E-Paper
Advertisement

వెంకటేష్ అంటే త్రివిక్రమ్ కు అంత భయమా.. ఎందుకో తెలుసా?

వెంకటేష్ అంటే త్రివిక్రమ్ కు అంత భయమా.. ఎందుకో తెలుసా?
Advertisement

Trivikram Srinivas: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల కాలంలో త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా కాలం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఆదర్శ కుటుంబం(Aadarshakutumbam) సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ (Venkatesh) నటించిన మొట్టమొదటి సినిమా కావటం విశేషం. వెంకటేష్ శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

వెంకటేష్ గారితోనే నా సినీ ప్రయాణం మొదలు..

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ నారాయణమ్మ అంటూ సాగిపోయే పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సాంగ్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం పాల్గొన్నారు. అయితే ఈ వేడుకలు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ అందరిలాగే తన ఫేవరెట్ హీరో వెంకటేష్ అని తెలిపారు. తాను ఇండస్ట్రీలో రచయితగా అవకాశం అందుకొని కలం పట్టుకొని రాసిన మొట్టమొదటి డైలాగ్ వెంకటేష్ గారి పవిత్ర బంధం సినిమా కోసమేనని త్రివిక్రమ్ గుర్తు చేసుకున్నారు. నా సినీ ప్రయాణం వెంకటేష్ గారితోనే మొదలైంది అందుకు నేను ఎప్పటికీ ఆయనకి కృతజ్ఞుడని త్రివిక్రమ్ తెలిపారు.

వెంకటేష్ అంటే కొంచెం భయం..

Advertisement

పవిత్ర బంధం కోసం నేను సినిమా డైలాగులు రాసిన కానీ వెంకటేష్ గారికి తెలియదని నువ్వు నాకు నచ్చావ్ సినిమా స్టోరీ చెప్పిన సమయంలోనే మొదటిసారి వెంకటేష్ ని కలిశానని తెలిపారు. ఇలా తన ప్రయాణం వెంకటేష్ గారితో మొదలైనప్పటికీ వెంకటేష్ అంటే తనకు చాలా భయమని తెలిపారు. ఆ భయం ఎందుకో ఇప్పటికి తెలియదు. బహుశా ఆయనని నేను మొదటి నుంచి కొంచెం దూరంగా చూడటం వల్ల తెలియని భయం ఉండిపోయిందేమోనని త్రివిక్రమ్ తెలిపారు. వెంకటేష్ గారు నాతో చాలా క్లోజ్ గా మాట్లాడినప్పటికీ మా మధ్య ఏదో తెలియని దూరం ఉంటుందని అది అయితే గౌరవంతో కూడిన ఇష్టంతో వచ్చిన భయం అంటూ త్రివిక్రమ్ తెలిపారు.

త్రివిక్రమ్ డైరెక్షన్ లో వెంకటేష్ మొదటి సినిమా..

ఇలా వెంకటేష్ గారంటే తనకు భయమంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలియజేయడంతో అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు వెంకటేష్ ఎక్కడ ఉంటే అక్కడ సరదా వాతావరణం ఏర్పడుతుంది అలాంటిది వెంకటేష్ గారంటే భయపడడం ఏంటీ అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంకటేష్ సినిమాలకు కథ రచయితగా పనిచేశారు కానీ దర్శకుడుగా ఆదర్శ కుటుంబం మొదటి సినిమా కావటం విశేషం. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా అక్టోబర్ 9వ తేదీ విడుదల అయ్యి ఎలాంటి సక్సెస్ అందుకుంటుందనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read: స్ట్రెచ్ మార్కులు తీపి గుర్తులు.. మాతృత్వం పై నటి ఎమోషనల్ కామెంట్స్!

Related News

ఆదర్శ కుటుంబం నుంచి ‘నారాయణమ్మ’ ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్

అమ్మ హీరోయినే..కూతురు హీరోయినే..ఇండస్ట్రీలో తల్లీకూతుర్ల హవా!

రూ.200 కోట్లు సాధ్యమేనా..? ‘ప్యారడైజ్’కి అసలు పరీక్ష ఇప్పుడే!

స్ట్రెచ్ మార్కులు తీపి గుర్తులు.. మాతృత్వం పై నటి ఎమోషనల్ కామెంట్స్!

కీర్తి సురేష్ బోల్డ్ మూవీ ‘డోరతీ’ పై మణిరత్నం రియాక్షన్.. అసూయ పుడుతుందంటూ!

2027 అసలైన పొంగల్ వార్.. లిస్టులో చేరిన రజనీకాంత్!

‘ఎవరో నన్ను ఫాలో అవుతున్నారు’.. కృతి సనన్ షాకింగ్ పోస్ట్

Big Stories

Advertisement
×