KTR Slams Rahul Gandhi: దేశానికి ప్రధానమంత్రి కావాలనుకుంటున్న రాహుల్ గాంధీ ఒక పిరికివారిలా, నిరంకుశంగా, అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అరెస్ట్‌పై మంగళవారం ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అవినీతిని ఆధారాలతో ప్రశ్నించినందుకే క్రిశాంక్‌ను అక్రమంగా అరెస్ట్ చేయించారని ఆరోపించారు.
ఢిల్లీలో రాజ్యాంగం గురించి ఉపన్యాసాలు దంచుతూ.. తెలంగాణలో అరాచక పాలనను కాంగ్రెస్ సాగిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బరితెగించి ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందన్నారు. గల్లీల్లో తిరుగుతూ ‘ఓటు చోరీ’ అని రాహుల్ అరుస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఎవరిపై పడితే వారిపై నిరాధార ఆరోపణలు చేయొచ్చు కానీ, ఆధారాలతో ప్రశ్నిస్తే క్రిశాంక్‌ను జైలుకు పంపుతారా? అని కేటీఆర్ నిలదీశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదుపులో పెట్టుకోవాలని, భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడం ఇకనైనా ఆపాలని రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు.
Also Read: సుప్రీంకోర్టుకు కొత్త జడ్జీలు.. ముగ్గురి చేత సీజేఐ ప్రమాణ స్వీకారం.. 37కు చేరిన న్యాయమూర్తుల సంఖ్య!
మరోవైపు విధి నిర్వహణలో బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై సికింద్రాబాద్ కిమ్స్ లో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ దేవసోత్ శంకర్ కుటుంబానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. శంకర్ వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని తెలిపారు. ఈ విషయాన్ని శంకర్ కుటుంబ సభ్యులకు తెలియజేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సూచించారు. శంకర్ పూర్తిగా కోలుకునే వరకు కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Also Read: రూ15,000 లోపే 6000mAh బ్యాటరీ, డ్యూయల్ స్క్రీన్.. హానర్ కొత్త ఫోన్ లాంచ్!