E-Paper
Advertisement

కోలీవుడ్ వెయ్యి కోట్లు చూసేనా ?

కోలీవుడ్ వెయ్యి కోట్లు చూసేనా ?
Advertisement

Jailer 2:రూ.100 కోట్లు.. ఒకప్పుడు ఇండియన్ సినిమాలు ఈ మార్కు అందుకుంటాయా అన్న అనుమానం ఉండేది.కానీ ఇపుడు ట్రెండ్ మారింది.ఈజీగా హిందీ ,తెలుగు ,తమిళ సినిమాలు రూ.200-300 కోట్ల రేంజ్‌ను టచ్ చేయడం కామన్ అయిపొయింది.దాంతో ఇపుడు లెక్కంత వెయ్యి కోట్లకి చేరింది.

ముఖ్యంగా తెలుగు సినిమా ‘బాహుబలి’పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటడంతో లెక్కలే మారిపోయాయి.అలా మొదలైన ట్రెండ్ ‘బాహుబలి 2’తో మరో స్థాయికి వెళ్లింది. ఆ తర్వాత ‘దంగల్’, ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్ 2’, ‘పుష్ప 2: ది రూల్’, ‘కల్కి 2898 ఏడీ’ వంటి సినిమాలతో ఇండియన్ సినిమా మార్కెట్ ఎంత విస్తరించింది.

Advertisement

దాంతో ఒకప్పుడు కష్టం అనిపించినా రూ.500 కోట్ల గ్రాస్ ఇప్పుడు పెద్ద సినిమాలకు ఒక టార్గెట్‌ అయితే మారింది. ఇక రూ.1000 కోట్ల మార్క్ మాత్రం ఇండియన్ బాక్సాఫీస్‌లో కొత్త బెంచ్‌మార్క్‌గా నిలిచిపోయిందని చెప్పాలి.

అయితే ఈ రేసులో తమిళ్ సినిమా మాత్రం ఇంకా వెనుకబడి ఉండటమే కాస్త ఆశ్చర్యం. తమిళ్ ఇండస్ట్రీ నుంచి ఎన్నో భారీ అంచనాలున్న సినిమాలు వచ్చినప్పటికీ రూ.1000 కోట్ల గ్రాస్ మార్క్‌ను మాత్రం అందుకోలేకపోయాయి. భారీ బడ్జెట్, స్టార్ హీరో, పాన్ ఇండియా రిలీజ్, భారీ ప్రమోషన్స్ ఉన్న సినిమాలు వచ్చినా ఆ మ్యాజిక్ నంబర్ దగ్గరకు కూడా వెళ్లలేకపోవడం గమనార్హం.

Advertisement

అలా ‘కబాలి’, ‘2.0’, ‘పొన్నియిన్ సెల్వన్ 1’, ‘పొన్నియిన్ సెల్వన్ 2’ వంటి సినిమాలు భారీ స్థాయిలో వచ్చినప్పటికీ వెయ్యి కోట్ల గ్రాస్ ని టచ్ చేయలేకపోయాయి.ముఖ్యంగా శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన ‘2.0’ సమయంలో తమిళ్ సినిమా నుంచి వెయ్యి కోట్ల మార్క్ వస్తుందని అనుకున్నారంతా. కానీ ఆ సినిమా కూడా బోల్తా కొట్టేందే.

ఇక సూర్య‘కంగువ’ ఏకంగా రెండు వేల కోట్లు కొల్లగొడుతుందని కాలర్ ఎగరేసి మరీ చెప్పారు మేకర్స్.కానీ కానీ విడుదల తర్వాత కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాబట్టలేకపోయింది.

ఇక లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన ‘కూలీ’పై కూడా ఇలాగే అంచనాలు పెంచుకున్నారు.కానీ కూలీ కాస్తా బాక్సాఫీస్ వద్ద ఖాళీ అయిన పరిస్థితి.

ఇక విజయ్ నటించిన ‘జననాయగన్’ విషయంలోనూ పాన్ ఇండియా స్థాయిలో భారీ కలెక్షన్స్ వస్తాయని అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. విజయ్‌కు తమిళనాడులో ఉన్న మార్కెట్‌తో పాటు ఇతర భాషల్లో కూడా సినిమాకు క్రేజ్ పెరిగితే వెయ్యి కోట్లు పక్కా అనుకున్నారు .కానీ ఈ సినిమా కూడా కోలీవుడ్ కి హ్యాండ్ ఇచ్చింది.

ఇప్పుడు అందరి చూపు మరోసారి రజినీకాంత్ ‘జైలర్ 2’పై పడింది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘జైలర్’ మొదటి భాగం బాక్సాఫీస్ దగ్గర 600 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టిన సంగతి తెల్సిందే. దీనికి ప్రధాన కారణం.

రజినీకాంత్ మాస్ ఇమేజ్‌కు నెల్సన్ స్టైల్ కామెడీ, యాక్షన్, అనిరుధ్ మ్యూజిక్, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ స్పెషల్ అప్పియరెన్స్‌లు అని చెప్పాలి.దీంతో ఇపుడు జైలర్ సీక్వెల్ గా వస్తున్న జైలర్ 2 పై న్యాచురల్ గానే అంచనాలు పెట్టుకుంది కోలీవుడ్.చూడాలి మరి కోలీవుడ్ ఆశల్ని మన తలైవా ఏ మేరకి నెరవేరుస్తాడో !

ALSO READ :తెలంగాణ..రాయలసీమ.. ఉత్తరాంధ్ర..సినిమాలకి ఇదేం లెక్క? నరేష్ ఫైర్!

Tags

Related News

వరంగల్ నుంచి వచ్చిన ఈ అమ్మాయి.. ఒక్క సినిమాకు లక్షల్లో రెమ్యునరేషన్!

ఓవరాక్షన్ అనుకున్న పర్వాలేదు.. వారికి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన రష్మిక!

జగపతిబాబునే ఇమిటేట్ చేసిన అభిమాని.. హీరో అదిరిపోయే రియాక్షన్.. వీడియో వైరల్!

27 ఏళ్ల తర్వాత చిరుతో జతకట్టబోతున్న రమ్యకృష్ణ.. ఈ ట్విస్ట్ ఏంటి బాస్?

తెలంగాణ..రాయలసీమ.. ఉత్తరాంధ్ర..సినిమాలకి ఇదేం లెక్క? నరేష్ ఫైర్!

రీషూట్ చేయాల్సిందేనా? ఆదర్శ కుటుంబం వాయిదాకు ఇదే కారణమా?

సినీ ఇండస్ట్రీలో విషాదం..బిల్లా 2 నిర్మాత మృతి.

Big Stories

Advertisement
×