Parineeti Chopra: బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో పరిణితి చోప్రా(Parineeti Chopra) ఒకరు. ఇటీవల ఈమె పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.. అయితే తాజాగా ఈమె మహిళల గురించి వారి శరీరాకృతి గురించి వస్తున్న విమర్శలపై స్పందిస్తూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ప్రముఖ నటి కత్రినా కైఫ్ శరీర ఆకృతి పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో తాజాగా మాతృత్వం గురించి అలాగే ప్రసవాంతరం వచ్చే శరీరం మార్పులు గురించి కూడా మాట్లాడుతూ విమర్శకులకు కౌంటర్ ఇచ్చారు.
పరిణితి చోప్రా మాట్లాడుతూ.. నేను ఒక కొత్త ప్రాణానికి జన్మనిచ్చాను అలాంటప్పుడు నా శరీరాకృతి మునుపటిలాగా ఉండాలని ఎందుకు ఒత్తిడి తీసుకు వస్తున్నారంటూ ఈమె ప్రశ్నించారు. తనకు ప్రసవం జరిగే ఆరు నెలలు అవుతున్న ఎందుకు మునుపటి శరీరాకృతి లేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలా ఒక మాతృమూర్తిని ప్రశ్నించడానికి మీరెవరు? అంటూ ఈమె మండిపడ్డారు. ఒక బిడ్డ తన శరీరంలో ప్రాణం పోసుకుంటున్నప్పుడు ఎన్నో రకాల మార్పులు వస్తాయి ఆ మార్పులను అంగీకరించకుండా ఇలా విమర్శించడం సిగ్గుచేటని తెలిపారు.
కండలు పెంచడం కోసం జిమ్ వెళ్తే కండలు పెరుగుతాయని ఎండలో తిరిగితే చర్మం నల్లబడుతుందనే మార్పులను స్వీకరించే జనాలు అమ్మతనానికి ప్రతీకగా వచ్చే మార్పులను ఎందుకు స్వీకరించడం లేదని వీటిని మాత్రం ఎందుకు వ్యతిరేకంగా చూస్తారో అర్థం కావడం లేదని తెలిపారు. ప్రసవానంతరం నా శరీరంలో వచ్చిన మార్పులు, అలాగే నా శరీరంపై ఏర్పడిన స్ట్రెచ్ మార్కులను దాచుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. నా శరీరంపై ఉన్న ఈ స్ట్రెచ్ మార్కులను చూసిన ప్రతిసారి తాను ఒక బిడ్డకు జన్మనిచ్చాననే తీపి గుర్తులు నాకు ఉంటాయని తెలిపారు.
ఇలా ఒక అమ్మాయిగా బిడ్డకు జన్మనిస్తూ అమ్మ అవ్వడం అనేది ఎంతో పవిత్రమైన అందమైన అనుభవం. డెలివరీ తర్వాత శరీరంలో వచ్చే ప్రతి మార్పును ప్రతి సంకేతాన్ని ఒక వేడుకలా జరుపుకోవాలి కానీ అవమానకరంగా భావించకూడదని పరిణితి చోప్రా విమర్శలు చేసే వారికి తనదైన శైలిలోనే కౌంటర్ ఇచ్చారు. ఇక ఈమె రాజకీయ నాయకుడు రాఘవ్ చద్దాతో కలిసి రెండేళ్ల క్రితం పెళ్లి బంధంలో అడుగు పెట్టారు. గత ఏడాది ఈమె పండంటి మగ బిడ్డ నీర్ కు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇలా ప్రసవానంతరం ఈమె శరీరాకృతిలో మార్పులు రావడం తద్వారా తనపై విమర్శలు కురిపించిన వారికి తనదైన స్టైల్ లోనే కౌంటర్ ఇస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read: కీర్తి సురేష్ బోల్డ్ మూవీ ‘డోరతీ’ పై మణిరత్నం రియాక్షన్.. అసూయ పుడుతుందంటూ!