E-Paper
Advertisement

కెప్టెన్ కూల్ కాదు…నరరూప రాక్షసుడు, ధోనిపై చాహ‌ల్ సంచ‌ల‌నం !

కెప్టెన్ కూల్ కాదు…నరరూప రాక్షసుడు, ధోనిపై చాహ‌ల్ సంచ‌ల‌నం !
Advertisement

Yuzvendra Chahal scared of MS Dhoni:   టీమిడియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ( MS Dhoni) మిస్టర్ కూల్ అన్న సంగతి తెలిసిందే. ఎలాంటి గొడవలు లేకుండా.. ఎవరిని తిట్టకుండా టీమిండియా జట్టును దాదాపు పది సంవత్సరాల పాటు ఏలాడు. ఈ క్రమంలోనే అతని అద్భుతమైన కెప్టెన్సీతో మూడు ఐసీసీ ట్రోఫీలను కూడా టీమిండియాకు అందించాడు. ఎలాంటి ఒత్తిడి వచ్చినా కూడా ప్లేయర్లను తిట్టకుండా… జట్టును ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఓడిపోతే బాధ్య‌త‌ను త‌న‌పై వేసుకుని, గెలిస్తే..ప్లేయ‌ర్ల‌కు క్రెడిట్ ఇచ్చేవాడు.

అందుకే అతడిని మిస్టర్ కూల్ అని పిలుస్తూ ఉంటారు. అలాంటి మహేంద్ర సింగ్ ధోనికి కూడా కోపం వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయని అతనితో కలిసి ఆడిన ప్లేయర్లు చెబుతూ ఉంటారు. తాజాగా యుజ్వేంద్ర చాహల్ ( Yuzvendra Chahal ) కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. మహేంద్ర సింగ్ ధోని అందరూ ఊహించినట్లుగా కూల్ కెప్టెన్ కాదని.. అతనిలోను రాక్షసుడు ఉన్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోపం వస్తే అతనికి వచ్చినన్ని బూతులు ఎవరికీ రావని చాహల్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

న‌న్ను కూడా ధోని తింటాడు..చాహ‌ల్ సంచ‌ల‌నం

Advertisement

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గురించి తాజాగా యుజ్వేంద్ర చాహల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధోనికి కూడా కొన్ని సందర్భాలలో కోపం వస్తుందని పేర్కొన్నారు. అతడి కోపానికి తాను కూడా ఒకసారి బలి అయినట్లు షాకింగ్ నిజాలను బయటపెట్టారు. ఇంగ్లాండ్ తో మ్యాచ్ జరిగిన సందర్భంగా.. రూట్ రనౌట్ ఛాన్సు ను తాను మిస్ చేశానని గుర్తు చేశారు. ఈ క్రమంలో ధోని నన్ను తిట్టకుండా కోపంతో చూసాడని వెల్లడించారు. అతడి కోపాన్ని చూసి.. నేను ప్యాంటు తడుపుకున్నాను అంటూ వ్యాఖ్యానించారు. అంతలా సీరియస్ అయ్యాడని.. అలాంటి కోపం ధోనిలో తాను ఎప్పుడు చూడలేదని వివరించారు. కానీ ఆ గొడవ తర్వాత మళ్లీ ఎప్పటిలాగే తనతో మహేంద్ర సింగ్ ధోని మాట్లాడినట్లు గుర్తు చేశారు.

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

అసలు చాహల్ పై ధోని ఎందుకు కోప్పడ్డాడంటే ?

Advertisement

2017లో ఇంగ్లాండ్ తో టీమ్ ఇండియా ఓ టీ20 మ్యాచ్ ఆడింది. ఈ సందర్భంగా 25 పరుగులకే చాహల్ 6 వికెట్లు పడగొట్టాడు. ఇంత బాగా ప్రదర్శన కనబరిచిన చాహల్… జో రూట్ ను రన్ అవుట్ చేయడంలో విఫలమయ్యాడు. ఈ మ్యాచ్ లో చాహల్ బౌలింగ్ చేస్తుండగా… జో రూట్ సురేష్ రైనా వైపు ఓ షాట్ ఆడాడు. అయితే రైనా వెంటనే బంతిని అందుకొని బౌలర్ చాహల్ వైపు విసిరాడు. ఈ క్రమంలో జో రూట్ క్రీజ్ కు చాలా దూరంగానే ఉన్నాడు. కానీ తన దగ్గర ఉన్న వికెట్లను కొట్టకుండా… మహేంద్ర సింగ్ ధోనికి బంతి విసిరాడు. కంగారులో ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో… ధోని చాలా సీరియస్ గా చాహల్ వైపు చూశాడు. దాంతో చాహ్ భయపడి పోయి.. సైలెంట్ అయ్యాడు. అయితే ఆ తర్వాత రైనా వచ్చి ఇలాంటివి సహజమే అని… చాహల్ కు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఇదే విషయాన్ని తాజాగా చాహల్ బయట పెట్టారు.

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

Tags

Related News

నా జోలికి వ‌స్తే, ప‌ళ్లు రాల‌గొడ‌తా…హర్ష భోగ్లేకు జైస్వాల్ వార్నింగ్ !

స్పాన్స‌ర్లు దిక్కులేక‌..20 ఏళ్లుగా PEPSIతోనే క‌థ గ‌డిపేస్తోన్న పాకిస్తాన్‌

క్రిస్టియానో రోనాల్డో కంటే గొప్పోడిని అన్న‌ట్లుగా కోహ్లీ ఫీల్ అవుతాడు!

కావ్య పాప‌కు బిగ్ షాక్‌… SRH డేంజ‌ర్ ప్లేయ‌ర్ కు బేడీలు వేసిన పోలీసులు

పాకిస్తాన్ ప‌త‌నానికి బాబ‌ర్ ఆజం కుట్ర‌లే కార‌ణం…వాడి వ‌ల్లే అంద‌రూ దోషుల‌య్యారు

బీసీసీఐకి ఎదురుదెబ్బ‌..ACC ఎన్నిక‌ల్లో ఇండియాపై పాకిస్తాన్ విజ‌యం

5 ఓవ‌ర్లు ఆడే శ‌క్తి కూడా ధోనికి లేదు..కానీ రిటైర్మెంట్ ఇవ్వ‌కుండా బ‌ల‌వంతంగా ఆపుతున్నారు!

Big Stories

Advertisement
×