E-Paper
Advertisement

2024 టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో టెస్ట్ ప్లేయ‌ర్ కంటే దారుణంగా ఆడాడు…కోహ్లీ ప‌రువు తీసిన అక్ష‌ర్ ప‌టేల్!

2024 టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో టెస్ట్ ప్లేయ‌ర్ కంటే దారుణంగా ఆడాడు…కోహ్లీ ప‌రువు తీసిన అక్ష‌ర్ ప‌టేల్!
Advertisement

Axar Patel On Virat Kohli:  టీ20 వరల్డ్ కప్ 2024 ట్రోఫీని టీమిండియా దక్కించుకున్న సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ కెప్టెన్సీ లోని టీమిండియా ఫైనల్స్ లో అద్భుతంగా రాణించి దక్షిణాఫ్రికాను ఓడించింది. ఈ క్రమంలో రెండవ సారి టైటిల్ అందుకుంది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ప్రదర్శనపై తాజాగా టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీ20 క్రికెట్ లో చాలా సార్లు విరాట్ కోహ్లీ స్లోగా ఆడాడని.. టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా కూడా ఇదే ప్రదర్శన కనబరిచాడని వెల్లడించారు. కానీ స్లో గా ఆడినా, టీమిండియా గెలిచింద‌న్నారు.

రాణించిన కోహ్లీ… టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌గా టీమిండియా

టి20 ప్రపంచ కప్ 2024 టోర్నమెంట్ ( ICC Mens T20 World Cup 2024) విజేతగా టీమిండియా ( Team India) నిలిచింది. రోహిత్ శర్మ కెప్టెన్సీ లోనే టీమిండియా… అద్భుతంగా రాణించి ఫైనల్ లో విజయ కేతనం ఎగురవేసింది. ఈ ఫైనల్ మ్యాచ్ టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా (South Africa vs India, Final) మధ్య జరిగింది. కింగ్ స్ట‌న్ ఓవల్ ( Kensington Oval, Bridgetown, Barbados) వేదికగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా మొదటి బ్యాటింగ్ చేసి 20 ఓవర్లు ఆడింది. ఈ క్రమంలో ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో దక్షిణాఫ్రికా చివరి వరకు పోరాడి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు సాధించింది. దీంతో ఏడు పరుగుల తేడాతో టీమిండియా చేతిలో ఓడిపోయి, టైటిల్ కోల్పోయింది దక్షిణాఫ్రికా.

Advertisement

Shoaib Akhtar ON Mohammad Amir: ఐపీఎల్ 2027లో మహ్మద్ అమీర్ ను ఆడించండి..బీసీసీఐకి అక్త‌ర్ రిక్వెస్ట్!

విరాట్ కోహ్లీ ప‌రువు తీసిన‌ అక్ష‌ర్ ప‌టేల్

2024 టీ20 ప్రపంచ కప్ ఫైనల్ ( ICC Mens T20 World Cup 2024) మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కాస్త స్లోగా బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. 59 బంతుల్లో 76 పరుగులు సాధించాడు. 128 స్ట్రైక్ రేట్ మాత్రమే మెయిన్టైన్ చేశాడు. అయితే అతడి ప్రదర్శన పై తాజాగా అక్షర్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ స్లోగా ఆడడం వల్లే టీమిండియా గెలిచిందన్నారు. 34 పరుగులకే మూడు వికెట్లు పడిన క్రమంలో… టీమిండియా తీవ్రమైన ఒత్తిడిలోకి వెళ్లిందని పేర్కొన్నారు.

Advertisement

అలాంటి సమయంలో ఒక్కో పరుగు తీసి… టీమిండియాను గాడిలో విరాట్ కోహ్లీ పెట్టాడని గుర్తు చేశారు. విరాట్ కోహ్లీ ఉన్నాడన్న ధైర్యంతో తాను కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశానని గుర్తు చేశారు. ఐదవ వికెట్ కు తనను పంపించగా 31 బంధువుల్లో 47 పరుగులు సాధించాలని వెల్లడించారు. మరో ఎండ్ వైపు విరాట్ కోహ్లీ ఉన్నాడన్న ధైర్యంతో తాను బ్యాటింగ్ చేసి పరుగులు రాబట్టగలిగానని వెల్లడించారు. అతనే లేకపోతే ఆరోజు టీమిండియా ఓడిపోయేదని వ కీలక వ్యాఖ్యలు చేశారు.

SRH Batter Harry Brook On Kavya Maran: SRH జ‌ట్టులో నాకు న‌ర‌కం చూపించారు..టోర్నీ మ‌ధ్య‌లోనే పారిపోయేలా చేశారు!

Related News

బాబ‌ర్ ఆజం పెద్ద మోస‌గాడు…PCBని మోసం చేసి, ఇంగ్లాండ్ కు వెళ్లాడు

ఐపీఎల్ లో తొలి సూప‌ర్ ఓవ‌ర్ వేశాడు..ఇప్పుడు దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నాడు !

ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌తో ఆడి, ఇంగ్లండ్‌లో.. పాకిస్తాన్ ప‌ళ్లు రాల‌గొట్టుకుంది

పార్టీలు, అమ్మాయిలకు అభిషేక్ శర్మ బానిస అయ్యాడు..యోగ్‌రాజ్ సింగ్ సీరియ‌స్‌

ఐపీఎల్ డ‌బ్బుల‌కు క‌క్కుర్తి ప‌డి, కెరీర్ నాశ‌నం చేసుకోవ‌ద్దు..పుజారా హెచ్చ‌రిక‌

తొలి టెస్ట్ లో పాకిస్తాన్ అంపైర్…శత్రువైనా టీమిండియాను గెలిపించాడంటూ ఆరోప‌ణ‌లు!

షాహిద్ అఫ్రిదిని కుక్క అంటూ బండ బూతులు తిట్టాను…ఇర్ఫాన్ ప‌ఠాన్ సంచ‌ల‌నం

Big Stories

Advertisement
×