Tollywood Movies : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక మూవీ హిట్ అయితే ఆ మూవీ గురించి ఆలోచిస్తారు.. అలాంటి స్టోరీ తో సినిమా తీయాలని లేదా ఆ టైటిల్ని మనం కూడా పెట్టుకుని సినిమా తీస్తే హిట్ అవుతామని చాలా మంది భావిస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు హిట్ టాక్ ని సొంతం చేసుకున్న కూడా. మరికొన్నిసార్లు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొడుతున్నాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈమధ్య యంగ్ హీరోలు అందరూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల టైటిల్ లను వాడుతున్నారు అయితే పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ పెట్టినా కూడా ఆ హీరోలకు అదృష్టం మారలేదు.. ఇప్పటివరకు రెండు సినిమాలు వచ్చాయి. అందులో ఏ ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. పవన్ కళ్యాణ్ ఆల్ టైం క్లాసిక్ సినిమాల టైటిల్స్ ని తెగ వాడేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే.. ఒకరకంగా పరువు తీస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.
పవన్ కళ్యాణ్ టైటిల్స్ తో వచ్చిన సినిమాలు..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నో హిట్ చిత్రాలలో నటించి ప్రేక్షకులు మనసులో జరగని ముద్ర వేసుకున్నారు. ఆయన నటించిన కొన్ని సినిమాలు ఇప్పటికీ టీవీలలో వస్తుంటే జనాలు అతుక్కుపోయి చూస్తుంటారు. అలాంటి వాటిలో ఖుషి సినిమా ఒకటి. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ తో పాటు సినిమా స్టోరీ కూడా యూత్ ని బాగా ఆకట్టుకుంది. అప్పట్లో ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈమధ్య ఈ టైటిల్ తో టాలీవుడ్ విజయ్ దేవరకొండ సినిమా చేశారు. ఆ మూవీ స్టోరీ సరిగ్గా లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫ్లాప్ అయ్యింది.
అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి..
టాలీవుడ్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన రీసెంట్ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఈ సినిమా కూడా కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది. పవన్ కళ్యాణ్ క్లాసిక్ సినిమా టైటిల్ ని పెట్టుకొని సక్సెస్ ని అందుకున్నది..
నితిన్ ‘తమ్ముడు’..
టాలీవుడ్ హీరో నితిన్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన సాలిడ్ హిట్ అందుకున్న తమ్ముడు మూవీ టైటిల్ తో నితిన్ లేటెస్ట్ గా ఒక చిత్రంలో నటించారు. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్.. ఈ మూవీ నిన్న థియేటర్లో ఫ్రెండ్ గా రిలీజ్ అయింది. కానీ పాజిటివ్ టాక్ ని అందుకోలేకపోయింది అని తెలుస్తుంది. అందరూ కలిసి టైటిల్ కి న్యాయం చేస్తారాని ఆశించారు. నేడే ఈ చిత్రం గ్రాండ్ గా విడుదలైంది. ఆడియన్స్ నుండి మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంత చేసుకున్న ఈ మూవీ రెండో రోజు ఓపెనింగ్స్ కూడా దారుణంగా ఉన్నాయని టాక్.
Also Read :శనివారం టీవీల్లోకి వచ్చేస్తున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..
వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాత్రమే. 2017 వ సంవత్సరం లో వెంకీ అట్లూరి ఇతన్ని హీరో గా పెట్టి ‘తొలిప్రేమ’ అనే చిత్రం చేసాడు. కమర్షియల్ గా ఈ చిత్రం అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది.. కానీ రీసెంట్ గా మాత్రం ఇవి వర్కౌట్ అవ్వడం లేదు. అనవసరంగా ఆ టైటిల్స్ యొక్క బ్రాండ్ విలువని తీసేస్తున్నారు అంటూ సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు..