BigTV English

Ram Gopal Varma: కుక్కల కోసం కాదు.. మనుషుల కోసం ఏడ్వండి… జంతు ప్రేమికులపై ఆర్జీవీ కౌంటర్‌

Ram Gopal Varma: కుక్కల కోసం కాదు.. మనుషుల కోసం ఏడ్వండి… జంతు ప్రేమికులపై ఆర్జీవీ కౌంటర్‌

RGV Counter to Dog Lovers: దేశ రాజధాని ఢిల్లీలో వీధి కుక్కల బెడద ఎక్కువైపోయింది. పట్టపగలే నడిరోడ్లపై మనుషులపై దాడి చేస్తున్నాయి. వీధి కుక్కల దాడిలో ఎంతో మంది పురుషులు, మహిళలు, చిన్నపిల్లలు గాయపడుతున్నారు. కుక్కకాటు వల్ల ఢిల్లీలో రెబిస్ వ్యాధి బారిన పడుతున్నారు. రెబిస్‌ వ్యాధి సంఖ్య పెరుగుతుండటంతో ఈ క సుప్రీం కోర్టు స్వయంగా స్పందిచింది. ఈ కేసును సమోటోగా తీసుకుని 8 వారాల్లో వీధి కుక్కలను షల్టర్లకు తరలించాలని ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. సుప్రీం కోర్టు తీర్పుపై పెట్‌ లవర్స్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం తీర్పుని ఖండిస్తూ ట్విటర్‌ పెద్ద ఎత్తున ట్విట్స్‌ చేస్తున్నారు. సుప్రీం కోర్టు ఈ తీర్పు వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ హ్యాష్‌ ట్యాగ్స్‌ ట్రెండ్‌ చేస్తున్నారు.


సుప్రీం తీర్పుపై డాగ్ లవర్స్ అభ్యంతరం

ఇక హీరోయిన్‌ సదా సైతం సుప్రీం తీర్పుని వ్యతిరేకించింది. అత్యున్నత న్యాయస్థానం తీర్పుపై స్పందిస్తూ.. నాకేం చేయాలో తోచడం లేదు.. ఎక్కడ నిరసన తెలపాలో తెలియడం లేదు.. అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు వీడియో రిలీజ్ చేస్తూ.. వందల సంఖ్యలో ఉన్న వీధి కుక్కల కోసం అంత తక్కువ టైంలో షెల్టర్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. దీని బదులు ఢిల్లీ ప్రభుత్వానికి వాటిని చంపడం తప్పా మరే దారి ఉండదు.. ఇది కరెక్ట్‌ కాదు. దయచేసి ఇది ఆపండి అంటూ సదా ఆవేదన వ్యక్తం చేసింది. సదాతో పాటు జాన్వీ కపూర్‌, సోనాక్షి సిన్హా వంటి స్టార్స్‌ కూడా స్పందించారు. ఇలా వీధి కక్కుల కోసం పెద్ద ఎత్తున్న నిరసన చేస్తున్న పెట్‌ లవర్స్ కి తాజాగా ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ కౌంటర్‌ ఇచ్చారు.


డాగ్ లవర్స్ కి ఆర్జీవీ కౌంటర్

ఈ మేరకు ఆయన వరుస ట్వీట్స్‌ చేస్తున్నారు. ఓ చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి చంపిన వీడియోని షేర్‌ చేస్తూ.. పెట్‌ లవర్స్ ఈ వీడియో చూడండి వారికి చురకలు అంటించారు. కాసేపటి క్రితం వారందరిని ప్రశ్నిస్తూ.. ఓ ట్వీట్‌ వదిలారు. ఇందులో పెట్‌ లవర్స్‌ పది ప్రశ్నలు సంధించారు. ఇంతకి అవేంటంటే.. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేస్తూ..వీధి కుక్కలపై సుప్రీం కోర్టు తీర్పుతో పెట్‌ లవర్స్‌ ఆవేదన చెందుతున్నారు. అయితే డాగ్‌ లవర్స్‌ అందరికి నాదో సందేహం. అంటూ పది పాయింట్స్‌ సంధించారు. ‘వీధి కుక్కులు మనుషులపై దాడి చేసి చంపేస్తుంటే.. డాగ్‌ లవర్స్ వాటి హక్కులపై పోరాటం చేస్తూ.. ట్వీట్స్‌ చేయడంలో బిజీగా ఉన్నారు?’, ‘మీ విలాసవంతమైన ఇళ్ల మీ పెంపుడు కుక్కను ప్రేమించుకోండి.

మీ ఇళ్లకు తీసుకేళ్లి పెంచుకోండి

కానీ వీధి కుక్కల దాడిలో చనిపోయిన, గాయపడ్డ బాధితులపై మాత్రం మీరు దయ చూపించడం అసభ్యకరం?’, ‘ధనవంతులు హైబ్రిడ్‌ జాతీ కుక్కలను పెంచుకుంటున్నారు. కానీ, పేద ప్రజలు మాత్రం వీధి కుక్కల దాడిలో మరణిస్తున్నారు. కానీ, జంతు ప్రేమికులు ఈ తేడా గురించి మాట్లాడరు?’, ‘ఒక మనిషి మనిషి చంపితే హంతకుడు.. అదే కుక్క చంపితే ప్రమాదం అంటారు. మనుషులు చంపడాన్ని కూడా జంతువుల్లాగే ప్రమాదం అని ఎందుకు అనడం లేదు?’ , ‘మీరు కుక్కల కోసం ఏడుస్తున్నారు. కానీ, చనిపోయిన మనుషుల కోసం కాదు. సింపతి అనేది ఇంత సెలక్టివ్‌గా ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు.’, ‘వీధి కుక్కలను చంపోద్దని డాగ్‌ లవర్స్ పోరాటం చేసే బదులుగా వాటిని మీ ఇళ్లకు తీసుకువెళ్లి పెంచుకోవచ్చు కదా.

Also Read: Shruti Haasan: శ్రుతి హాసన్‌కు చేదు అనుభవం.. నేనే హీరోయిన్‌ సర్‌, గుర్తించండి.. సెక్యూరిటీని అడుక్కున్న నటి

ఎందుకంటే అవి మీ హైబ్రీడ్‌ పెట్స్‌ కాదు కదా. తక్కు వ జాతికి చెందినవి.. మురికిగా. వ్యాధిగ్రస్తమైనవి కాబట్టి మీరువాటిని పెంచుకోరు. ఎందుకంటే మీ బంధువులు, ప్రియమైన వారికి ప్రమాదంలో పడేయకూడదు కదా?’. న్యాయం లేని కరుణ కరుణ కాదు. ఇది స్వనీతితో నిండిన క్రూరత్వం అన్నారు. అలాగే గేటెడ్ కమ్యూనిటీల లోపల వీధికుక్కలు దాడి చేయవు. గేట్లు లేని చోట అవి దాడి చేస్తాయని డాగ్‌ లవర్స్‌కి గుర్తు చేశారు. అదే విధంగా ఒక తల్లి తన బిడ్డ వీధి కుక్కల దాడిలో చనిపోవడం చూసి ఎంతో ఆవేదన చెందింది. మరేందుకు ఆ తల్లి ఆవేదనను హ్యాష్‌ ట్యాగ్‌తో చెప్పడం లేదు. అన్ని ప్రాణుల్లాగే అన్ని జంతువులకు జీవించే హక్కు ఉంది. కానీ, అది మనుషుల ప్రాణాల పణంగా పెట్టగలదా? అని ఆర్జీవీ డాగ్‌ లవర్స్‌కి కౌంటర్‌ విసిరారు. ప్రస్తుతం ఆయన ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Related News

Peddi : రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా బ్లాస్ట్, సీక్రెట్స్ రీవీల్ చేసిన జాన్వీ కపూర్  

Rishab Shetty : వివాదంపై స్పందించిన రిషబ్ శెట్టి, అప్పుడు తెలుగులో మాట్లాడుతా

Naga Vasmsi: సినిమా హక్కుల కోసం నాగ వంశీ ప్రయత్నం, ప్రభాస్ తో పోటీ అవసరమా?

Mega158 : మెగాస్టార్ సినిమా ముహూర్తం క్యాన్సిల్? ఆ సెంటిమెంట్ కోసమే వెయిటింగ్

Dimple Hayathi: వివాదంలో డింపుల్ హయతి… రహస్యంగా పెళ్లి కూడా చేసుకుందా?

Priyanka Mohan : పవన్ తో OG బ్యూటీ రొమాంటిక్ ఫోజులు.. ఆ క్లోజ్ నెస్ చూశారా?

Poonam Kaur: బాలయ్య vs చిరంజీవి.. పూనమ్ సంచలన పోస్ట్…అగ్గి రాజేసిందిగా!

IMDB Movie list: 25 ఏళ్లలో మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్ జాబితాలో ప్రభాస్, బన్నీ మూవీలు!

Big Stories

×