ్మర్ క్యాంపుకు వెళ్లి కిల్లర్ చేతికి చిక్కే అమ్మాయిలు… వణుకు పుట్టించే సీన్స్… మస్ట్ వాచ్ మలయాళ మూవీ

OTT Movie : సమ్మర్ క్యాంపుకు వెళ్లి కిల్లర్ చేతికి చిక్కే అమ్మాయిలు… వణుకు పుట్టించే సీన్స్… మస్ట్ వాచ్ మలయాళ మూవీ

OTT Movie : మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కి ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. అంతలా ఈ సినిమాలు మూవీ లవర్స్ మనసును దోచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక మలయాళం క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చింది. ఇందులో బ్యూటిఫుల్ విజువల్స్, ట్విస్ట్స్, బిబిన్ జార్జ్ పెర్ఫార్మెన్స్ కి పాజిటివ్ టాక్ వచ్చింది. ఒక మర్డర్ చుట్టూ తిరిగే ఈ స్టోరీ, చివరి వరకు ఊహించని మలుపులలతో మతిపోగొడుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..


కథలోకి వెళ్తే

లైలా, నిమ్మి అనే ఇద్దరు యువతులు వయనాడ్ కొండల్లో నూతన సంవత్సర వేడుకల కోసం “స్ట్రేంజర్స్ క్యాంప్”కు వెళతారు. అక్కడ వీళ్ళు పాత స్నేహితురాలు, ట్రాన్స్‌వుమన్ అయిన అంజును ఊహించని విధంగా కలుస్తారు. ఆమెతో వారికి ఒక విషాదకరమైన గతం ఉంటుంది. ఈ ముగ్గురూ, వారి స్నేహితురాలు హిమాతో కలిసి ఒక ఫ్లాట్‌లో ఉండేవాళ్ళు. ఆ ఫ్లాట్ లో ఉండే హిమా ఒక రోజు హత్యకు గురవుతుంది. ఆ తరువాత దీనికి సంబంధించిన ఒక రహస్యం బయటపడుతుంది. దీనిని అంజు చేసినట్లు వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు అంజు వీళ్ళను కూడా టార్గెట్ చేస్తుంది. క్యాంప్ డైరెక్టర్ బాబీ వాళ్ళని రక్షించడానికి ఇందులో జోక్యం చేసుకుంటాడు. కానీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతాయి. కథలో అనేక ఊహించని ట్విస్ట్‌లు, ముఖ్యంగా రెండవ భాగంలో, కథను ఒక కొత్త వైబ్‌లోకి తీసుకెళ్తాయి.


లైలా, నిమ్మి, అంజు మధ్య గతంలోని సంఘటనలు, ముఖ్యంగా హిమా హత్యకు సంబంధించిన నిజాలు బయటపడటంతో ఉత్కంఠ పెరుగుతుంది. అంజు ఒక స్పర్న్డ్ పార్టనర్‌తో సంబంధం కలిగి ఉండవచ్చని సూచనలు వస్తాయి. ఇది హత్యకు దారితీసినట్లు తెలుస్తుంది. బాబీ జోక్యంతో కథ మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది. చివరికి ఆ హత్యను అంజునే చేసిందా ? మరెవరైనా చేశారా ? లైలా, నిమ్మి పాత్ర ఇందులో ఎంత ? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే, ఈ మలయాళ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాని మిస్ కాకుండా చూడండి.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘కూడల్’ (Koodal)  2025లో విడుదలైన మలయాళ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం. ఇది షాను కక్కూర్, షఫీ ఎప్పిక్కడ్ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో బిబిన్ జార్జ్, మరీనా మైఖేల్ కురిసింగల్, రియా ఇషా, నియా వర్గీస్, గజరాజ్, వినీత్ తట్టిల్ డేవిడ్, వి.టి. విజిలేష్ నటించారు. ఈ సినిమా 2025 జూన్ 27న థియేటర్లలో విడుదలై, 2025 ఆగస్టు 31 నుండి ManoramaMAXలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. 148 నిమిషాల రన్‌టైమ్‌తో IMDbలో 7.8/10 రేటింగ్ పొందింది.

Read Also : వీడియో కాల్ లో అన్నీ విప్పి పాడు పనులు… ప్రేమించిన అమ్మాయిని వదిలేసి ఆమె వలలో… అబ్బాయిలు మస్ట్ వాచ్

Related News

OTT Movie : లవర్స్ మధ్యలో మరో అమ్మాయి… మెంటలెక్కించే తుంటరి పనులు…. ఇయర్ ఫోన్స్ మర్చిపోవద్దు మావా

OTT Movie : అద్దాల ఇంట్లో అనాథ పిల్లలు… అడుగడుగునా ఆరాచకమే… అబ్బాయిని కట్టేసి అలాంటి పనులా భయ్యా

Thriller Movie in OTT : ఇదేం సినిమా రా అయ్యా.. బుర్ర మొత్తం ఖరాబ్ చేస్తుంది… ఒంటరిగా చూడకండి..

OTT Movie : రూత్‌లెస్ గ్యాంగ్‌స్టర్‌తో 4.5 గ్యాంగ్ ఫైట్… రెస్పెక్ట్ కోసం పాలు, పూల మాఫియాలోకి… కితకితలు పెట్టే మలయాళ కామెడీ సిరీస్

OTT Movie : ఇండియా చరిత్రలోనే అతిపెద్ద కాల్ సెంటర్ స్కామ్‌… రియల్ స్టోరీ మాత్రమే కాదు, ఇది కిరాక్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×