OnePlus Nord 5 vs Nothing Phone 3a Pro| మధ్య-శ్రేణి స్మార్ట్‌ఫోన్ మార్కెట్ రోజురోజుకూ వేగంగా పెరుగుతోంది. ఈ రేంజ్ లో ఇటీవల విడుదలైన OnePlus Nord 5, అంతకుముందు వచ్చిన Nothing Phone 3a Pro రెండూ ఫ్లాగ్‌షిప్ ఫీచర్లను సరసమైన ధరలో అందిస్తున్నాయి. కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి ఈ రెండు ఫోన్ల మధ్య ఎంచుకోవడం కష్టమైన నిర్ణయం. డిజైన్, కెమెరా, పర్‌ఫామెన్స్, ధరలో ఈ రెండు ఫోన్లు ఎలా ఉన్నాయో పొల్చి చూద్దాం.
డిస్‌ప్లే, డిజైన్
OnePlus Nord 5లో 6.83-అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్ 1,800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఇది గేమింగ్, వీడియోలు చూడటానికి అద్భుతంగా ఉంటుంది. మరోవైపు, Nothing Phone 3a Proలో 6.77-అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఇది Nord 5 తో పొలిస్తే కాస్త బ్రైట్ నెస్ తక్కువగా ఉన్నా..దీని ట్రాన్స్‌పెరెంట్ బ్యాక్ డిజైన్, LED గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ దీన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి.
పర్‌ఫామెన్స్
OnePlus Nord 5లో Qualcomm Snapdragon 8s Gen 3 చిప్‌సెట్, 12GB వరకు RAM ఉన్నాయి. ఇది గేమింగ్, మల్టీటాస్కింగ్ కోసం పవర్‌ఫుల్ ఫోన్‌గా ఉంటుంది. Nothing Phone 3a Pro.. వన్ ప్లస్ నార్డ్ 5 తో సమానంగా పనితీరును అందించలేకపోవచ్చు, కానీ రోజువారీ ఉపయోగం సాధారణ గేమింగ్‌కు ఇది బాగా పనిచేస్తుంది.
కెమెరా సామర్థ్యం
Nothing Phone 3a Pro కెమెరా విషయానికి వస్తే.. ఇందులో 50MP సామ్‌సంగ్ మెయిన్ సెన్సార్ (OIS, EISతో), 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ (60x అల్ట్రా జూమ్), 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఉంది. OnePlus Nord 5లో 50MP సోనీ మెయిన్ సెన్సార్ (OISతో), 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, మరియు 50MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. Nothing Phone ట్రిపుల్ కెమెరా సెటప్ ఫోటోగ్రఫీ ప్రియులకు ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటుంది.
బ్యాటరీ ఛార్జింగ్
OnePlus Nord 5 భారీ 6800 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో గెలుస్తుంది. Nothing Phone 3a Pro కూడా ఫాస్ట్ ఛార్జింగ్‌ను అందిస్తుంది, కానీ బ్యాటరీ చిన్నదిగా ఉండడంతో ఛార్జింగ్ వేగం కూడా కొంచెం నెమ్మదిగా ఉంటుంది.
భారతదేశంలో ధర
OnePlus Nord 5 ధరలు: 8GB + 256GB మోడల్ రూ.31,999, 12GB + 256GB రూ.34,999, 12GB + 512GB రూ.37,999.
Nothing Phone 3a Pro ధరలు: 8GB + 128GB రూ.29,999, 8GB + 256GB రూ.31,999, 12GB + 256GB రూ.33,999.
Also Read: మళ్లీ పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు .. ఎప్పటినుంచి అంటే?
ఫైనల్ రిజల్ట్
ఆకర్షణీయమైన డిజైన్, మల్లీ కెమెరా సెటప్ కావాలనుకుంటే, Nothing Phone 3a Pro గొప్ప ఎంపిక. అయితే, పనితీరు, డిస్‌ప్లే క్వాలిటీ, బ్యాటరీ లైఫ్ మీ ప్రాధాన్యతలైతే, OnePlus Nord 5 మంచి విలువను అందిస్తుంది. మీరు ఏ ఫోన్ ని ఎంచుకుంటారో.. మీ అవసరాలపై ఆధారపడి ఉంటుంది. డిజైన్, కెమెరా ఆవిష్కరణలు లేదా గేమింగ్, పర్‌ఫామెన్స్ లాంటి ఫీచర్ల ఆధారంగా ఏ ఫోన్ కొనాలో నిర్ణయించుకోండి