E-Paper
Advertisement

Vishwanath & Sons: వెంకీ అట్లూరి ‘సూర్య 46’ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. టైటిల్ అనుకున్నదే పెట్టారుగా..

Vishwanath & Sons: వెంకీ అట్లూరి ‘సూర్య 46’ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. టైటిల్ అనుకున్నదే పెట్టారుగా..
Advertisement

Vishwanath & Sons: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మరియు వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ టైటిల్ ఎట్టకేలకు ఖరారైంది. ఈ చిత్రానికి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ (Vishwanath & Sons) అనే క్లాసీ టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వెంకీ అట్లూరి గత చిత్రాలైన ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ తరహాలోనే ఈ సినిమాకు కూడా ఒక విభిన్నమైన, అర్థవంతమైన టైటిల్‌ను ఎంచుకున్నారు. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అనే పేరు వినగానే ఇది ఒక స్వచ్ఛమైన ఫ్యామిలీ డ్రామా అని అర్థమవుతోంది. విడుదలైన పోస్టర్‌లో సూర్య లుక్ చాలా కొత్తగా, క్లాసీగా ఉంది. ఇది ఒక మధ్యతరగతి కుటుంబ నేపథ్యంలో సాగే ఎమోషనల్ అండ్ ఎంటర్టైనింగ్ జర్నీ అని పోస్టర్ చూస్తే తెలుస్తోంది.

Read also-Horror thriller OTT: గదిలో భయపెట్టే దయ్యం… తల్లికూతుర్ల అగచాట్లు… ఊహకు అందని క్లైమాక్స్

Advertisement

ఈ సినిమాలో సూర్య సరసన ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు కథానాయికగా నటిస్తోంది. అలాగే సీనియర్ నటి రవీనా టాండన్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సూర్య – జివి ప్రకాష్ కాంబోలో వచ్చే పాటలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇంతకు ముంది ఇదే కాంబోలో వచ్చిన ఆకాశమే హద్దు ఏ రేంజ్ హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Read also-Horror thriller OTT: జోంబీలుగా మారే శవాలు… పరుగులు పెట్టే జనం… జడిపిస్తున్న హారర్ థ్రిల్లర్

Advertisement

కథా నేపథ్యం

చిత్ర వర్గాల సమాచారం ప్రకారం, ఇది 1980 లేదా 90వ దశకం నేపథ్యంలో సాగే పీరియడ్ ఫ్యామిలీ డ్రామా. తండ్రి కొడుకుల మధ్య ఉండే అనుబంధం, కుటుంబ విలువల చుట్టూ కథ తిరుగుతుందని తెలుస్తోంది. వెంకీ అట్లూరి తనదైన శైలిలో ఎమోషన్స్‌ను పండించడంలో దిట్ట, అందుకే సూర్య లాంటి పవర్ హౌస్ పెర్ఫార్మర్‌తో ఆయన చేస్తున్న ఈ ప్రయత్నంపై అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మేకర్స్ ఈ సినిమాను 2026 వేసవి కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇది తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న బైలింగ్యువల్ మూవీ. పాన్ ఇండియా స్థాయిలో ఇతర భాషల్లో కూడా విడుదల కానుంది. 0సూర్య ఇప్పటికే ‘కంగువ’ వంటి భారీ యాక్షన్ సినిమాతో ప్రేక్షకులను అలరించగా, ఇప్పుడు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ను అందించబోతున్నారు. ఈ సినిమా సూర్య కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Related News

సీతమ్మ ఇలా మారిపోయిందేంటి..మృణాల్ గ్లామర్ డోస్ మామూలుగా లేదుగా!

ఛాన్స్ ఇస్తాం.. కానీ ఆ పని చేయాలంటూ ఆఫర్.. ఖుషీ షాకింగ్ రివీల్!

టాలీవుడ్ హీరో భార్యతో మనస్పర్థలంట.. విడాకులపై బయటకొచ్చిన క్లారిటీ

హీరో అజిత్ ను కలిసిన సీఎం విజయ్.. ఫుల్ ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

పాలక్ తివారీ అందాల జాతర.. ఒక్క ఫొటోతో ఫుల్ వైరల్!

ఆ అక్కినేని హీరో ‘మనం’ సినిమా చూడలేదా? కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

చేతులు ఎత్తేశావా సర్దార్.. రెండో రోజుకే దుకాణం డౌన్!

త్రివిక్రమ్‌ మళ్లీ అదే తప్పు చేస్తున్నాడా? ‘ఆదర్శ కుటుంబం’పై మొదలైన డౌట్స్‌!

Big Stories

Advertisement
×