Techie Suicide: బెంగుళూరు టెక్కీ ఆత్మహత్య వెనుక ఏం జరిగింది? పెళ్లయిన రెండున్నరేళ్లకు ఎందుకు ఈ లోకాన్ని విడిచిపెట్టింది? అదనపు కట్నం కోసం వేధింపులా? మహిళల బంధువులు ఏమంటున్నారు? టెక్కీ భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరిగిందన్న డీటేల్స్‌లోకి వెళ్తే..
బెంగళూరులోని సుద్దగుంటపాళ్యం ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది.27 ఏళ్ల శిల్ప ఇన్ఫోసిస్‌లో సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తోంది. రెండున్నరేళ్ల కిందట ప్రవీణ్‌తో ఆమెకి వివాహం జరిగింది. ఈ దంపతులకు ఏడాదిన్నర కొడుకు ఉన్నాడు. పెళ్లికి ముందు ప్రవీణ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేశాడు. అయితే వివాహం తర్వాత ఏడాదికే ఆ ఉద్యోగానికి రిజైన్ చేశాడు.
ఆ తర్వాత ఫుడ్ బిజినెస్ మొదలుపెట్టాడు. అయితే దంపతుల మధ్య ఏం జరిగిందో తెలీదు. మంగళవారం రాత్రి ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని శిల్ప భర్త ప్రవీణ్.. అత్తమామలకు కబురుపెట్టాడు. తమ కళ్ల ముందు కూతురు ఈ లోకాన్ని విడిచిపెట్టడాన్ని జీర్ణించుకోలేకపోయారు.
మా అమ్మాయి శిల్ప ఆత్మహత్య వెనుక భర్త, అత్తమామలు వేధింపులు కారణమని ఆరోపించారు. ఈ క్రమంలో స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ కంప్లైంట్ ఆధారంగా ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ALSO READ: నీటి గుంతలో పడి బాలుడి మృతి
శిల్ప పేరెంట్స్ ఫిర్యాదులో కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివాహం సమయంలో 15 లక్షల నగదు, 150 గ్రాముల బంగారం కట్నంగా ఇచ్చినట్లు ప్రస్తావించారు. ఇవికాకుండా ఇతర సామానులు వంటి ఉన్నాయి. అయినా ప్రవీణ్, అతడి ఫ్యామిలీ అదనపు కట్నం మానసికంగా వేధించారని ఆరోపించారు. దీనికితోడు శిల్పశరీరం రంగును ప్రస్తావిస్తూ అత్తమామలు హేళన చేసేవారని పేర్కొన్నారు.
మా అబ్బాయిని వదిలేయాలని, ఓ అమ్మాయిని చూస్తామంటూ చీటికి మాటికీ అత్తమామలు వేధించేవారని తెలిపారు. ఆరు నెలల కిందట వ్యాపారం కోసం 5 లక్షలు డిమాండ్ చేసినట్టు వెల్లడించారు. ఆ మొత్తాన్ని చెల్లించామని శిల్ప కుటుంబం చెబుతున్నమాట. వరకట్న వేధింపులు, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
ప్రవీణ్‌ను అదుపులోకి తమదైన శైలిలో విచారణ మొదలుపెట్టారు. పోస్టుమార్టం తర్వాత శిల్ప మృతదేహాన్ని ఆమె పేరెంట్స్‌కి అప్పగించారు. ప్రస్తుతం శిల్ప భర్తను విచారిస్తున్నామని, ఆరోపణల్లో వాస్తవాలను నిర్ధారించే ప్రయత్నం చేస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఈ కేసును ఏసీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది.