E-Paper
Advertisement

తేదీలు, వారాల పేర్లతో వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీస్ ఇవే.. అనిల్ ప్లాన్ అదుర్స్!

తేదీలు, వారాల పేర్లతో వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీస్ ఇవే.. అనిల్ ప్లాన్ అదుర్స్!
Advertisement

Movies with Date and Day Titles:జనవరి 12 విడుదల….ఇదీ అనిల్ రావిపూడి తన సరికొత్త సినిమాకి పెట్టిన టైటిల్.అయితే ఇలా నెలల పేర్లు, వారాల పేర్లు,తేదీల పేర్లు సినిమాలకి పెట్టడం ఇదే మొదటి సారి కాదు.గతంలోనూ పలు దర్శకులు ఇలా సరికొత్తగా తమ సినిమాలకి ఇలా పేర్లు పెట్టినవారే. ఇక అనిల్ ఇలా టైటిల్ వదలడంతో ఈ సినిమాల పేర్లు కూడా తెగ చక్కర్లు కొడుతున్నాయి. మరింతకీ ఇలా క్రేజీగా వచ్చిన ఆ సినిమాలేంటో ఎవరి దర్శకత్వంలో వచ్చాయో మనమూ తెలుసుకుందాం.

ఏప్రిల్ 1 విడుదల

ముందుగా అనిల్ మా సినిమా పేరు జనవరి 12 విడుదల..అని రివీల్ చేయగానే మనకు గుర్తొచ్చిన సినిమా వంశీ దర్శకత్వంలో వచ్చిన ఏప్రిల్ 1 విడుదల.పూల్స్ డే కాన్సెప్ట్ ని ఆధారంగా తీసుకుని చేసిన ఈ సినిమా ఇప్పటికీ ఎవర్ గ్రీన్.రాజేంద్రప్రసాద్, శోభన జంటగా నటించగా ఇళయరాజా అందించిన సంగీతం ఈ సినిమాని మరో లెవెల్ కి తీసికెళ్ళింది.

అమ్మో ఒకటో తారీఖు

Advertisement

ఇక ఇదే క్రమంలో తేదీపై వచ్చి సూపర్ హిట్ అయిన మరో సినిమా అమ్మో ఒకటో తారీఖు. 2000సంవత్సరంలో వచ్చిన ఈ సినిమాలో మిడిల్ క్లాస్ జీవితాల్లో జీతం వచ్చే మొదటి తారీఖు ఎలా ఉంటుందో, ఆ తర్వాత ఆ జీతం తో కుటుంబాన్ని నడిపేందుకు ఒక మధ్య తరగతి వాడు ఎన్ని కష్టాలు పడుతాడో చాలా ఎమోషనల్ గా తెరకెక్కించాడు డైరెక్టర్ EVV. ఇందులో ఎల్. బి. శ్రీరామ్ తనలోని నటుడిని సరికొత్తగా పరిచయం చేసి కన్నీళ్లు పెట్టించింది ఈ సినిమాతోనే.ఇక శ్రీకాంత్, రాశి, ప్రేమ, సురేష్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా అప్పట్లో అమ్మో సూపర్ హిట్టు అనిపించుకుంది కూడా.

ఆగస్టు 15 రాత్రి

ఇక తేదీపై వచ్చిన మరో సినిమా ‘ఆగస్టు 15 రాత్రి’ (1988).స్వాతంత్ర్య దినోత్సవం అయిన ఆగస్టు 15ను టైటిల్‌లో పెట్టుకుని వచ్చిన ఈ చిత్రం దేశభక్తి సినిమా కంటే డ్రామా, యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ సినిమా ఎక్కువగా సాగడం విశేషం.ఇక ఈ సినిమాలో అర్జున్, శరత్‌బాబు, గౌతమి నటించగా జీ. రెడ్డి శేఖర్, జె. గోపాల్ రెడ్డి, పి. పార్థసారథి రెడ్డి నిర్మాణంలో పీ.ఎన్. రామచంద్రరావు దర్శకత్వం వహించారు.

సరిపోదా శనివారం

Advertisement

అలా కొన్నేళ్ళ క్రితం వరకు తేదీలని సినిమా టైటిల్స్ గా పెట్టిన మేకర్స్ గత కొంతకాలంగా వారాలపై టైటిల్స్ పెడుతుండటం విశేషం. వీటిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన సినిమా సరిపోదా శనివారం (2024).న్యాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు.మిగతా రోజుల్లో తన కోపాన్ని అణుచుకుని శనివారం ఒక్క రోజే విలన్ పై తన కోపాన్ని తీర్చుకునే యూనిక్ పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

మంగళవారం

ఇక RX 100 , మహాసముద్రం సినిమాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన మూడో సినిమా ‘మంగళవారం (2023)’ సస్పెన్స్ థ్రిల్లర్‌లో ప్రతీ మంగళవారం గ్రామంలో జరిగే వింత మరణాల వెనుక ఉన్న రహస్యాన్ని చాలా ఆసక్తిగా తెరకెక్కించాడు అజయ్ భూపతి.ఇక ఈ సినిమాలో నింఫోమేనియా వంటి అరుదైన డిజార్డర్ తో బాధపడే పాత్రలో పాయల్ రాజ్ పుత్ నటన సినిమాకే హైలెట్.

తెల్లవారితే గురువారం

ఇక మత్తు వదలరా వంటి సాలిడ్ హిట్ తర్వాత శ్రీ సింహ హీరోగా వచ్చిన సినిమా ‘తెల్లవారితే గురువారం (2021).మణికాంత్ గెల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ముఖ్యంగా ప్రేమ, పెళ్లి, రిలేషన్‌షిప్స్ చుట్టూ తిరిగే రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కింది. ‘తెల్లవారితే గురువారం’ అనే టైటిల్ కూడా కథలోని పెళ్లి జరిగే ఉదయం, ఆ ఒక్క రాత్రిలో జరిగే సంఘటనలతో చాలా ఆసక్తి కరంగా సాగుతుంది. పెళ్లి పీటల మీద నుంచి పారిపోవాలనుకునే హీరో చుట్టూ తిరిగే ఈ సినిమా’ గురువారం తెల్లవారేలోపు ఏం జరిగిందనే క్యూరియాసిటీని పెంచింది.

ఆదివారం ఆడవాళ్లకు సెలవు

ఇక వారం ఆధారంగా వచ్చి అందరిని నవ్వుల్లో ముంచెత్తి ఎమోషనల్ చేసిన సినిమా ఆదివారం ఆడవాళ్లకు సెలవు(2007) రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ముఖ్యంగా ఆఫీసుల్లో పనిచేసే భర్తలకి ఆదివారం అయినా సెలవు ఉంటుంది కాని ఇంట్లో ఉండే ఆడవాళ్ళు మాత్రం ఆదివారం కూడా ఏ మాత్రం రెస్ట్ తీసుకోకుండా కుటుంబం కోసం పని చేస్తారు. కనీసం ఇంట్లో ఉండే మహిళలకు ఒక రోజైనా సెలవు ఉంటే ఎలా ఉంటుందనే సరదా పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది కూడా

ముందు ముందు మరిన్ని వస్తాయో !

మనం రోజూ తేదీలని, వారాలని చూస్తూనే ఉంటాం.దాంతో ఆ టైటిల్స్ పెడితే . “అసలు ఆ రోజే ఏం జరిగింది?” అనే క్యూరియాసిటీ ఆడియన్స్ కి సహజంగానే కలుగుతుంది. ఇదిగో దీన్నే క్యాచ్ చేసుకునేందుకు మేకర్స్ ఇలా వారాలు, తేదీలపై ఫోకస్ చేసి టైటిల్స్ పెడుతుంటారు.ఇపుడు అనిల్ రావి పూడి కూడా అదే పని చేశాడు.మొత్తానికి గత సినిమాల సక్సెస్ లని దృష్టిలో పెట్టుకొని పక్కాగానే ప్లాన్ చేశాడన్న మాట.ఇక అనిల్ రావి పూడి జనవరి 12 విడుదల అన్న పేరు రివీల్ చేశాక వచ్చే రోజుల్లో మరిన్ని వారాలు, తేదీలు పోస్టర్ లపై తళుక్కుమన్నా ఆశ్చర్యం లేదు !

also read :ఆడవాళ్లే ఆడవాళ్లను ఎందుకంటే ..శ్రావణ భార్గవి షాకింగ్ కామెంట్స్!

Tags

Related News

నా బెడ్ రూమ్ గురించి పగటి కలలు కనొద్దు.. బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఫైర్!

ఎన్టీఆర్, భూమిక మూవీల తర్వాత మాదే.. ‘మోడ్రన్ మిస్సమ్మ’ నుండి ఫస్ట్ సింగిల్!

‘ఇరుముడి’ హిట్ అవ్వాలంటే ఎంత రాబట్టాలో తెలుసా..?

పవిత్ర గౌడ మాజీ భర్త మృతి.. అసలేం జరిగిందంటే?

తాడ్‌బండ్ ఆలయంలో వరుణ్ తేజ్, లావణ్య ప్రత్యేక పూజలు..

Theater Release : ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

ఆడవాళ్లే ఆడవాళ్లను ఎందుకంటే ..శ్రావణ భార్గవి షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×