E-Paper
Advertisement

కేటీఆర్‌ను సాగనంపే రోజులు దగ్గరపడ్డాయి: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

కేటీఆర్‌ను సాగనంపే రోజులు దగ్గరపడ్డాయి: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Advertisement

Adi Srinivas: స్వేచ్ఛ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటన ఖరారు కావడంతోనే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌లో తీవ్ర కంగారు, భయం మొదలయ్యాయని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

అక్రమాల బండారం బయటపడుతుందనే భయం

Advertisement

రేవంత్ రెడ్డి సిరిసిల్ల గడ్డపై అడుగుపెడితే తన బండారం ఎక్కడ బయటపడుతుందోననే భయంతో కేటీఆర్ గింజుకుంటున్నారని ఆది శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ నెల 30న సిరిసిల్లలో జరిగే బహిరంగ సభలోనే కేటీఆర్ అసలు జాతకం మొత్తాన్ని బయటపెడతామని స్పష్టం చేశారు. కేటీఆర్‌ను రాజకీయంగా పాతాళంలోకి తొక్కి సాగనంపడానికే సీఎం వస్తున్నారని వ్యాఖ్యానించారు.

పక్కా లెక్కలతో వస్తున్నాం

Advertisement

ఇప్పటివరకు సిరిసిల్లకు కేటీఆర్ చేసిన అన్యాయాన్ని, మోసాలను పక్కా లెక్కలతో సహా ప్రజల ముందు ఉంచుతామన్నారు. చీమలు పెట్టిన పుట్టల్లో పాములు దూరినట్లు సిరిసిల్లకు వచ్చి ఇక్కడి ప్రజలను కేటీఆర్ మోసం చేశారని విమర్శించారు. నేతన్నలకు రూ. 300 కోట్ల బకాయిలు పెట్టి ముంచింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు.

సొంత కుటుంబ సభ్యుల వ్యాఖ్యలకు సమాధానమేది?

తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని కేసీఆర్ కుటుంబం వేల కోట్లు సంపాదించిందనేది నిజమని చెప్పారు. ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులైన కవిత, రమ్యారావులే స్వయంగా వెల్లడించారని, ముందుగా కేటీఆర్ వారికి సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.

Also Read: బెట్టింగ్, గేమింగ్ యాప్‌లపై ఈడీ పంజా.. రూ. 442 కోట్ల ఆస్తుల జప్తు!

Tags

Related News

మీ భూమి 22A జాబితాలో ఉందా? పెండింగ్ యూఎల్సీ దరఖాస్తులపై సర్కార్ కీలక నిర్ణయం!

వారెవ్వా ఏం టాలెంట్.. ఓ విద్యార్ధి చేసిన పనికి అధికారులంతా షాక్!

బెట్టింగ్, గేమింగ్ యాప్‌లపై ఈడీ పంజా.. రూ. 442 కోట్ల ఆస్తుల జప్తు!

హైదరాబాద్ సైబర్ క్రైమ్.. ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో డాక్టర్‌కే రూ. 14.61 కోట్ల టోకరా!

సిరిసిల్లలో అడుగుపెట్టే ముందు ఇవి తేల్చు.. సీఎం రేవంత్‌కి కేటీఆర్ బహిరంగ సవాల్!

కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో మంత్రి పదవుల పంపకం.. బీఆర్‌ఎస్‌పై ఎంపీ అరవింద్ సెటైర్లు!

ఆర్మీ ఆయుధాల కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్.. ఎలా దొంగతనం చేశాడంటే..

Big Stories

Advertisement
×