Allu Arjun-Atlee : గత ఏడాది పుష్ప 2 మూవీతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఒకవైపు విమర్శలు అందుకున్న కూడా మరోవైపు మాత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. మొత్తానికి ఈ మూవీ అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.. త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపించిన ఫైనల్ గా తమిళ డైరెక్టర్ అట్లీతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న నిర్మాతలు, కాస్టింగ్ నుండి టెక్నికల్ టీమ్ దాకా ప్రతి అంశంలో రాజీ లేకుండా ప్లాన్ చేస్తున్నారు.. హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్టార్ కమెడియన్ స్పెషల్ గెస్ట్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.
అల్లు అర్జున్ – అట్లీ మూవీలో స్పెషల్ గెస్ట్..
పుష్ప 2 తర్వాత రాబోతున్న ఈ మూవీ కోసం బన్నీ ఫ్యాన్సు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా స్టోరీ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని ఆతృత కనబరుస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోణే నటిస్తుండటం ఇప్పటికే సినిమా మీద భారీ అంచనాలను పెంచింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో తమిళ స్టార్ కమెడియన్ యోగి బాబు కూడా నటించబోతున్నట్లు టాక్. మృణాల్ ఠాకూర్ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే ‘జవాన్’ సినిమాలో అట్లీ – యోగిబాబు కాంబినేషన్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.. డైరెక్టర్ ఇప్పటికే ఎన్నో హిట్ చిత్రాలను అందించారు. ఇప్పుడు ఈ చిత్రం కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని బన్నీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు..
Also Read : బిగ్ బాస్ అగ్నిపరీక్ష జడ్జిలు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
అట్లీ ఖాతాలో మరో రికార్డ్..?
గతంలో వచ్చిన జవాన్ మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో మరో బిగ్ బడ్జెట్ విజన్‌ను తెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై నాన్-థియేట్రికల్, డిజిటల్ రైట్స్ కోసం భారీ డిమాండ్ నెలకొనడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. బన్నీ, దీపికా పదుకోనే, అట్లీ ముగ్గురు కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. అందులోను ఈ సినిమాకు హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా పనిచేయడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.. మరి అభిమానుల అంచనాలను ఏ మాత్రం రీచ్ చేయాలా స్టోరీని అట్లీ చూపిస్తాడో చూడాలి.. త్వరలోనే ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ రాబోతున్నట్లు సమాచారం. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే.. ఈ మూవీ తర్వాత మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది.