E-Paper
Advertisement

కీర్తి సురేష్ బోల్డ్ మూవీ ‘డోరతీ’ పై మణిరత్నం రియాక్షన్.. అసూయ పుడుతుందంటూ!

కీర్తి సురేష్ బోల్డ్ మూవీ ‘డోరతీ’ పై మణిరత్నం రియాక్షన్.. అసూయ పుడుతుందంటూ!
Advertisement

Maniratnam -Dorothy Movie: ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు(Karthik Subbaraju) దర్శకత్వంలో కీర్తి సురేష్(Keerthy Suresh) నటించిన తాజా చిత్రం ‘డోరతీ'(Dorothy). ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కీర్తి సురేష్ బోల్డ్ పాత్రలో నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో సినిమా సెలబ్రిటీలు మాత్రం ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేయటం విశేషం. హోమ్లీ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన కీర్తి సురేష్ ఈ సినిమాలో బోల్డ్ పాత్రలో నటించారు. ఈ సినిమా LGBTQ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి విమర్శలను ఎదుర్కొంటుంది.

మలేషియాలో నిషేధం..

ఇక ఈ సినిమాను మలేషియాలో విడుదల చేయకుండా అక్కడ సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలియచేసింది.. ఇలాంటి ఒక బోల్డ్ సినిమా తమిళంలో విడుదల అయ్యి సోషల్ మీడియాలో విమర్శలను ఎదుర్కోవడమే కాకుండా ఈ సినిమాని బాయికాట్ చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నం (Maniratnam) ఈ సినిమా గురించి స్పందిస్తూ ప్రశంసలు కురిపించడంతో ఇది కాస్త సంచలనంగా మారింది.

ఇళయరాజ సంగీతం ప్రాణం పోసింది…

Advertisement

ఈ సినిమా పై మణిరత్నం స్పందిస్తూ ప్రస్తుతం మన దగ్గర ఎంతో ఉత్సాహవంతమైన యువ దర్శకులు ఉన్నారు . వీరందరిలో కార్తీక్ ఎంతో ప్రత్యేకమైన ప్రతిభావంతుడు అందరికీ నాయకత్వం వహిస్తూ ముందువరుసలో నిలిచారు. ఈయన దర్శకత్వంలో వచ్చిన డోరతీ సినిమా చాలా ప్రత్యేకమైన సినిమా అని తెలిపారు. ఈ సినిమా మేకింగ్ స్టైల్ పై మణిరత్నం స్పందిస్తూ.. డోరతి టేకింగ్ చాలా అద్భుతంగా ఉందని కార్తీక్ కెమెరా షాట్స్ టెక్నికల్ విజువల్స్ పట్ల ఉన్న పట్టు చూస్తుంటే నాకు కొంత అసూయ పుడుతుంది అంటూ మణిరత్నం తెలిపారు. ఇక ఈ సినిమాకు ఇళయరాజా గారి సంగీతం ప్రాణం పోసిందని ఈయన వెల్లడించారు.

Advertisement

ఇలా ఈ సినిమాకు సోషల్ మీడియా వేదికగా విమర్శలు వస్తున్న తరుణంలో మణిరత్నం మాత్రం ఈ సినిమాపై స్పందిస్తూ ప్రశంసలు కురిపించడంతో ఈ సినిమాకి మరింత బలం చేకూరింది. ఇక తమిళంలో విడుదలైన ఈ సినిమాని తెలుగులో కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే. స్పిరిట్ మీడియా ఈ సినిమాని ఏపీ తెలంగాణలో విడుదల చేయబోతున్నారు ఈ సినిమాని గాంధీ జయంతి పురస్కరించుకొని అక్టోబర్ రెండో తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇలా తమిళంలో విమర్శలను ఎదుర్కొన్న ఈ సినిమా తెలుగులో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏ విధమైనటువంటి సక్సెస్ అందుకుంటుందనేది తెలియాల్సి ఉంది.

Also Read: ట్రోలర్స్ కూడా సెలబ్రేట్ చేసుకోవాలి..చిరు శ్రీకాంత్ సినిమా నాని అప్డేట్!

Related News

2027 అసలైన పొంగల్ వార్.. లిస్టులో చేరిన రజనీకాంత్!

‘ఎవరో నన్ను ఫాలో అవుతున్నారు’.. కృతి సనన్ షాకింగ్ పోస్ట్

నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు అదే – నివేదా పేతురాజ్!

‘ది ప్యారడైజ్’ పై కేటీఆర్ ట్వీట్…ప్రియదర్శి రియాక్షన్ ఇదే!

నా జూలియట్ ఎక్కడ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రభాస్ పోస్ట్?

‘కల్కి 2’లో దీపికా స్థానంపై నాగ్ అశ్విన్ క్లారిటీ!

సినీ ఇండస్ట్రీలో విషాదం.. టాలీవుడ్ డైరెక్టర్ భార్య మృతి!

Big Stories

Advertisement
×