E-Paper
Advertisement

Boat accident: దారుణం.. పడవ బోల్తాపడి 28 మంది స్పాట్‌లో మృతి

Boat accident: దారుణం.. పడవ బోల్తాపడి 28 మంది స్పాట్‌లో మృతి
Advertisement

Boat accident: వియత్నాంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హలోంగ్ బేలోని భారీ పడవ బోల్తా పడడంతో 28మంది మృతిచెందారు. పలువురికి గాయాలు అయినట్టు తెలుస్తోంది. ఈ పడవలో మొత్తం 53 మంది పర్యాటకులు ఉన్నారు. అయితే పడవ ప్రయాణం మధ్యలో ఉండగా భారీగా ఈదురు గాలులు వ్యాపించాయి. ఉరుములు సంభవించాయి. ఈ క్రమంలోనే పడవ అదుపు తప్పడంతో బోల్తా పడింది.

దీంతో వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. 12 మంది టూరిస్టులను రక్షించగా.. మిగిలినవారు గల్లంతయ్యారు. ఇప్పటివరకు 27 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై వియత్నాం పీఎం మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదంలో గల్లంతైన వారిని రక్షించేందుకు గాలింపు చర్యలు చేపట్టాలని సహాయక బృందాలకు ప్రధాన మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఈ ప్రమాదానికి సంబంధించి అధికారులు దర్యాప్తు చేస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు వివరించాయి. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

ALSO READ: Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్

ALSO READ: Aghori-Varshini: జైలులో అఘోరీ.. పబ్‌లో వర్షిణి.. వీడియో వైరల్

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×