E-Paper
Advertisement

ఆదర్శ కుటుంబం నుంచి ‘నారాయణమ్మ’ ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్

ఆదర్శ కుటుంబం నుంచి ‘నారాయణమ్మ’ ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్
Advertisement

Narayanamm Song: మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్(Venkatesh) శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty)హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం “ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47″(Aadarsha Kutumbam House No47). ఈ సినిమా ఇదివరకే విడుదల కావాల్సిందిగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది అయితే ఈ సినిమాని అక్టోబర్ 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర నిర్మాతలు సిద్ధమయ్యారు. ఈ సినిమా అక్టోబర్ 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.

నారాయణమ్మ ఫుల్ సాంగ్ వచ్చేసింది..

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా సినిమా నుంచి నారాయణమ్మ (Narayanamma) అంటూ సాగిపోయే ఫుల్ సాంగ్ విడుదల చేశారు. వెంకటేష్ తో పాటు శ్రీనిధి శెట్టి డింపుల్ హయతి నివేదా పేతురాజ్ కలిసి ఈ పాటలో సందడి చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ సంగీత సారథ్యంలో రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు లిరిక్స్ అందించగా, ప్రభ రామ్ మిరియాల ఈ పాటను ఆలపించారు. ఎంతో ఎంటర్టైనింగ్ గా కొనసాగుతున్న ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది . ఈ పాటను గత రెండు రోజుల క్రితమే విడుదల చేయాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా వేస్తూ నేడు విడుదల చేశారు. నేడు సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహిస్తూ నారాయణమ్మ పాటను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

చిట్టి బాబు పాత్రలో వెంకటేష్..

Advertisement

ఇక ఈ సినిమా విషయానికి వస్తే కుటుంబ కథ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో వెంకటేష్ చిట్టిబాబు అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఇలా కుటుంబ కథ నేపథ్యంతో పాటు కొన్ని యాక్షన్ ఎలెమెంట్స్ కూడా ఉన్నాయని ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ వీడియో చూస్తేనే తెలుస్తుంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇదివరకు వెంకటేష్ నటించిన సినిమాలకు డైలాగులు కథ అందించినప్పటికీ ఆయన దర్శకత్వంలో ఇప్పటివరకు ఒక సినిమా కూడా చేయలేదు.

Advertisement

ఇలా మొదటిసారి త్రివిక్రమ్ డైరెక్షన్లో వెంకటేష్ సినిమా చేస్తున్నారు. ఇప్పటివరకు త్రివిక్రమ్ మల్లీశ్వరి ,నువ్వు నాకు నచ్చావ్ వంటి సినిమాలకు కథ రచయితగా పనిచేశారు. ఈ సినిమాలు ఎంతో మంచి సక్సెస్ అందుకున్నాయి. మొదటిసారి వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందనేది తెలియాల్సి ఉంది.. ఇక ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్ బ్యానర్ అలాగే సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగ వంశీ సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మరి అక్టోబర్ 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆదర్శ కుటుంబం ద్వారా వెంకీ ఎలాంటి హిట్ అందుకోబోతున్నారు తెలియాల్సింది.

Also Read: వెంకటేష్ అంటే త్రివిక్రమ్ కు అంత భయమా.. ఎందుకో తెలుసా?

Related News

ప్రమోషన్లలో రణబాలి సరికొత్త స్ట్రాటజీ.. సినిమాకు ప్లస్ అయ్యేనా?

వెంకటేష్ అంటే త్రివిక్రమ్ కు అంత భయమా.. ఎందుకో తెలుసా?

అమ్మ హీరోయినే..కూతురు హీరోయినే..ఇండస్ట్రీలో తల్లీకూతుర్ల హవా!

రూ.200 కోట్లు సాధ్యమేనా..? ‘ప్యారడైజ్’కి అసలు పరీక్ష ఇప్పుడే!

స్ట్రెచ్ మార్కులు తీపి గుర్తులు.. మాతృత్వం పై నటి ఎమోషనల్ కామెంట్స్!

కీర్తి సురేష్ బోల్డ్ మూవీ ‘డోరతీ’ పై మణిరత్నం రియాక్షన్.. అసూయ పుడుతుందంటూ!

2027 అసలైన పొంగల్ వార్.. లిస్టులో చేరిన రజనీకాంత్!

Big Stories

Advertisement
×