E-Paper
Advertisement

ఘనంగా జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ కూతురి అన్నప్రాసన వేడుక..ఫోటోలు వైరల్!

ఘనంగా జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ కూతురి అన్నప్రాసన వేడుక..ఫోటోలు వైరల్!
Advertisement

Kevvu Karthik:కామెడీ షోలో కమెడియన్ గా, టీం లీడర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న కెవ్వు కార్తిక్ (Kevvu Karthik) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. జబర్దస్త్ లోకి వచ్చిన ప్రారంభంలో అవినాష్ (Avinash ) తో కలిసి స్కిట్స్ చేసిన ఈయన.. ఆ తర్వాత టీం లీడర్ గా మారారు. ఇకపోతే రెండేళ్ల క్రితం సిరి అనే అమ్మాయిని వివాహం చేసుకున్న ఈయన.. ఈ ఏడాది పండంటి అమ్మాయికి జన్మనిచ్చినట్లు అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే. అయితే తన కూతురికి ఇటీవల ఐదు నెలలు పూర్తయ్యాయి అంటూ అభిమానులతో పంచుకున్న కార్తీక్.. ఇప్పుడు మరో పోస్టుతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఈసారి ఏకంగా తన కూతురికి అన్నప్రాసన చేసినట్లు అభిమానులకి తెలియజేశారు.

కూతురికి అన్నప్రాసన..

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ బిజీగా గడిపేస్తున్న కెవ్వు కార్తీక్ వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తన కూతురితో గడిపే మధుర క్షణాలను ఆయన అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తన కూతురికి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తన కూతురుకి శ్రీకరి అని నామకరణం చేసినట్టు తెలియజేసిన కెవ్వు కార్తీక్ ..అన్నప్రాసన పూర్తి చేసినట్లు అభిమానులతో పంచుకున్నారు . మొత్తానికైతే పట్టు వస్త్రాలలో తమ కూతురికి నిర్వహించిన ఈ అన్నప్రాసన వేడుక చాలా ఘనంగా పూర్తయినట్లు ఫోటోల ద్వారా తెలుస్తోంది.

Advertisement

నాలుగు రోజుల క్రితం ఇందుకు సంబంధించిన వీడియో షేర్ చేసిన కెవ్వు కార్తీక్ కాసేపటి క్రితం ఆ ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేయడంతో అభిమానులు వీటిని షేర్ చేస్తూ శ్రీకరి చాలా క్యూట్ గా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే కెవ్వు కార్తీక్ షేర్ చేసిన ఈ ఇంస్టాగ్రామ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

also read:నటుడు సునీల్ రెడ్డి ఎవరి కుమారుడో తెలుసా..?

కెవ్వు కార్తీక్ కెరియర్..

Advertisement

తెలంగాణలోని వరంగల్లో జన్మించిన కార్తీక్ .. తండ్రి ఆర్టీసీ బస్ కండక్టర్ కాగా,తల్లి బట్టలు కుడుతూ కుటుంబ ఆదాయాన్ని పెంచేదట. అయితే ఇద్దరు అక్కల పెళ్లి ఖర్చుల కారణంగా ఆ కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందని, దానివల్ల వారు ఆఖరికి తమ సొంత ఇంటిని కూడా అమ్ముకోవాల్సి వచ్చిందని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు కార్తీక్. ఆయన మాట్లాడుతూ..” నా టెన్త్ క్లాస్ వరకు సొంత ఊర్లోనే చదువుకున్నాను. పాలిటెక్నిక్ చేద్దామనుకున్నాను కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల చదవలేక పోయాను. దీంతో నర్సంపేటలో ఇంటర్మీడియట్ లో జాయిన్ అయ్యా.. మా పరిస్థితి తెలిపిన కాలేజ్ ప్రిన్సిపాల్ తక్కువ ఫీజుకి నన్ను కాలేజీలో జాయిన్ చేసుకున్నారు. ఇంటర్ తర్వాత హనుమకొండలో డిగ్రీ జాయిన్ అయ్యాను. అదే టైంలో ఫీజు రియంబర్స్మెంట్ అని కొత్తగా రావడంతో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కి ఇంట్లో చెప్పకుండా వెళ్లాను. కానీ నాకు ఖమ్మంలో సీటు వచ్చింది. అక్కడికి వెళ్లి చదివే పరిస్థితి లేకపోవడంతో వదిలేద్దాం అనుకున్నాను.

ఆర్థిక ఇబ్బందుల నుండి జబర్దస్త్ వరకు ప్రయాణం..

కానీ స్లైడింగ్ ఆప్షన్ ఉండడం వల్ల వరంగల్లో రామప్ప ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యాను. అక్కడ చదువుతూనే కాకతీయ యూనివర్సిటీలో మిమిక్రీలో డిప్లమా చేశాను. ఆ తర్వాత ఎంటెక్ కూడా చేశాను. నాకు చిన్నప్పటి నుంచి అంటే మిమిక్రీ చాలా ఇష్టం. చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం వచ్చింది .కానీ ఆ ఫీల్డ్ నచ్చలేదు. ఆ తర్వాత ఈవెంట్ ఆర్గనైజింగ్ గా చేశాను. చిన్నచిన్న స్టేజి షోలు, మిమిక్రీ పెర్ఫార్మన్స్ లు చేసి డబ్బు సంపాదించి ఆ తర్వాత జబర్దస్త్ లోకి అడుగు పెట్టాను అంటూ తెలిపారు కార్తీక్.

Related News

బిగ్ బాస్ హౌస్ లో సడన్ ఎలిమినేషన్.. కానీ ఈ ట్విస్ట్ ఏంటి గురూ!

ముద్దమందారం పేరుతో బిజినెస్ మొదలుపెట్టిన హరిత జాకీ.. నెలవారీ ఆదాయం ఏంటంటే?

Intinti Ramayanam Shriya : పాప చాలా హాటు గురు..ఇది అస్సలు ఊహించలేదు భయ్యా..

శోభశెట్టి నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Intinti Ramayanam Today Episode: లాయర్ తో పల్లవి అబద్దం చెప్పిందా..? శ్రీకర్ ప్లాన్ ఫెయిల్.. కమల్ లవ్ ట్రాక్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 31st ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రాథోడ్‌, మిస్సమ్మల ట్రాప్‌లో పడిపోయిన అమర్‌         

Podarillu Today Episode : కన్నాకు కేశవ గిఫ్ట్.. అడ్డంగా దొరికిన మాధవ్.. పాపం నారాయణ..

Big Stories

Advertisement
×