E-Paper
Advertisement

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?
Advertisement

Viswanath And Sons : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ మమత బైజు జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం విశ్వనాథన్ అండ్ సన్స్.. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించగా.. రాధిక శరత్ కుమార్, బాలీవుడ్ స్టార్ రవీనా టాండన్, వైవా హర్ష తదితరుల నటిస్తున్నారు. ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో నిర్మించారు.. ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ సినిమాపై మంచి బజ్ ను తీసుకొచ్చాయి. ఈ సినిమా కోసం తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు అభిమానులు కూడా ఎంతగానో వెయిట్ చేశారు.. ఇవాళ భారీ అంచనాలతో ఈ మూవీ థియేటర్లలోకి వచ్చేసింది.. మొదటినుంచి మంచి హైప్ ను క్రియేట్ చేసుకున్న ఈ మూవీ ఎలాంటి టాక్ ను అందుకుందో అన్నది ట్విట్టర్ రివ్యూలో చూసేద్దాం..

తమిళ హీరో సూర్య చివరగా కరప్పూ చిత్రంతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో పాటుగా మంచి కలెక్షన్స్ ని కూడా వసూలు చేసింది.. ఆ తర్వాత వచ్చిన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాపై కూడా అంచనాలు కాస్త ఎక్కువగానే క్రియేట్ అయ్యాయి.. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చినట్లు తెలుస్తుంది.. మరి సినిమాపై నెటిజన్లు ఎలా రియాక్ట్ అవుతున్నారు..? సినిమా ఎలా ఉంది? కలెక్షన్లు పెరిగే అవకాశాలు ఉన్నాయా లేదా అన్నది ఇప్పుడు మనం ఒకసారి చూసేద్దాం..

Advertisement

నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది.. ఫస్ట్ ఆఫ్ సినిమాకు మంచి హైప్ ను క్రియేట్ చేసింది.. మొదటి 20 నిమిషాలు కాస్త స్లోగా సాగిన ఆ తర్వాత కదా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. భావోద్వేగ సన్నివేశాలు బాగా పండాయి. ఇందులో ప్రధానంగా నటించిన హీరో హీరోయిన్ల సన్నివేశాలు హైలెట్ గా నిలుస్తాయి అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు..

Advertisement

ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సినిమాలోని ప్రతి సీను అవుట్ స్టాండింగ్ లో ఉంది. పాన్ఇండియా మూవీగా రిలీజ్ అయిన ఈ సినిమా లో సూర్య లుక్ చాలా బాగుంది అంటూ ఓ నెటిజను ట్వీట్ చేస్తారు..

సూర్య నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీ ఎమోషన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, స్టోరీ జనాలని విపరీతంగా ఆకట్టుకుంటుంది. సూర్య నటనతో పాటు దర్శకుడు సినిమా తీసిన తీరు బాగుంది అంటూ మరో నెటిజను ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు..

కోలీవుడ్ హీరో సూర్య గత కొన్ని రోజులుగా చేస్తున్న సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ ని సొంతం చేసుకుంటున్నాయి.. ఇప్పుడు వచ్చిన ఈ సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ వస్తున్నట్లు తెలుస్తుంది. డిఫరెంట్ స్టోరీ తో ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.. సూర్య నటనకు మంచి మార్కులు పడ్డాయి.. వెంకీ అట్లూరి దర్శకత్వం బాగుంది అంటూ పబ్లిక్ చెబుతున్నారు.. అక్కడక్కడ కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నా సరే సినిమా స్టోరి హైలెట్ అవడంతో అవి పెద్దగా పట్టించుకునేలా కనిపించలేదు అంటూ కొందరి నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. అతనికి ఈ సినిమా మౌత్ టాక్ పాజిటివ్గా వినిపిస్తుంది. మరి ఇవాళ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి…

Related News

గాయాలతో హీరోయిన్.. ఫ్యాన్స్ ఆందోళన.. ఏం జరిగిందంటే..?

Theater Movies : ఇవాళ థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

ఒక్క సినిమా కెరీర్ మొత్తం మార్చేసింది.. ఇప్పుడు ఆమె రేంజ్ ఇదే!

రిలీజ్‌కు ముందే జైలర్ 2 రికార్డ్.. ఓటీటీ రైట్స్‌కు కళ్లు చెదిరే ధర!

రామ్ గోపాల్ వర్మతో సినిమా చేయడం వల్లే..తేజస్విని మదివాడ వైరల్ కామెంట్స్ !

ఈ వీకెండ్ సినిమాల జాతర.. బరిలో ఉన్నవి ఇవే!

బండ్ల గణేష్ ఇంట మొదలైన పెళ్లి సందడి.. ఘనంగా హల్దీ వేడుక!

Big Stories

Advertisement
×