2027 Sankranthi Movies: చిన్న సినిమా మొదలుకొని పెద్ద సినిమాల వరకు దాదాపు చాలా సినిమాలు పండుగలను టార్గెట్గా చేసుకొని విడుదలవుతాయి. మరీ ముఖ్యంగా సంక్రాంతి పండుగ వచ్చింది అంటే.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హిట్టు, ఫ్లాప్ తో సంబంధం లేకుండా సంక్రాంతి సీజన్ లో విడుదలయ్యే ప్రతి సినిమాకి కూడా ఆడియన్స్ నుంచి మంచి ప్రజాదరణ లభిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతికి తమ సినిమా విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తూ ఉంటారు. అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి మాత్రం వారు చాలా గట్టిగా ఉండబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే వెంకటేష్ (Venkatesh), చిరంజీవి(Chiranjeevi), శర్వానంద్(Sharwanandh ), సాయి ధరమ్ తేజ్ (Sai Dharam tej) లాంటి హీరోలు సంక్రాంతి బరిలో నిలవడానికి స్లాట్ బుక్ చేసుకోగా.. ఇప్పుడు ఆ జాబితాలోకి సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) కూడా వచ్చి చేరారు అన్న వార్త మరింత ఆసక్తిని కలిగిస్తోంది.
అసలు విషయంలోకి వెళ్తే.. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, డ్యూడ్ సినిమాతో దర్శకుడిగా మరింత పేరు సొంతం చేసుకున్న అశ్విత్ మారిముత్తు దర్శకత్వంలో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ధర్మన్. కమలహాసన్ నిర్మాతగా.. రాజ్ కమల్ ఫిలిమ్స్ బ్యానర్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni) ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తుండడం గమనార్హం.
నిజానికి రజనీకాంత్ సినిమాలకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. దీనికి తోడు ఇందులో టాలీవుడ్ హీరో రామ్ పోతినేని కీలక పాత్ర పోషిస్తుండడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి అసలే టాలీవుడ్ లో భారీ ప్రజాదరణ కలిగిన రజినీకాంత్ ఇప్పుడు సంక్రాంతి బరిలో పోటీగా దిగితే.. తెలుగు సినిమాలకు కాస్త ఇబ్బంది అనే కామెంట్ కూడా వ్యక్తం అవుతున్నాయి.. మరి ఈ వార్ లో నెగ్గేది ఎవరు అనే ఆసక్తి ఇప్పటి నుంచి నెలకొనడం గమనార్హం.
2027 సంక్రాంతి బరిలో పోటీకి దిగబోతున్న హీరోలు , వారి చిత్రాల విషయానికి వస్తే.. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో వస్తున్న జనవరి 12న విడుదల సినిమా 2027 జనవరి 12వ తేదీన విడుదల కావడానికి సిద్ధమయ్యింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా జెట్ స్పీడులో దూసుకుపోతోంది. మరొకవైపు మెగాస్టార్ చిరంజీవి హీరోగా, ప్రముఖ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో రాబోతున్న చిత్రం కాకా. ఈ చిత్రం 2027 జనవరి 13న విడుదల కాబోతోంది.
also read: నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు అదే – నివేదా పేతురాజ్!
అలాగే దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా నటిస్తున్న జార్జ్ క్రిష్ సినిమా జనవరి 14న రిలీజ్ చేయడానికి మేకర్స్ ఫిక్స్ చేశారు. అలాగే గత కొంతకాలంగా వాయిదా పడుతూ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్న సాయి ధరంతేజ్ సంబరాలు ఏటిగట్టు కూడా సంక్రాంతి బరిలోనే నిలవడానికి సిద్ధమైంది. ఇప్పుడు రజనీకాంత్ ధర్మన్ సినిమా కూడా సంక్రాంతిని టార్గెట్గా చేసుకొని షూటింగ్ జరుపుకుంటూ ఉండడం గమనార్హం. మరి అసలైన పొంగల్ వార్ 2027లో జరగనుంది. మరి ఈ వార్ లో ఎవరు గెలుస్తారో చూడాలి.