E-Paper
Advertisement

అమ్మ హీరోయినే..కూతురు హీరోయినే..ఇండస్ట్రీలో తల్లీకూతుర్ల హవా!

అమ్మ హీరోయినే..కూతురు హీరోయినే..ఇండస్ట్రీలో తల్లీకూతుర్ల హవా!
Advertisement

Heroines as Mother and Daughter: సినీ పరిశ్రమలో హీరోలకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో హీరోయిన్లకూ అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఒకప్పుడు తమ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లు.. తమ వారసత్వాన్ని కుమార్తెలకు అందించారు. తల్లి తర్వాత అదే రంగంలోకి అడుగుపెట్టి కథానాయికలుగా రాణించిన కొందరు తారలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

రాధ.. కుమార్తెలుగా కార్తీక, తులసి :

దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా వెలుగొందిన రాధ.. అందం, అభినయం, నృత్యంతో ప్రత్యేక గుర్తింపు పొందారు. తమిళ చిత్రం తో ఆమె సినీ ప్రయాణం ప్రారంభమైంది. తెలుగులో ‘మిస్టర్ విజయ్’ ఆమె తొలి చిత్రం. రాధ కుమార్తెలు కార్తీక, తులసి కూడా నటనలోకి వచ్చారు. కార్తీక ‘జోష్’తో, తులసి మణిరత్నం తెరకెక్కించిన ‘కడల్’తో హీరోయిన్‌గా పరిచయమయ్యారు.

సంధ్య-జయలలిత :

Advertisement

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటి జయలలిత తల్లి వేదవల్లి కూడా సినీ నటే. ఆమెను సంధ్య పేరుతో పిలిచేవారు. ‘మాయాబజార్’, ‘కృష్ణలీలలు’ వంటి చిత్రాల్లో నటించారు. జయలలిత ‘వెన్నిర ఆడై’తో కథానాయికగా పరిచయం కాగా, తెలుగులో ‘మనుషులు మమతలు’ చిత్రంతో అరంగేట్రం చేశారు.

లక్ష్మీ కుటుంబంలో మూడు తరాలు :

నటి లక్ష్మీ బాలనటిగా ‘శ్రీవల్లి’ చిత్రంలో కనిపించారు. ఆ తర్వాత ‘జీవనాంశం’తో కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె తల్లి కుమారి రుక్మిణి కూడా వందకు పైగా చిత్రాల్లో నటించారు. లక్ష్మీ కుమార్తె ఐశ్వర్య ‘ఒలియంబుకల్’తో మలయాళంలో, ‘అడవిలో అభిమన్యుడు’తో తెలుగులో పరిచయమయ్యారు.

లిజీ-కళ్యాణి ప్రియదర్శన్ :

Advertisement

మలయాళ నటి లిజీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఆమె కుమార్తె కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా ‘హలో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అఖిల్ అక్కినేని సరసన నటించిన కళ్యాణి.. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో కొనసాగుతున్నారు.

శ్రీదేవి వారసత్వాన్ని కొనసాగించిన జాన్వీ కపూర్:

అతిలోకసుందరిగా పేరొందిన శ్రీదేవి దక్షిణాది నుంచి బాలీవుడ్ వరకు తనదైన ముద్ర వేశారు. ఆమె కుమార్తె జాన్వీ కపూర్ ‘దడక్’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమయ్యారు. మరో కుమార్తె ఖుషి కపూర్ కూడా నటిగా సినిమాల్లోకి అడుగుపెట్టారు.

మంజుల కుమార్తెలు ముగ్గురూ నటీమణులే :

నటి మంజుల, నటుడు విజయ్ కుమార్ దంపతుల కుమార్తెలైన ప్రీతా, శ్రీదేవి, వనిత కూడా సినీ రంగంలోకి వచ్చారు. ప్రీతా ‘రుక్మిణి’తో, శ్రీదేవి ‘రిక్షా మామ’తో, వనిత ‘చంద్రలేఖ’తో నటిగా పరిచయమయ్యారు.

హేమమాలిని-ఈషా డియోల్ :

బాలీవుడ్‌లో ప్రముఖ నటిగా నిలిచిన హేమమాలిని నటనతో పాటు దర్శకత్వం, నిర్మాణం, నృత్యం వంటి రంగాల్లోనూ కొనసాగారు. ఆమె కుమార్తె ఈషా డియోల్ ‘కోయి మేరే దిల్ సే పూచ్చే’ చిత్రంతో కథానాయికగా పరిచయమయ్యారు. మరో కుమార్తె ఆహానా డియోల్ ‘నా తుమ్ జానో నా హమ్’లో కనిపించారు.

రేఖ తల్లి కూడా నటే :

బాలీవుడ్ దిగ్గజ నటి రేఖ బాలనటిగా ‘ఇంటిగుట్టు’ చిత్రంతో సినీ రంగంలోకి వచ్చారు. ఆమె తల్లి పుష్పవల్లి కూడా నటిగా గుర్తింపు పొందారు. ఆమె బాలనటిగా ‘సంపూర్ణ రామాయణం’లో నటించారు.

సారిక వారసత్వంలో శ్రుతి, అక్షర :

కమల్ హాసన్, సారిక దంపతుల కుమార్తెలైన శ్రుతి హాసన్, అక్షర హాసన్ కూడా నటీమణులుగా కొనసాగుతున్నారు. సారిక బాలనటిగా ‘హమ్‌రాజ్’తో గుర్తింపు పొందారు. శ్రుతి ‘హేరామ్’లో బాలనటిగా కనిపించి, ‘లక్’తో హీరోయిన్‌గా పరిచయమయ్యారు. అక్షర ‘షమితాబ్’తో నటిగా అరంగేట్రం చేశారు.

మేనక-కీర్తి సురేష్ :

నటి మేనక అసలు పేరు పద్మావతి. తమిళ చిత్రం ‘రామయి వయసుక్కు వన్‌తుట్టా’తో ఆమె సినీ ప్రయాణం ప్రారంభమైంది. ఆమె కుమార్తె కీర్తి సురేష్ బాలనటిగా పరిచయమై, హీరోయిన్‌గా ‘గీతాంజలి’ చిత్రంతో మంచి గుర్తింపు పొందారు.

also read: రోజుకు రూ.7.50లక్షలు.. బిగ్ బాస్ చరిత్రలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న కంటెస్టెంట్?

తనూజ-కాజోల్:

బాలీవుడ్ నటి తనూజ ‘హమారీ బేటీ’తో పరిచయం కాగా, ఆమె కుమార్తె కాజోల్ ‘బేఖుది’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు.

జీవిత-కుమార్తెలు: 

అలాగే నటి జీవిత కుమార్తెలు శివాని, శివాత్మిక కూడా నటనలోకి వచ్చారు. శివాత్మిక ‘దొరసాని’తో హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఇలా పలువురు తారల కుమార్తెలు తమ తల్లుల సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు.

Related News

ఆదర్శ కుటుంబం నుంచి ‘నారాయణమ్మ’ ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్

వెంకటేష్ అంటే త్రివిక్రమ్ కు అంత భయమా.. ఎందుకో తెలుసా?

రూ.200 కోట్లు సాధ్యమేనా..? ‘ప్యారడైజ్’కి అసలు పరీక్ష ఇప్పుడే!

స్ట్రెచ్ మార్కులు తీపి గుర్తులు.. మాతృత్వం పై నటి ఎమోషనల్ కామెంట్స్!

కీర్తి సురేష్ బోల్డ్ మూవీ ‘డోరతీ’ పై మణిరత్నం రియాక్షన్.. అసూయ పుడుతుందంటూ!

2027 అసలైన పొంగల్ వార్.. లిస్టులో చేరిన రజనీకాంత్!

‘ఎవరో నన్ను ఫాలో అవుతున్నారు’.. కృతి సనన్ షాకింగ్ పోస్ట్

Big Stories

Advertisement
×