BigTV English

GST On Health: సామాన్యుడికి ఊరట.. హెల్త్, ఇన్యూరెన్స్ పాలసీలపై జీఎస్టీ రద్దు?

GST On Health: సామాన్యుడికి ఊరట.. హెల్త్, ఇన్యూరెన్స్ పాలసీలపై జీఎస్టీ రద్దు?

GST On Health: ప్రధాని మోదీ ఎర్రకోట ప్రసంగం మేరకు జీఎస్టీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయా? సామాన్యుడి ఉపయోగించే వస్తువులపై జీఎస్టీ ఎత్తేయనుందా? ఇన్యూరెన్స్ పాలసీలు, ఆరోగ్య బీమా విషయంలో సామాన్యుడికి ఊరట దక్కనుందా? వాటిపై 18 శాతం జీఎస్టీ వేస్తున్న కేంద్రం, తగ్గిస్తుందా? పూర్తిగా ఎత్తివేస్తుందా? ఇదే చర్చ ఇంటాబయటా నెలకొంది.


సామాన్య-మధ్యతరగతి ప్రజలకు ఊరట ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది కేంద్ర‌ప్రభుత్వం. జీవిత బీమా, ఆరోగ్య పాలసీల మీద ప్రీమియంలపై విధిస్తున్న 18 శాతం జీఎస్టీ మినహాయించాలని భావిస్తోంది. ఈ మేరకు వివిధ రాష్ట్రాల ఏర్పాటైన ఆర్థిక మంత్రల బృందానికి కేంద్రం ప్రతిపాదనలు పంపింంది.

సెప్టెంబరులో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో కేంద్రం ప్రతిపాదనలను చర్చించనున్నట్లు బీహార్ డిప్యూటీ సీఎం జీఓఎం కన్వీనర్ సామ్రాట్ చౌదరి తెలిపారు. ప్రస్తుతం ఇన్యూరెన్స్ పాలసీలు, ఆరోగ్య బీమా ప్రీమియాలపై 18 శాతం జీఎస్‌టీ కొనసాగుతోంది. మంత్రుల బృందం తన నివేదికను జీఎస్‌టీ మండలికి ఇవ్వనుంది.


అయితే సభ్యులందరూ బీమా పాలసీలపై జీఎస్‌టీ రేట్లను తగ్గించేందుకు ఆమోదం తెలిపినట్టు ఆయన వెల్లడించారు. కొన్ని రాష్ట్రాలు తమ తమ అభిప్రాయాలను తెలియ జేశాయని చౌధరి పేర్కొన్నారు. దీనిపై ఆయా రాష్ట్రాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, ఆందోళనలు నివేదికలో ఉన్నట్లు వెల్లడించారు. వ్యక్తి గత బీమా పాలసీలను జీఎస్‌టీ నుంచి మినహాయించాలని కేంద్రం ప్రతిపాదన ఉందన్నారు.

ALSO READ: డీ మార్ట్ లో ఇలా చేస్తున్నారా? అతగాడి మాదిరిగా అయితే బుక్కవుతారు

జీఎస్‌టీ కౌన్సిల్‌ దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. జీఓఎంలో దాదాపు 13 మంది సభ్యులు ఉన్నారు. ఈ నేపథ్యంలో సామాన్యుడి ఊరట కలగవచ్చని అంటున్నారు. ఇదొక వెర్షన్ కాగా.. మరోవైు వినిపిస్తున్న మాట ఏంటంటే.. ఇప్పుడున్న 18 శాతం జీఎస్టీని 5 శాతం శ్లాబ్‌లో పెట్టే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాల మాట.

పాలసీలపై జీఎస్టీ తగ్గించాలని ఎన్నాళ్ల నుంచో డిమాండ్ ఉంది. కేంద్ర కేబినెట్‌లో పలుమార్లు చర్చ వచ్చింది. కొందరు మంత్రులు నోరు విప్పారు కూడా. ఆరోగ్య, బీమా పాలసీల ద్వారా కేంద్రానికి వార్షిక ఆదాయ రూ. 17,000 కోట్ల వరకు ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. పూర్తిగా రద్దు చేస్తే 17 వేల కోట్ల వరకు నష్టం రావచ్చని అంటున్నారు. 18 శాతం నుంచి 5 శాతానికి కుదించే ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నాయి.

ఒకవేళ జీఎస్టీ రద్దు చేస్తే కొంతలో కొంత సామాన్యులకు ఆదా అవుతుంది.  ఈ ఏడాది ఆరోగ్య బీమా పాలసీలో గతంలో కట్టిన దానికంటే సగానికి పైగా రేట్లు పెంచాయి ఇన్యూరెన్స్ కంపెనీలు.  ఒకవేళ ప్రశ్నిస్తే.. ఆసుపత్రుల రేట్లు పెరిగాయంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి.  ఇలాంటి ఛార్జీల పెంపు పట్ల ఇన్యూరెన్స్ కంపెనీలపై నియంత్రణ ఉండాలన్నది సామాన్యుల మాట. లేకుంటే జీఎస్టీ తగ్గించినా ఫలితం ఉండదని అంటున్నారు.

Related News

Theft In DMart: డిమార్ట్‌ లో ఇలా చేస్తున్నారా? ఇదిగో ఇతడిలాగానే బుక్కైపోతారు జాగ్రత్త!

Blinkit New Feature: సూపర్.. బ్లింకిట్ కొత్త ఆప్షన్.. స్విగ్గీ, జెప్టోలో లేని ఫీచర్..

Protest Against D-Mart: డిమార్ట్ కు వ్యతిరేకంగా ఆందోళన, ఇదేం కొత్త పంచాయితీ సామీ!

Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతో తెలుసా?

పది నిమిషాల్లో ల్యాండ్ కొనేయండి.. వావ్, ఆ యాప్ నుంచి సరికొత్త సర్వీస్!

Big Stories

×