E-Paper
Advertisement

కయాదు లోహర్‌తో సూర్య రొమాన్స్….డైరెక్టర్ ఎవరో తెలుసా ?

కయాదు లోహర్‌తో సూర్య రొమాన్స్….డైరెక్టర్ ఎవరో తెలుసా ?
Advertisement

Suriya Movie: కోలీవుడ్ కి తొలిసారి వెయ్యి కోట్లు అందిస్తుంది అంటూ కంగువ ని ఆకాశానికి ఎత్తేశాడు సూర్య. కట్ చేస్తే సినిమా కనీస వసూల్లని రాబట్టలేకపోయింది.ఇక ఆ తర్వాత వచ్చిన రెట్రో హిట్టుకి,ప్లాప్ కి మధ్యలో ఊగిసలాడిన పరిస్థితి. సరిగ్గా ఈ సమయంలోనే వచ్చింది కరుప్పు.తెలుగులో వీరభద్రుడు గా వచ్చిన ఈ సినిమాతోనే మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కగలిగాడు సూర్య.

ఆస్కార్ నామినేషన్స్ రేసు వరకు వెళ్ళిన జై భీమ్ 

దీంతో ఇదే ఊపులో మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అవును…జై భీమ్ అనే సినిమాతో తనకి మెమరబుల్ హిట్ అందించిన టీజీ జ్ఞానవేల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండటం విశేషం.ఈ సినిమా సూర్య కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ క్లాసిక్ హిట్‌ మాత్రమే కాకుండా ఆస్కార్ నామినేషన్స్ రేసు వరకు వెళ్ళింది కూడా.

Advertisement

ఇక గతంలో విలక్షణమైన పాత్రలతో మెప్పించిన కయాదుకు, సూర్య లాంటి స్టార్ హీరో పక్కన నటించే ఛాన్స్ రావడం ఆమె కెరీర్‌కు పెద్ద ప్లస్ కానుందనడం లో ఆశ్చర్యం లేదు..ఇక కేజీఎఫ్, కాంతార, సలార్ వంటి బడా సినిమాలని తెరకెక్కించిన హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కరంగదూర్ ఈ సినిమాని నిర్మిస్తుండటం ఇక్కడ మరో విశేషం.ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ నటించే నటీనటులు ఎవరో త్వరలో మేకర్స్ అనౌన్స్ చేయనున్నారని సమాచారం.

సంగీతం అందిస్తున్న సాయి అభ్యంకర్

ఇక ఈసినిమాకి రాకా వంటి మోస్ట్ అవైటేడ్ విజువల్ వండర్ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్న ఈ తరం మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండటంతో అంచనాలు నెక్స్ట్ లెవల్ కి వెళ్ళిపోయాయి.చూడాలి మరి భారీ అంచనాలు మోస్తున్న ఈ కుర్ర మ్యుజిషియన్ ఎలాంటి ట్యూన్స్ అందిస్తాడో.ఇక ఈ సినిమాకి ఎడిటింగ్ ని ఫిలోమిన్ రాజ్ చేస్తుండగా, ఎస్.ఆర్. కతీర్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు.

వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరతాడో లేదో

Advertisement

ఇక ఇప్పటికే వెంకీ అట్లూరి దర్శకత్వంలో సోషల్ అండ్ ఫ్యామిలీ డ్రామా “విశ్వనాథ్ అండ్ సన్స్” ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ఆగస్ట్ లో రిలీజ్ కి రెడీ అయిపొయింది కూడా. వెంకీ నుండి లక్కీ భాస్కర్ వంటి సక్సెస్ ఫుల్ సినిమా తర్వాత వస్తుండటంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయ్ .ఏది ఏమైనా కరుప్పు తో ఎట్టకేలకి సక్సెస్ ట్రాక్ ఎక్కిన సూర్య కంగువ తో సాధ్యం కాని వెయ్యి కోట్ల క్లబ్ లోకి కనీసం ఈ సినిమా తో నైనా చేరతాడో లేదో కాలమే డిసైడ్ చేయాలి.

also read:ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబో షురూ.. ‘శివుని త్రిశూలం… డీఎన్‌ఏ రూపం’.. ఫస్ట్ లుక్‌తోనే అంచనాలు పీక్స్‌!

Tags

Related News

కాలిఫోర్నియా అందాల మధ్య మమతా మోహన్‌దాస్.. ఫొటోలు అదుర్స్!

శ్రీహరి బర్త్‌డే స్పెషల్.. పోతురాజు గెటప్‌లో మేఘాంశ్.. వెనుక తండ్రి!

తమన్ గొప్ప నిర్ణయం.. ఓల్డ్ ఏజ్ హోమ్ కోసం ఏకంగా 12 కోట్లు!

‘జార్జ్ క్రిష్’ శ్రీను వైట్ల జాతకం మారుస్తాడా ?

నేను హనుమంతుడి కుమార్తెని …. అనసూయ కామెంట్స్ వైరల్ !

సైబర్ మోసగాళ్ల చేతుల్లో నాగార్జున.. డిజిటల్ అరెస్టుపై షాకింగ్ కామెంట్!

ఆరేళ్లయినా వీడని మిస్టరీ.. సుశాంత్ ది ఆత్మహత్య కాదు హత్య అంటున్న సోదరి!

11 ఏళ్ల క్రితం ఆగిపోయిన త్రిష పెళ్లి.. నిశ్చితార్థం రోజు ఏం జరిగిందో తెలుసా?

Big Stories

Advertisement
×