BigTV English

Ustaad Bhagat Singh: ఉస్తాద్ లో అడుగుపెట్టిన రాశీ ఖన్నా.. ఏ పాత్రలో నటిస్తుందో తెలుసా.. ?

Ustaad Bhagat Singh: ఉస్తాద్ లో అడుగుపెట్టిన రాశీ ఖన్నా.. ఏ పాత్రలో నటిస్తుందో తెలుసా.. ?

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తాను పెండింగ్ లో పెట్టిన సినిమాలన్నీ క్లియర్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పటికే హరిహర వీరమల్లు రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇది కాకుండా ఓజీని కూడా ఫినిష్  చేశాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఓజీ.. సెప్టెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు కాకుండా ప్రస్తుతం పవన్ చేతిలో ఇంకో సినిమా ఉంది. అదే ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన గబ్బర్ సింగ్ సినిమాకు దర్శకత్వం వహించిన హరీష్ శంకర్.. ఉస్తాద్ భగత్ సింగ్ కు దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన శ్రీలీల నటిస్తోంది.


 

ఇక ఉస్తాద్.. కోలీవుడ్ లో హిట్ అయిన తేరి సినిమాకు రీమేక్ అని అందరికీ తెల్సిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ తో పాన్ ఇండియా సినిమా తీస్తున్న అట్లీ.. తేరి సినిమాకు దర్శకత్వం వహించాడు. విజయ్ హీరోగా నటించిన ఈ సినిమాలో సమంత, అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటించారు. అయితే హరీష్ తెలివిగా తేరి సినిమాను మక్కీకి మక్కీ దించకుండా కేవలం లైన్ మాత్రమే తీసుకొని.. తెలుగు వారికి నచ్చేలా కథను రాసుకున్నాడు. ఇదేమి హరీష్ శంకర్ కు కొత్తేమి కాదు. మిస్టర్ బచ్చన్ సినిమా కూడా అలానే తెరకెక్కించాడు. బాలీవుడ్ లో హిట్ అయిన రైడ్ సినిమా లైన్ తీసుకొని.. రవితేజతో రీమేక్ చేశాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది.


 

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిపోవడంతో.. ఉస్తాద్ ఉండదు అనుకున్నారు. కానీ, హరీష్ అదృష్టం.. పవన్ డేట్స్ ఇవ్వడంతో.. ఉస్తాద్ ను పట్టాలెక్కించి ఫాస్ట్ గా లాగించేసున్నాడు. ఈ మధ్యనే హరీష్ స్క్రిప్ట్ ఇవ్వలేదని పవన్ సీరియస్ అయ్యి వెళ్లిపోయాడని టాక్ నడిచింది. దాంతోనే ఉస్తాద్ సినిమా మధ్యలోనే ఆగిందని వార్తలు వచ్చాయి. ఇక  ఈలోపే మేకర్స్.. ఉస్తాద్  నుంచి మరో హీరోయిన్ ను అభిమానులకు అధికారికంగా పరిచయం చేశారు. టాలీవుడ్ లో హిట్ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రాశీ ఖన్నాను ఉస్తాద్ లోకి ఆహ్వానిస్తూ మేకర్స్ ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

Brahmanandam: బండ్లన్న లేని లోటు తీర్చిన బ్రహ్మీ.. చాలు సామీ చాలు

 

ఉస్తాద్ భగత్ సింగ్ లో రాశీ ఖన్నా శ్లోకా అనే పాత్రలో నటిస్తుందని తెలిపారు. నేడు ఈ చిన్నదాని పుట్టినరోజు కావడంతో పోస్టర్ రిలీజ్ చేసి అమ్మడికి బర్త్ డే విషెస్ కూడా తెలిపారు. తేరిలో విజయ్ భార్యగా సమంత నటించగా.. గర్ల్ ఫ్రెండ్ గా అమీ జాక్సన్ నటించింది. ఇప్పటికే అమీ జాక్సన్ పాత్రలో శ్రీలీల నటిస్తుందని కన్ఫర్మ్ అయ్యింది. ఇక ఇప్పుడు సామ్ పాత్రలో రాశీ ఖన్నా నటిస్తున్నట్లు తెలుస్తోంది. తేరి సినిమాకు ప్లాష్ బ్యాక్ నే ప్రాణం. అందులో విజయ్- సమంత ల మధ్య ప్రేమ, పెళ్లి.. రొమాన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఇప్పుడు ఆ పాత్రలో రాశీ ఖన్నా నటిస్తుంది అంటే.. ఎంతో ప్రాధాన్యత ఉన్న పాత్రనే అమ్మడు పట్టేసింది.

 

ఇక ఈ చిత్రంలో రాశీ ఖన్నా ఫోటోగ్రాఫర్ గా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. మెడలో కెమెరా వేసుకొని నవ్వుకు చిందిస్తూ కనిపించింది రాశీ. శ్రీలీల ఏమో కానీ, రాశీ మాత్రం ఆ పాత్రకు బాగా సూట్ అయ్యిందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. మరి ఈ సినిమాతోనైనా హరీష్ శంకర్ మంచి హిట్ ను అందుకుంటాడేమో చూడాలి.

Related News

Vedhika: బికినీలో కూడా నటిస్తా.. గట్టి కౌంటర్ ఇచ్చిన వేదిక.. ఏమైందంటే?

Bandla Ganesh: మరోసారి అల్లు అరవింద్‌పై బండ్లన్న కామెంట్స్‌.. అంతమాట అనేశాడేంటి..

Manchu Lakshmi: హాస్పిటల్ బెడ్ పై మంచు లక్ష్మీ.. ఆందోళనలో ఫ్యాన్స్!

Manchu Lakshmi: రామ్ చరణ్ ఇంట్లో ఉన్న మంచు లక్ష్మి… టాప్ సీక్రెట్ రివీల్

Poonam Pandey: రామాయణ కీలక పాత్రలో పూనమ్ పాండే.. మండిపడుతున్న హిందూ సంఘాలు

Dhanush: అదే నా కల.. అందుకే మీ సినిమాలలో ఆ పాత్రలు చేస్తున్నారా సార్!

Allu Sneha: స్నేహ రెడ్డికి ఈ ఫోటో అంటే అంత ఇష్టమా.. అంత స్పెషల్ ఏంటబ్బా?

Pasivadi Pranam Film: చిరు పసివాడి ప్రాణం చైల్డ్ ఆర్టిస్ట్ ఆ హీరోయినేనా.. ఇప్పుడు ఎలా ఉందంటే?

Big Stories

×