OTT Movie : ఒక సై-ఫై యాక్షన్ మూవీ డిఫరెంట్ స్టోరీతో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో స్టోరీ ప్రకృతి విపత్తుతో మొదలవుతుంది. భయంకరమైన షార్క్ చేపలతో వచ్చే సన్నివేశాలు గగుర్పాటుకు గురి చేస్తాయి. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో
ఈ సై-ఫై యాక్షన్ క్రీచర్ ఫీచర్ మూవీ పేరు ‘ఎంపైర్ ఆఫ్ ది షార్క్స్’ (Empire of Sharks). 2017లో విడుదలైన ఈ సినిమాకి మార్క్ ఆట్కిన్స్ దర్శకత్వం వహించారు. ఇది ‘ప్లానెట్ ఆఫ్ ది షార్క్స్’ (2016)కి సీక్వెల్‌గా రూపొందింది. ఇందులో జాన్ సావేజ్, జాక్ ఆర్మ్‌స్ట్రాంగ్, తాండి సెబె, ఆష్లీ డి లాంగ్ ప్రధాన పాత్రలలో నటించారు. 2 గంటల 29 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమా, అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
కథ ఒక డిస్టోపియన్ భవిష్యత్తులో జరుగుతుంది, ఇక్కడ భూమి దాదాపు పూర్తిగా నీటి కింద మునిగిపోతుంది. మిగిలిన మానవులు ఫ్లోటింగ్ దీవులపై జీవిస్తుంటారు. ఇయాన్ ఫీన్, ఒక క్రూరమైన వార్‌లార్డ్. తన ఎలక్ట్రిక్ గ్లోవ్స్ ద్వారా షార్క్‌లను నియంత్రిస్తూ, ఈ దీవులను ఆధీనంలో ఉంచుతాడు. మానవులు అతనికి ట్రిబ్యూట్ చెల్లిస్తారు. లేదా బందీలుగా మారి షార్క్‌లకు ఆహారంగా మారతారు. విల్లో ఒక షార్క్ కాలర్ కుమార్తె. ఆమె తండ్రి అసాధారణ సామర్థ్యాన్ని వారసత్వంగా పొందుతుంది. దీని వల్ల షార్క్‌లను ఆమె తన ఆలోచనల ద్వారా కంట్రోల్ చేస్తుంది. ఇయాన్ ఫీన్ కి ఈ విషయం తెలిసి ఆమెను బంధిస్తాడు. టిమోర్, మసాకి ఆమెను రక్షించడానికి, ఇయాన్ ఫీన్ ఆధిపత్యాన్ని అంతం చేయడానికి ఒక ధైర్యమైన ప్రయత్నం చేస్తారు.
వీళ్ళు తమకి సప్పోర్ట్ చేసే మనుషులను ఒక చోటికి పిలిపిస్తారు. విల్లో సామర్థ్యాలను ఉపయోగించి, షార్క్‌లను వార్‌లార్డ్‌పైకి తిప్పడంతో, ఒక ఉత్కంఠభరితమైన యుద్ధంలో పాల్గొంటారు. ఈ క్రమంలో విల్లో తన షార్క్ కాలింగ్ సామర్థ్యాన్ని తెలుసుకుటుంది. ఇయాన్ ఫీన్ షార్క్ సైన్యాన్ని, ఆమె తన కున్న పవర్ తో కంట్రోల్ చేస్తుంది. ఇది ఒక ఉత్కంఠభరితమైన సముద్ర యుద్ధానికి దారితీస్తుంది. చివరికి విల్లో ఈ యుద్దంలో పై చేయి సాధిస్తుందా ? ఇయాన్ పరిస్థితి ఏమవుతుంది ? ఈ యుద్దంలో షార్క్ లు ఎవరికి సప్పోర్ట్ చేస్తాయి ? అనే విషయాలను ఈ సై-ఫై యాక్షన్ క్రీచర్ ఫీచర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : భార్య ఉండగానే ప్రేయసితో… చిన్న క్లూ కూడా దొరక్కుండా మర్డర్… మెంటలెక్కించే కోర్టు రూమ్ డ్రామా క్లైమాక్స్