Indian Railways: నార్త్ ఇండియాలో గత కొద్ది కాలంగా రైళ్లలో సెల్ ఫోన్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా రైలు డోర్లు, కిటికీల దగ్గర కూర్చున్న ప్రయాణీకులను టార్గెట్ చేసి దొంగలు ఫోన్లను కొట్టేస్తున్నారు. క్షణాల్లో ఫోన్లు దొంగిలించి కొంత మంది కదులుతున్న రైల్లో నుంచి బయటకు దునికేస్తున్నారు. మరికొంత మంది రైల్వే స్టేషన్ లోనే నిలబడి కదులుతున్న రైల్లోని ప్రయాణీకుల ఫోన్లను లాక్కుంటున్నారు. తాజాగా సెల్ ఫోన్ దొంగతనాలకు సంబంధంచిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పుడప్పుడు సెల్ ఫోన్ దొంగలను పట్టుకుని ప్రయాణీకులు చితకబాదినా, ఈ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
సెల్ ఫోన్ కొట్టేసిన దొంగ, రెండు కాళ్లు కోల్పోయిన ప్రయాణీకుడు
తాజాగా మొబైల్ ఫోన్ దొంగతనం కారణంగా కదులుతున్న రైలు నుంచి పడి కాలు పోగొట్టుకున్న ఘనట మహారాష్ట్రలో జరిగింది. సెంట్రల్ రైల్వే లై న్‌లోని షాహద్- అంబివాలి స్టేషన్ల మధ్య ఈ సంఘటన జరిగింది. తాజాగా గౌరవ్ నిఖమ్ అనే యువకుడు రైలు ఎక్కాడు. డోర్ దగ్గర కూర్చొని ఫోన్ చూస్తున్నాడు. ఇంతలో బయటి నుంచి ఓ దొంగ అతడి సెల్ ఫోన్ లాక్కున్నాడు. ఆ సమయంలోనే తను ఫోన్ పోకుండా గట్టిగా పట్టుకున్నాడు. దొంగ కిందికి గుంజడంతో అతడు పడిపోయాడు. కాళ్లు రెండు రైలు కిందికి వెళ్లాయి. వాటిలో ఒక కాలు నుజ్జు నుజ్జు కాగా, మరో కాలుకు తీవ్రంగా గాయాలు అయ్యాయి.
గౌరవ్ ను హాస్పిటల్ కు తరలించిన రైల్వే పోలీసులు
ఈ ఘటన గురించి తెలుసుకున్న రైల్వే పోలీసులు వెంటనే స్పాట్ కు చేరకున్నారు. తీవ్ర గాయాలతో ట్రాక్ పక్కన పడి ఉన్న గౌరడ్ ను పోలీసులు హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆయనకు ప్రత్యేక వైద్యుల బృందం చికిత్స అందిస్తోంది. “ఎవరో నా చేయి లాగి ఫోన్‌ను లాక్కున్నారు. నేను ఫోన్ ను గట్టిగా పట్టుకున్నాను. డోర్ ను పట్టుకోవాలనుకున్నా పట్టుకోలేకపోయాను. పట్టు కోల్పోయి పట్టాల మీద పడిపోయాడు” అని గౌరవ్ తెలిపాడు. ఆయన రెండు కాళ్లు గాయాలు కాగా, ఓ కాలు పూర్తి నుజ్జు నుజ్జు అయ్యింది.
Read Also: వీడు ఎవడండి బాబు.. రైల్వే ప్లాట్‌ఫాం మీదకు ఏకంగా కారుతో వచ్చేశాడు!
దొంగ కోసం పోలీసులు గాలింపు
అటు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. నిందితుడి కోసం వెతుకుతున్నారు. నిజానికి ముంబై రైల్వే నెట్ వర్క్ లో మొబైల్ ఫోన్ దొంగతనాలు తరచుగా జరుగుతున్నాయి. జనవరి 2023- మే 2025 మధ్య 26,000 కంటే ఎక్కువ ఫోన్లు దొంగిలించబడినట్లు GRP డేటా వెల్లడించింది. ఈ సంఖ్య 2023లో 12,159 ఉండగా, 2024లో 10,891కి దాదాపు 10 శాతం తగ్గింది. మే 2025 నాటికి, సబర్బన్ నెట్ వర్క్ లో 3,508 దొంగతనాలు నమోదయ్యాయి.
Read Also: ఇకపై పావు గంట ముందే వందేభారత్ టికెట్ బుక్ చేసుకొవచ్చు.. కేవలం ఈ 8 రైళ్లలోనే!