BigTV English

New Child Scheme 2025: కొత్త చైల్డ్ పాలసీ, మూడో బిడ్డను కంటే రూ.12 లక్షలు, ఎక్కడ ఏంటి?

New Child Scheme 2025: కొత్త చైల్డ్ పాలసీ, మూడో బిడ్డను కంటే రూ.12 లక్షలు, ఎక్కడ ఏంటి?

New Child Scheme 2025: ప్రపంచంలో చాలా దేశాలను జనాభా కొరత వెంటాడుతోంది. దీన్ని నుంచి అధిగమించేందుకు పలు దేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ విషయంలో అధికంగా ఇబ్బందిపడుతోంది చైనా. ఈ గండం నుంచి గట్టెందుకు కొత్త స్కెచ్ చేసింది. మూడో బిడ్డకు జన్మ ఇస్తే తల్లుల ఖాతాల్లో 12 లక్షలు వేయాలని డిసైడ్ అయ్యిందట. నమ్మడానికి విచిత్రంగా ఉన్నా, ముమ్మాటికీ నిజం.


జనాభా సమస్యలను ఎదుర్కొంటోంది డ్రాగన్ కంట్రీ. 1980-2015 వరకు ఒక బిడ్డను కనాలని కండీషన్ పెట్టింది. 2016 నాటికి వచ్చేసరికి ఇద్దరు బిడ్డలు ఉండాలని పేర్కొంది. గడచిన నాలుగేళ్ల నుంచి ముగ్గురు బిడ్డలను కనాలనే విధానాన్ని తెచ్చింది.  జననాల రేటు పెంచేందుకు స్థానిక ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించలేదు.

2025 జనవరి ఒకటి తర్వాత పుట్టిన ప్రతీ బిడ్డ తల్లిదండ్రులకు ఏడాదికి 3,600 యువాన్లు (సుమారు రూ. 42 వేలు) చెల్లిస్తుంది. బిడ్డకు మూడేళ్లు వచ్చేవరకు ఈ చెల్లింపు కొనసాగుతుందని కొందరు వ్యక్తులు చెబుతున్నారు.దీనిపై అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.  స్థానిక ప్రభుత్వాలు జనాల రేటును పెంచడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి.


ఇన్నర్ మంగోలియాలోని పలు నగరాల్లో రెండో బిడ్డకు 50,000 యువాన్లు, మూడో బిడ్డకు 100,000 యువాన్లు చెల్లిస్తున్నాయి. అంతే ఇండియా కరెన్సీలో రూ. 1190986 అన్నమాట.  మధ్య చైనా ప్రాంతంలో చైల్డ్ పాలసీ మరో విధంగా ఉందట. రెండో బిడ్డకు 6,500 యువాన్లు ఇచ్చిందట ప్రభుత్వం. మూడేళ్లు వచ్చేవరకు ఆ బిడ్డకు ప్రతి నెలా 800 యువాన్లు ఇస్తోందని అంటున్నాయి. ఇలా ఒక్కో దగ్గర వేర్వేరుగా పాలసీలను అవలంబిస్తున్నాయి స్థానిక ప్రభుత్వాలు.

ALSO READ: టెక్సాస్ ఆగమాగం.. 50 మంది చిన్నారుల గల్లంతు

జనాభా తగ్గడం మొదలైన తర్వాత పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారవేత్తలు వెనుకాడుతారు. దానివల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయని, నిరుద్యోగం పెరుగుతుందని అంటున్నారు కొందరు చైనీయులు. తగ్గిపోతున్న జనాభాను ఖాళీ రైలుతో పోల్చుతున్నారు. ప్రయాణికులు తగ్గిన కొద్దీ మిగిలినవారు ప్రశాంతంగా ఉంటారని అంటున్నారు.

చైనాలో యువత పిల్లలకు జన్మ నివ్వకపోవడానికి కారణాలు లేకపోలేదు. ప్రజల ఆర్థిక పరిస్థితులు అంతంత మాతమే. రోజు వారీ ఖర్చులు పెరగడం, ఉద్యోగం ఉంటుందో పోతుందో తెలియని భయం నెలకొంది. వీటికి తోడు చదువుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

కెరీర్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో పెళ్లిళ్లకు గ్యాప్ పెరుగుతోంది. ఆ విధంగా పిల్లల్ని కనడం ఆలస్యమైంది.  ఈ క్రమంలో మహిళల మొదటి వివాహ వయస్సు క్రమంగా పెంచుకుంటూ పోతోంది అక్కడి ప్రభుత్వాలు. 2010లో 24 ఏళ్లు ఉండగా, ప్రస్తుతం 28 ఏళ్లకు పెరిగింది. దీనికితోడు సామాజిక మార్పుల కారణంగా జననాల రేటు తగ్గిపోతోందని అంటున్నారు. జనాభా పెంపు గురించి రాబోయే రోజుల్లో భారత్ ఎలాంటి పాలసీలు వస్తాయో చూడాలి.

Related News

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Donald Trump: ట్రంప్ టారీఫ్ బాంబ్.. ఏ రంగాలపై ఎఫెక్ట్..?

Big Stories

×