2026 Royal Enfield Continental GT 650: రెట్రో లుక్, కేఫ్ రేసర్ స్టైల్, ట్విన్ సిలిండర్ ఇంజన్.. ఈ మూడు కలిస్తే గుర్తొచ్చే బైక్‌లలో రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ GT 650 ఒకటి. పాతకాలపు కేఫ్ రేసర్ డిజైన్ ను లేటెస్ట్ ఇంజిన్, ఫీచర్లతో కలిపి ఈ బైక్‌ను కంపెనీ అందిస్తోంది. 2026 మోడల్‌ను కొనాలని ఆలోచిస్తున్న వారు ముందు ఈ 8 ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి.
కాంటినెంటల్ GT 650 ధర రూ.3.58 లక్షల నుంచి రూ.3.88 లక్షల మధ్య ఉంది. రాకర్ రెడ్, బ్రిటిష్ రేసింగ్ గ్రీన్ వేరియంట్ల ధర రూ.3.58 లక్షలు. అపెక్స్ గ్రే ధర రూ.3.81 లక్షలు కాగా, మిస్టర్ క్లీన్ వేరియంట్ రూ.3.88 లక్షలకు లభిస్తుంది.
ఈ బైక్‌లో 648cc, ఎయిర్/ఆయిల్-కూల్డ్ ప్యారలల్-ట్విన్ ఇంజన్ ఉంటుంది. ఇది 7,150rpm వద్ద 47hp పవర్, 5,250rpm వద్ద 52.3Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆరు స్పీడ్ గేర్ బాక్స్ ద్వారా పవర్ వెనుక చక్రానికి అందుతుంది. ట్విన్ సిలిండర్ ఇంజన్ కారణంగా హైవే రైడింగ్ లో మంచి పనితీరును కనబరుస్తుంది.
కాంటినెంటల్ GT 650 సీట్ ఎత్తు 820mm. బైక్ వీల్‌బేస్ 1,398mm కాగా, గ్రౌండ్ క్లియరెన్స్ 174mmగా ఉంది. అయితే సీటు ఎత్తు కొంత ఎక్కువగా ఉండటంతో తక్కువ ఎత్తు ఉన్న రైడర్లు టెస్ట్ రైడ్ చేసి నిర్ణయం తీసుకోవడం మంచిది.
2026 మోడల్‌లో కొన్ని లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. LED ఇండికేటర్లు, USB టైప్ C ఛార్జింగ్ పోర్ట్, బ్లాక్ ఫినిష్ తో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ కౌల్ ఇందులో ఉన్నాయి. రాకర్ రెడ్, అపెక్స్ గ్రే వేరియంట్లలో బ్లాక్ అవుట్ ఇంజన్, ఎగ్జాస్ట్ తో పాటు కాస్ట్ అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి.
భద్రత విషయంలో కాంటినెంటల్ GT 650లో డ్యూయల్ ఛానల్ ABS స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. ముందు భాగంలో 320mm డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో 240mm డిస్క్ బ్రేక్ ఉన్నాయి.
కాంటినెంటల్ GT 650 కెర్బ్ బరువు 214 కిలోలు. గ్రౌండ్ క్లియరెన్స్ 174mm. నగరాల్లో ట్రాఫిక్ మధ్య నడిపేటప్పుడు బైక్ బరువు కొంత అనిపించే అవకాశం ఉన్నా, హైవేపై ఇదే బరువు స్టెబులిటీకి ఉపయోగపడుతుంది.
ఈ బైక్‌లో 12.5 లీటర్ల సామర్థ్యం ఉన్న ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. కేఫ్ రేసర్ డిజైన్‌కు సరిపోయే విధంగా ట్యాంక్ ఆకారం కూడా ప్రత్యేకంగా ఉంటుంది.
అన్ని వేరియంట్లలో అల్లాయ్ వీల్స్ ఉండవు. రాకర్ రెడ్, అపెక్స్ గ్రే వేరియంట్లలో కాస్ట్ అల్లాయ్ వీల్స్ లభిస్తాయి. బ్రిటిష్ రేసింగ్ గ్రీన్, మిస్టర్ క్లీన్ వెర్షన్లలో మాత్రం స్పోక్ వీల్స్ ఉన్నాయి.
Read Also: ఏప్రిలియా టుయోనో 457 vs స్పెషల్ ఎడిషన్.. రెండింటి మధ్య తేడాలు ఇవే!