E-Paper
Advertisement

త్రిష ఆస్తుల లెక్క చూస్తే మైండ్ బ్లాక్.. ఇల్లు, కార్లు అన్నీ కోట్లలోనే!

త్రిష ఆస్తుల లెక్క చూస్తే మైండ్ బ్లాక్.. ఇల్లు, కార్లు అన్నీ కోట్లలోనే!
Advertisement

Trisha Net Worth: త్రిష..పరిచయం అక్కర్లేని పేరు.ఇక తమిళనాట దళపతి సీయం సీటు ఎక్కడంతో ఈమె పేరు నేషనల్ వైడ్ గా మారుమ్రోగిపోతుంది.మరి రెండు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్న ఈ తమిళ పొన్ను ఆస్తులెంతో,అసలు ఇపుడు ఈ భామ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో ఒకసారి చూసేద్దాం.

త్రిష పారితోషికం ఎంతంటే 

గత కొంతకాలం క్రితం వరకు త్రిష 5 కోట్ల నుండి పది కోట్ల మధ్యలో పారితోషికం తీసుకునేది అని, ఎప్పుడైతే పోన్నియన్ సెల్వన్, అలాగే లియో సినిమాలో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుందో అప్పటి నుండి పారితోషికం బాగా పెంచేసింది అని,ఇపుడు ఒక్కో సినిమాకి ఏకంగా పది కోట్ల నుండి 12 కోట్ల వరకు పుచ్చుకుంటుందని కోలీవుడ్ టాక్.అయితే అన్ని సినిమాలకి ఒకేలా ఉండదని, ప్రాజెక్ట్ ని ,ప్రొడక్షన్ హౌస్ ని అలాగే హీరోని బట్టి కూడా ఈ పారితోషికం లో హెచ్చు తగ్గులు ఉంటుందని తెలుస్తుంది.ఇక సినిమాల సంగతి అలా ఉంటె కేవలం యాడ్స్ ద్వారానే ఈ భామ ఏడాదికి ఏకంగా దాదాపు పదికోట్ల రూపాయలు వెనకేస్తుందట.

Advertisement

అలా త్రిష మొత్తంగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలతోపాటు , బ్రాండ్ ప్రమోషన్స్ ,ఇన్వెస్ట్మెంట్స్ వంటి వాటితో త్రిష భారీగానే ఆస్తులు కూడబెట్టినట్టు తెలుస్తుంది.ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం త్రిష మొత్తం ఆస్తి దాదాపు 80 కోట్ల నుండి 90 కోట్ల మధ్యలో ఉండొచ్చని సమాచారం.

చెన్నైలో ఉంటున్న ఇంటి విలువ ఏకంగా 

త్రిష ఇంటి విషయానికి వస్తే చెన్నైలో ప్రస్తుతం ఉంటున్న ఇంటి విలువ దాదాపు పది కోట్లు ఉంటుందని అంచనా.ఇక ఈ ఇంట్లో తనకి నచ్చినట్టుగా రస్ట్ ఆరెంజ్, బేజ్, బ్రౌన్, మ్యూటెడ్ గోల్డ్ షేడ్స్‌తో ఇంటి డెకరేషన్ చేసినట్లు తెలుస్తోంది.ముఖ్యంగా ఇంట్లో ఖరీదైన పెయింటింగ్స్ తో పాటు వివిధ ప్రాంతాల నుండి సేకరించిన వస్తువులతో ఇంటిని డిజైన్ చేసుకుందని టాక్.ఇక త్రిష వార్డ్ రోబ్ లో ఎంతో విలువగల డిజైనర్ వేర్ తో పాటు కాస్ట్లీహ్యాండ్ బ్యాగులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది.

హైదరబాదు ,లండన్ లో కూడా 

Advertisement

కేవలం చెన్నైలోనే కాకుండా ఈ భామకి హైదరాబాద్ లో కూడా దాదాపు ఏడు కోట్ల విలువైన ప్రాపర్టీ ఉందని, తను ఎప్పుడు షూటింగ్ కి హైదరాబాద్ వచ్చినా అక్కడే ఉంటుందని సమాచారం.ఇలా చెన్నై, హైదరాబాద్ లలోనే కాదండోయ్ .లండన్ లోనూ ఈ అమ్మడు మంచి ప్రాపర్టీని సొంతం చేసుకుందన్న వార్తలు వచ్చాయి.మరి ఇందులో నిజమెంతో త్రిషనే బయటపెట్టాలి.

ఇక త్రిష కార్ల విషయానికి వస్తే ఆమె వద్ద దాదాపు 5 కోట్ల నుండి 6 కోట్ల విలువైన కార్లు ఉన్నట్టు తెలుస్తుంది.వీటిలో Mercedes-Benz S-Class, E-Class, BMW 5 Series, Range Rover Evoque, Audi వంటి లగ్జరీ కార్లు కూడా ఉన్నాయంట.అయితే ఈ ఆస్తుల వివరాలన్నీ సోషల్ మీడియాలో వస్తున్న ఆధారంగానే వేసిన అంచనాలు తప్ప ఎక్కడా త్రిష అఫీషియల్ గా వీటిని కన్ఫాం చేయలేదనే సంగతి గుర్తుంచుకోవాలి.

ALSO READ :విశ్వనాథ్ అండ్ సన్స్‌…అచ్చం అలాగే ఉందే!

ఇంకెన్ని సినిమలాతో సందడి చేస్తుందో

ఇక త్రిష సినిమాల విషయానికి వస్తే ఈ మధ్య సూర్యతో కరుప్పు సినిమాతో సాలిడ్ సక్సెస్ చూసిన త్రిష మెగాస్టార్ విశ్వంభరతో మరోసారి ఆడియన్స్ ని పలకరించడానికి రెడీ అయిపొయింది.దాదాపు రెండు దశాభ్దాలుగా అలరిస్తున్న ఈ తమిళ భామ ముందు ముందు ఇంకెన్ని సినిమలాతో సందడి చేస్తుందో చూడాలి!

Tags

Related News

నాని రెమ్యునరేషన్ పెంచేశాడా? నిర్మాతలకు కొత్త లెక్క

రణబాలికి హైక్స్ లేవట.. మేకర్స్ లెక్క మామూలుగా లేదుగా!

‘రాజాసాబ్’ బ్యూటీ రిధి.. ఈసారి కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిందే!

నితిన్‌కు హిట్ పడి ఎన్నాళ్లయిందో.. ఈసారి అయినా లెక్క మారేనా?

హీరోగానే కాదు.. డైరెక్టర్‌గానూ సంపాదిస్తున్న విశ్వక్ సేన్!

లెజెండ్రీ డైరెక్టర్ సింగీతంకి ‘పద్మ అవార్డ్స్’ ఎందుకు రాలేదు?

పవన్.. ప్రభాస్.. ఇద్దరి పక్కన ఛాన్స్! నిధి లెక్క ఎప్పుడు మారుతుందో?

గురూజీకి సెకండ్ హాఫ్ నచ్చలేదా? ‘ఆదర్శ కుటుంబం’పై కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×