BigTV English

Nikhil Siddhartha: నిఖిల్ అన్నా.. స్వయంభు ఉన్నట్టా .. లేనట్టా ?

Nikhil Siddhartha: నిఖిల్ అన్నా.. స్వయంభు ఉన్నట్టా .. లేనట్టా  ?

Nikhil Siddhartha: కార్తికేయ 2 తో పాన్ ఇండియా గుర్తింపును అందుకున్నాడు కుర్ర హీరో నిఖిల్ సిద్దార్థ. ఈ సినిమా ఇచ్చిన జోష్ తో స్పై అనే పాన్ ఇండియా సినిమాలో నటించి చేతులు కాల్చుకున్నాడు. ఇక ఈసారి ఇండస్ట్రీలో ట్రెండ్ లో నడుస్తున్న పీరియాడిక్ జోనర్ ను ఎంచుకొని స్వయంభు అనే సినిమాను మొదలుపెట్టాడు. భరత్ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో నిఖిల్ సరసన సంయుక్త మీనన్, నభా నటేష్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టకోవడమే ఒక్కసారిగా అంచనాలను కూడా పెంచేసింది.


స్వయంభు సినిమాను మొదలుపెట్టి ఏడాది దాటింది. రిలీజ్ డేట్ చెప్పకపోయినా ఈ ఏడాదిలోనే ఈ సినిమా రిలీజ్ ఉంటుంది అనుకున్నారు. కానీ, నిఖిల్ స్వయంభు గురించి పట్టించుకోవడం లేదనిపిస్తుంది. కొన్ని నెలల నుంచి ఈ సినిమాకు సంబంధించి ఒక్క అప్డేట్ కూడా లేదు, షూటింగ్ ముగిసిందా.. ? వేరే పనులను జరుపుకుంటుందా.. ? అనేది కూడా తెలియదు. దీని పక్కన పెట్టి ది ఇండియా హౌస్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.  అయితే ఈ మధ్యనే ఈ సినిమా సెట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగి సెట్ అంతా బూడిద అయిన విషయం తెల్సిందే. దీంతో తాత్కాలికంగా ది ఇండియా హౌస్ కు బ్రేకులు పడ్డాయి.

ఇక ఈ రెండు సినిమాలను పక్కన పెట్టి.. నిఖిల్ తాజాగా మరో సినిమాను లైన్లో పెట్టాడు. ఏషియన్ సంస్థలో నిఖిల్ మరో పాన్ ఇండియా సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా కొత్త సినిమాలను అనౌన్స్ చేయడమేనా పాత సినిమాలను రిలీజ్ చేసే ఉద్దేశ్యం ఉందా లేదా అని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు స్వయంభు ఉన్నట్టా.. లేనట్టా.. అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.


స్వయంభు భారీ పీరియాడిక్ సినిమా.. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా .. అందులోనూ సగానికి పైగా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది.అయినా  ఇప్పటివరకు రిలీజ్ డేట్ ను ఎందుకు ప్రకటించలేదు. దీనిపై ఒక్క అప్డేట్ కూడా ఎందుకు ఇవ్వడం లేదు. ఇది రిలీజ్ అవుతుందా..? లేదా.. ? అని అభిమానులు నిఖిల్ ను అడుగుతున్నారు. అన్నా స్వయంభు ఉన్నట్టా.. లేనట్టా అనేది కనీసం క్లారిటీ అయినా ఇవ్వు అని కామెంట్స్ పెడుతున్నారు. మరి నిఖిల్ ఇప్పటికైనా స్వయంభు గురించి ఒక క్లారిటీ ఇస్తాడో లేదో చూడాలి.

Related News

Chiranjeevi: మెగాస్టార్ గొప్ప మనసు.. మహిళా అభిమానికి అందమైన బహుమతి..

Vishal Sai Dhanshika: ఘనంగా సాయి ధన్సికతో హీరో విశాల్ ఎంగేజ్మెంట్.. ఫోటోలు వైరల్!

Komali Prasad: ఆశగా ఎదురుచూస్తున్నా.. ఊహించని కామెంట్స్ చేసిన నాని హిట్ 3 బ్యూటీ!

HBD Nagarjuna : 100 కోట్ల టార్గెట్ గా 100వ మూవీ… అందుకే ఈ ఆలస్యం

Monalisa: సౌత్ లోకి కుంభమేళా మోనాలిసా ఎంట్రీ.. ఏ హీరో సినిమానో తెలుసా..?

Big Stories

×