BigTV English

Sheila Singh : సాక్షి తల్లి చేతిలో 800 కోట్ల బిజినెస్… ధోని అత్తగారి బ్యాగ్రౌండ్ మామూలుగా లేదుగా !

Sheila Singh :  సాక్షి తల్లి చేతిలో 800 కోట్ల బిజినెస్… ధోని అత్తగారి బ్యాగ్రౌండ్ మామూలుగా లేదుగా !

Sheila Singh : టీమిండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. అతను ఎంతలా కష్టపడుతాడో  ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ పేరే ఓ ఎమోషన్ టీమిండియా దిగ్గజ కెప్టెన్ గా నీరాజనాలు అందుకుంటునన మిస్టర్ కూల్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోనూ తనకు తానే  సాటి అని నిరూపించుకుంటున్నాడు. 43 ఏళ్ల వయస్సులో కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున ఆడుతున్నాడు. ఇదిలా ఉంటే.. వ్యాపార రంగం గురించి పరిశీలించినట్టయితే.. ఇప్పటికే పలు వ్యాపార సంస్థల్లో పెట్టుబడి పెట్టిన ధోనీ.. సినీ రంగంలోకి కూడా కాలు మోపాడు. ధోనీ ఎంటర్టైన్ మెంట్ లిమిటేడ్ పేరిట ప్రొడక్షన్ హౌజ్ కూడా ఏర్పాటు చేసాడు.


పిల్లనిచ్చిన అత్త.. సీఈవోగా బాధ్యతలు

అయితే ఆ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ధోనీకి పిల్లనిచ్చిన అత్తగారు షీలా సింగ్ అట..! తన ప్రొడక్సన్ హౌజ్ లో కుటుంబ సభ్యులకు పెద్ద పీట వేయాలని భావించిన ఎంఎస్ ధోనీ.. భార్య సాక్షి సింగ్,  ఆమె తల్లి షీలా సింగ్ కి కీలక బాధ్యతలు అప్పగించాడు. సౌత్ లో తమ బ్యానర్ పై పలు సినిమాలు నిర్మిస్తున్న ధోనీ ఎంటర్టైన్ మెంట్ లిమిటేడ్ విలువ దాదాపు రూ.800 కోట్లు ఉంటుందని అంచెనా వేశారు. ఈ కంపెనీలో సాక్షి బిగ్గెస్ట్ షేర్ హోల్డర్ గా ఉన్నట్టు సమాచారం. మరోవైపు ధోనీ భార్య సాక్షి తండ్రి ఆర్.కే.సింగ్, ధోనీ తండ్రి పాన్ సింగ్ గతంలో వీరిద్దరూ ఒకేచోట పరిచేశారట. బినాగురి అనే టీ కంపెనీలో సహోద్యోగులు అని సమాచారం. ఆ సమయంలో గృహిణిగా ఇంటి బాధ్యతలు నిర్వర్తించిన షీలా సింగ్.. అల్లుడు ధోనీ విజ్ఞప్తి మేరకు కూతురుతో కలిసి బిజినెస్ ఉమెన్ గా కొత్త అవతారమెత్తింది. 


ధోనీ ఆదాయం రూ.1030 కోట్లు

ఇక ప్రస్తుతం ధోనీ ఆదాయం దాదాపు రూ.1030 కోట్ల వరకు ఉంటుందని పలు నివేదికలు అంచెనా వేసాయి. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ఉన్న ధోనీ ఇప్పటివరకు ఆ జట్టుకు ఐదుసార్లు ట్రోఫీని అందించాడు. టీమిండియా ఫినిషర్ గా పలు చిరస్మరణీయ విజయాలు అందించిన ధోనీ తన కెరీర్ లో 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ-20 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాడు. టెస్టుల్లో 4896, వన్డేల్లో 10773, టీ-20ల్లో 1617 పరుగులు సాధించాడు. 2020 ఆగస్టు 15న ఇంటర్నేషనల్ క్రికెట్ కి గుడ్ బై చెప్పేశాడు ధోనీ. ప్రస్తుతం ఐపీఎల్ లో కొనసాగుతున్నాడు. ఇధిలా ఉంటే.. ధోనీ-సాక్షి జులై 04, 2010లో పెళ్లి బంధంతో ఒక్కటి అయ్యారు. 2015 ఫిబ్రవరి 6న వీరికి కూతురు జివా జన్మించింది. మరోవైపు ధోనీ లెప్టినెంట్ కర్నల్ హోదాలో 2011 నుంచి చేస్తున్నారు. పారాచూట్స్ రెజిమెంట్ లోని 106వ టీఏ బెటాలియన్ లో విధులు నిర్వహిస్తున్నారు.

Related News

Suryakumar Yadav : పాకిస్తాన్ వాళ్ళతో చేతులు కలిపిన సూర్య కుమార్… నమ్మకద్రోహం అంటూ ట్రోలింగ్!

Lalit Modi : ఇండియాను నిండా ముంచిన లలిత్ మోడీ అదిరిపోయే ప్లాన్.. ఫుట్ బాల్ వద్దు.. కబడ్డీ ముద్దు అంటూ

Mornie Morkel : పాకిస్తాన్ వీక్నెస్ మాకు తెలుసు.. వాళ్లను చావు దెబ్బ కొడతాం… టీమిండియా కోచ్ వార్నింగ్

Sachin-Sara : సచిన్ కు షాక్… సంపాదనలో తండ్రిని దాటిన సారా టెండూల్కర్.. ఒక్క పోస్టుకు ఎంత రేటు అంటే

Harbhajan Singh : భ‌జ్జీ రియ‌ల్ హీరో…వ‌ర‌ద బాధితుల కోసం భారీ సాయం..3 అంబులెన్సులు కూడా

Rishab Pant : చిన్నపిల్లడిలా కటింగ్ చేయించుకున్న పంత్… టీమిండియాలోకి రీ ఎంట్రీ అప్పుడే..

×