Bigg Boss 10:బిగ్ బాస్ సీజన్ 10 లో గోట్ గా మారిన వారు.. అల్టిమేట్ గోట్ గా మారడానికి బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో గోట్ గా మారిన ఏడుగురు సభ్యులు గట్టిగానే పోటీపడ్డారు. ఈ టాస్క్ లో భాగంగా ముఖేష్.. శివ, వంశీలతో గొడవ పెట్టుకున్నారు . ముఖ్యంగా తన బాల్ ను కరెక్ట్ పొజిషన్లో వేయలేదు అంటూ ఏకంగా శివను కొట్టడానికి వెళ్ళాడు ముఖేష్. ఇక నేను ఆడినా వేస్ట్.. ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు అంటూ బిగ్ బాస్ తో మొర పెట్టుకున్నాడు.అయితే ఇదే అసలైన గేమ్ అని అర్థం చేసుకోలేకపోయాడు ముఖేష్. ఎట్టకేలకు ఈ పోటీలో త్రిగుణ్ అల్టిమేట్ గోట్ గా గెలిచి.. ఈవారం కెప్టెన్ అవ్వడమే కాకుండా ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంతకాలం ప్రతి వారం కెప్టెన్సీ కంటెండర్ పోటీలో నేరుగా పోటీపడే అవకాశాన్ని బిగ్ బాస్ కలిగించాడు. ఇకపోతే కష్టానికి తగిన ప్రతిఫలం లభించడంతో.. హౌస్ సభ్యులందరూ ఆయనను అభినందించారు. అయితే తాను ఓడిపోవడంతో ఓవర్గా ఫీలైన ముఖేష్.. త్రిగుణ్ ను అభినందించడానికి కూడా రాలేదు. కెప్టెన్ గా నిలవడంతో త్రిగుణ్ ను టార్గెట్ చేస్తూ బూతులు తిడుతున్న రోహిత్ ఫేస్ కాస్త మాడిపోయింది.
ఇక తర్వాత థమ్స్ అప్ గెలుచుకోవడానికి బిగ్ బాస్ హౌస్లో ఉన్న వారిని రెండు టీమ్స్ గా విడగొట్టి గేమ్ పెట్టారు. ఇక గేమ్ అయ్యాక అందరూ కలిసి బిర్యాని తిని, థమ్స్ అప్ తాగారు. అందరూ సంతోషంగా ఉన్న సమయంలో సడన్గా బిగ్ బాస్ సడన్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పి ట్విస్ట్ ఇచ్చాడు. అంతేకాదు రెడ్ లెవెల్ లో ఉన్న వాళ్లకు సడన్ ఎలిమినేషన్ ఉంటుందని , బట్టలు సర్దుకొని సూట్ కేసులు రెడీగా పెట్టుకోండి అంటూ లోపలికి సూట్ కేసులు కూడా పంపించాడు. ఇక రెడ్ జోన్ లో ఉన్న ఝాన్సీ, శ్వేత, రామకృష్ణ, రోహిత్, సుధీర్ బట్టలు సర్దుకొని నామినేషన్ ఏరియాలోకి వచ్చారు. ఇక వీళ్ళల్లో ఎవరిని పంపాలనుకుంటున్నారో వాళ్ళ తలపై ఒక బాటిల్ కొట్టి ఎందుకో రీజన్ చెప్పాలి అని గ్రీన్ లెవెల్ లో ఉన్న వాళ్ళకి అవకాశం కల్పించారు.
అలా వర్షిణి – రామ కృష్ణ, రాంప్రసాద్ – రోహిత్ , నీతూ – రామకృష్ణ, దేబ్జానీ – రోహిత్, అమర్ – సుధీర్, ముఖేష్ – రామకృష్ణ , త్రిగుణ్ – రోహిత్ లా తలలపై ఒక బాటిల్ పగలగొట్టారు. అయితే ఎవరు ఏం మాట్లాడకపోయినా బిగ్ బాస్ డిఫెండింగ్ చేసుకోమని చెప్పకపోయినా సరే.. రోహిత్ మళ్లీ త్రిగుణ్ పై మాట్లాడడం మొదలుపెట్టాడు. నిన్ను తొక్కుకుంటూ పైకి వెళ్తాను. నువ్వు లక్కుతో గెలుస్తున్నావు.. నిన్ను పైకి రానివ్వను అంటూ రెచ్చిపోయాడు. ఎన్నిసార్లు చెప్పినా.. ఎల్లో కార్డు వచ్చినా.. రెడ్ మార్కు ఇచ్చినా.. నాగార్జున తిట్టినా సరే రోహిత్ లో మార్పు రాకపోవడం గమనార్హం. ఇక గ్రీన్ వాళ్ళు చెప్పినా.. ఓట్లు వేసిన ఆడియన్స్ ఓట్స్ సుధీర్ ఎలిమినేట్ అయ్యాడు అని బిగ్ బాస్ ప్రకటించాడు.
also read:ముద్దమందారం పేరుతో బిజినెస్ మొదలుపెట్టిన హరిత జాకీ.. నెలవారీ ఆదాయం ఏంటంటే?
దీంతో సుధీర్ టీం ముఖేష్, వర్షిణి ,ఝాన్సీ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ముఖేష్ తన మ్యాజిక్ పవర్ వాడుతానని బిగ్ బాస్ కి చెప్పడంతో..ఆ బాక్స్ ఇచ్చాడు. ముఖేష్ పవర్ బాక్సులో.. “ఏదైనా ఎవరైనా పవర్ వాడేస్తే.? దాన్ని మళ్లీ ఇంకోసారి వాడుకునేలా చేయొచ్చు” అని రాసి ఉంది. దాంతో ముఖేష్ ఝాన్సీ ను ఎలిమినేషన్ నుంచి తప్పించి.. అలా వచ్చిన ఫ్రీ పవర్ తో ఝాన్సీ సుధీర్ కోసం వాడి సుధీర్ ను ఎలిమినేషన్ నుంచి ఒక వారం వరకు తప్పించింది. అలా ముఖేష్ మరోసారి మానవత్వం చాటుకుంటూ ఇప్పుడు ఏకంగా ఝాన్సీ, సుధీర్ లను నామినేషన్ నుంచి తప్పించారు.