Singer Shravana Bhargavi:శ్రావణ భార్గవి…ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ తో మనందరినీ అలరించిన ఈ క్రేజీ సింగర్ ఆ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన సెన్సేషన్ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వయస్సు పెరుగుతున్న కొద్దీ స్త్రీలలో వచ్చే మార్పులు, ఆత్మవిశ్వాసం మరియు సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న ట్రోలింగ్ గురించి ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి.
మహిళలు కాలంతో పాటు మరింత అందంగా, గ్రేస్‌ఫుల్‌గా తయారవుతారని, వయస్సుతో పాటు వారిలో కాన్ఫిడెన్స్ రెట్టింపు అవుతుందని ఆమె స్పష్టం చేశారు. తన జీవితంలో ఎదురైన కష్టమైన పరిస్థితులలో తన వెనుక నిలిచింది తన ఫీమేల్ ఫ్రెండ్స్ మాత్రమేనని,వారు ఇచ్చే సపోర్ట్ వల్లే ఒక మహిళ సమాజంలో బలంగా నిలబడుతుందని తెలిపారు.
అయితే ప్రస్తుత డిజిటల్ యుగంలో పబ్లిక్ లైఫ్‌లో ఉన్న మహిళలను టార్గెట్ చేయడం చాలా తేలికైపోయిందని శ్రావణ భార్గవి ఆవేదన వ్యక్తం చేశారు. మగవారికంటే ఎక్కువగా తోటి మహిళలే మహిళలను ఆన్‌లైన్‌లో అబ్యూస్ చేస్తున్నారని ఆమె చేసిన కామెంట్స్ ఇపుడు చర్చనీయాంశంగా మారాయి.
ఎవరో ఒకరు నెగెటివ్ కామెంట్ చేశారని తాను బాధపడనని, తన కోసం కొంత సమయాన్ని కేటాయించి కామెంట్ చేస్తున్నారంటే వారి రోజులో తాను ఒక ముఖ్యమైన భాగమయ్యానని భావిస్తానని పేర్కొన్నారు. అలాంటి వాటికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని, మనసులోనే కృతజ్ఞతతో ముందుకు వెళ్లాలని ఆమె చెప్పుకొచ్చారు.
శ్రావణ భార్గవి విషయానికి వస్తే ..టాలీవుడ్‌లో ప్లేబ్యాక్ సింగర్‌గా మంచి స్థానం సంపాదించుకుంది.ముఖ్యంగా 2010లో నందమూరి బాలకృష్ణ నటించిన ‘సింహా’ చిత్రంలోని “సింహమంటి చిన్నోడే” పాటతో ఇండస్ట్రీలోకి సాలిడ్ ఎంట్రీ ఇచ్చింది
ఆ తర్వాత 2011లో రామ్ పోతినేని ‘కందిరీగ’, 2012లో రానా నటించిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ చిత్రంలోని “జారొచ్చె” వంటి పాటలతో సత్తా చాటింది,అయితే 2022 జూలైలో ఆమె ప్రైవేట్ వీడియోగా రూపొందించిన ‘ఒకపరి కొకపరి’ అన్నమయ్య సంకీర్తన వివాదం టాలీవుడ్‌లో పెద్ద దుమారమే రేపింది. భక్తి కీర్తనను గ్లామరస్‌గా చూపించారంటూ ఎన్నో విమర్శలు వచ్చాయి.అయినా ఎక్కడా తగ్గకుండా ఎదుర్కోవడం ఇక్కడ విశేషం.
also read :అంజి మామకు బిగ్ షాక్.. రూ.23 లక్షలు పోయాయట!
ఇక సింగర్ హేమచంద్రను వివాహం చేసుకున్న శ్రావణ భార్గవి, పర్సనల్ లైఫ్‌పై వస్తున్న రకరకాల రూమర్స్‌ను ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్‌గా సత్తా చాటుతున్నశ్రావణ భార్గవి ఎంతో మందికి ఆదర్శమనే చెప్పాలి.