Tollywood Actor: సినిమాలపై ఆసక్తితో ఎంతోమంది ఇండస్ట్రీలోకి వచ్చి సినిమాలలో నటించాలనే కోరికను నెరవేర్చుకుంటూ ఉంటారు. ఇలా ఎంతో ఫ్యాషన్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినవారు వచ్చిన కొద్ది రోజులకే సక్సెస్ అందుకోగా మరి కొంతమంది సక్సెస్ కోసం పోరాటం చేస్తూనే ఉంటారు. సినీ బ్యాగ్రౌండ్ ఉన్నవారికి ఇండస్ట్రీలో అవకాశాలు తొందరగా వస్తాయి కానీ ఎలాంటి నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అందుకోవడం అంటే ఎంతో కష్టమైన పని అని చెప్పాలి. ఇలా ఎంతోమంది ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వారి టాలెంట్ నిరూపించుకుంటూ ఉన్నారు.
పీ.వీ నరసింహారావు..
ఇకపోతే కుటుంబ పరంగా ఎంతో మంచి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారు కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. అలాంటి వారిలో ఈ నటుడు కూడా ఒకరు. ఏకంగా ఈయన మాజీ ప్రధాని పి.వి నరసింహారావు(P.V.Narasimha Rao) గారి మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.. ఇలా ప్రధాని మనవడు అయ్యిండు కొని ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ కోసం ఎంతో ఆరాటపడుతున్నారు. మరి ప్రధానమంత్రి స్థాయిలో పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఆ హీరో ఎవరు? ఆయన నటించిన సినిమాలు ఏంటి అని విషయానికి వస్తే…
ఇండియాలో జరిగిన స్కాం…
శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత(Samantha) నాగచైతన్య(Nagachaitanya) హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం మజిలీ (Majili). ఈ సినిమాలో కునాల్ పాత్రలో కనిపించి సందడి చేశారు నటుడు సాయి తేజ(Sai Teja). ఈ సినిమా ద్వారా తన ప్రయాణం మొదలుపెట్టిన ఈయన తదుపరి పైలాం పిలగా, మై నేమ్ ఇస్ శృతి వంటి సినిమాలలో నటించారు అయితే ఈయన మాత్రం ఇండస్ట్రీలో అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకో లేకపోయినా సక్సెస్ కోసం కష్టపడుతున్నారు. త్వరలోనే ఒక వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తోంది.. ఇది మన భారతదేశంలో ఇటీవల జరిగిన అతిపెద్ద స్కాం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సాయితేజ తెలియజేశారు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి అన్ని వివరాలను తెలియజేయబోతున్నట్లు సాయితేజ వెల్లడించారు.
మొదటి రెమ్యూనరేషన్…
ఈ సినిమాలో ఈయన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి మాట్లాడుతూ… మా ఇంట్లో అందరూ కూడా ఉన్నత చదువులు చదువుకున్న వారే. ఐపీఎస్ లు, ఐఏఎస్ లు, లాయర్లు ఉన్నారు. ఇలా వారందరి మాదిరి కాకుండా నాకెంతో ఇష్టమైన ఈ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని తెలిపారు.. ఇక పీవీ నరసింహారావు గారి కూతుర్ని తన పెదనాన్నకు పెళ్ళి చేసుకున్నారని అలా తనకు తాత వరస అవుతారని తెలిపారు. ఇలా ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధంలేని కుటుంబం నుంచి సాయి తేజ్ ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ కోసం పోరాడుతున్నారు. ఇక ఈయన తన ఫస్ట్ రెమ్యూనరేషన్ (Remuneration)గురించి కూడా ఈ సందర్భంగా ప్రశ్నలు ఎదురయ్యాయి.. అయితే మజిలీ సినిమా కోసం తాను రోజుకు 5000 రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నానని ఈ సందర్భంగా తెలియజేశారు.
Also Read:ప్రభాస్ వల్ల కాదు, ఆ నటుడి వల్ల సినిమా హైప్.. మంచు విష్ణు