The Raja Saab: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(Prabhas) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల కన్నప్ప సినిమా(Kannappa Movie)లో రుద్ర అనే పాత్ర ద్వారా వెండితెరపై ప్రేక్షకులను సందడి చేసిన ప్రభాస్ త్వరలోనే మారుతి (Maruthi)డైరెక్షన్ లో నటించిన ది రాజా సాబ్(The Raja Saab) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా డిసెంబర్ ఐదో తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ మాత్రం ఎంతో అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలను పెంచేసాయి.
స్పెషల్ సాంగ్ లో మిల్క్ బ్యూటీ..
ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్న విషయం తెలిసిందే. ప్రభాస్ కు జోడీగా నిధి అగర్వాల్(Nidhi Aggarwal), మాళవిక మోహననన్(Malavika Mohanan), రిద్ధి కుమార్(Riddhi Kumar) హీరోయిన్లుగా నటించబోతున్నారు అయితే ఇప్పుడు మరొక హీరోయిన్ కూడా ఈ సినిమాలో భాగమయ్యారని తెలుస్తోంది. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్, మిల్క్ బ్యూటీ తమన్నా (Tamannaah)భాగం కాబోతున్నారని సమాచారం. ఈ సినిమాలో డైరెక్టర్ మారుతి ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారని ఈ స్పెషల్ సాంగ్ చేయడం కోసం తమన్నా ఫైనల్ అయ్యారని తెలుస్తోంది. ఇక ఇటీవల కాలంలో తమన్న పెద్ద ఎత్తున స్పెషల్ సాంగ్స్ ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
మరోసారి తమన్నాతో ప్రభాస్..
ఈ క్రమంలోనే ది రాజా సాబ్ సినిమాలో కూడా ఈమె స్పెషల్ సాంగ్ చేయబోతున్నారని త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారక ప్రకటన రాబోతుందని తెలుస్తోంది. అయితే ఇదివరకే ప్రభాస్ తమన్నా కాంబినేషన్లో బాహుబలి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి డార్లింగ్ తో కలిసి తమన్న నటించే ఛాన్స్ అందుకున్నారు. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ల గురించి గతంలో మారుతి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా ప్రభాస్ సినిమాలో హీరోయిన్లు ఉన్నా లేనట్టు ఉన్నారని అందుకే ఈ సినిమాలో నాకు ఇద్దరు హీరోయిన్లను పెట్టు డార్లింగ్ అంటూ ప్రభాస్ అడిగారని మారుతి తెలియజేశారు.
ఇద్దరు హీరోయిన్లు కావాలి డార్లింగ్..
ఇలా ప్రభాస్ ఇద్దరు హీరోయిన్లు కావాలని అడగడంతో మారుతి ఇద్దరు ఏంటి డార్లింగ్ నీ కోసం ముగ్గురినైనా పెడతాను అంటూ చివరికి ప్రభాస్ కోసం నలుగురు హీరోయిన్లను దింపారని తెలుస్తోంది. ఇలా స్పెషల్ సాంగ్ లో డార్లింగ్ సరసన మరోసారి తమన్నా కనిపించబోతున్నారనే విషయం తెలియడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఈ చిత్రం హర్రర్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఇటీవల విడుదల చేసిన టీజర్ చూస్తేనే స్పష్టం అవుతుంది. ఈ సినిమాలో వింటేజ్ ప్రభాస్ ను చూడబోతున్నామని తెలుస్తోంది. ప్రభాస్ నటనతో పాటు ఆయన లుక్స్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
Also Read: ఫిష్ వెంకట్ కు అండగా యూట్యూబర్.. హీరోలకు సిగ్గుచేటు!