E-Paper
Advertisement

టైమ్ ట్రావెల్ చేసి మరీ చావగొట్టే సైకో… మైండ్‌బెండింగ్ థ్రిల్లర్

టైమ్ ట్రావెల్ చేసి మరీ చావగొట్టే సైకో… మైండ్‌బెండింగ్ థ్రిల్లర్
Advertisement

Psychological Mystery Thriller Series: ఒక అమ్మాయి మీద దారుణమైన దాడి జరుగుతుంది. తరువాత ఆమెకు ప్రపంచం స్థిరంగా కనిపించదు. ఈరోజు ఉన్న వస్తువు రేపు మరో చోట కనిపిస్తుంది. తనకు తెలిసిన మనుషులు, పరిస్థితులు కూడా మారిపోతుంటాయి. ఇదంతా తన మానసిక సమస్య అనుకున్న సమయంలో ఓ హత్య ఆమె గతాన్ని మళ్లీ కళ్ళ ముందుకు తెస్తుంది. ఆ హత్య వెనుక తనపై దాడి చేసిన వ్యక్తి ఉన్నాడని అనుమానం కలుగుతుంది. కానీ అతను సాధారణ హంతకుడు కాదు. కాలాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటూ మహిళలను టార్గెట్ చేసే వ్యక్తి. ఇలాంటి మైండ్ బెండింగ్ కథతో రూపొందిన సిరీసే ‘షైనింగ్ గర్ల్స్’ (Shining Girls). మరి ఈ సిరీస్ ఏ ఓటీటీలో ఉందో తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

కిర్బీ మజ్రాచీ ఓ దారుణమైన దాడి నుంచి ప్రాణాలతో బయట పడుతుంది. ఆ ఘటన తర్వాత ఆమె రియల్ వరల్డ్ పూర్తిగా మారిపోతుంది. తన చుట్టూ ఉన్న ప్రపంచం నిరంతరం మారుతున్నట్లు అనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో కూడా ఆమె తన జీవితాన్ని తిరిగి నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. కొన్నేళ్ల తర్వాత ఓ మహిళ హత్యకు గురవుతుంది. ఆ కేసును గమనించిన కిర్బీకి ఆ హత్యలో తనపై దాడి చేసిన వ్యక్తి హార్పర్ కర్టిస్ ప్రమేయం ఉండొచ్చని అనిపిస్తుంది. ఆమె అనుమానాన్ని సీరియస్‌ గా తీసుకున్న జర్నలిస్ట్ డాన్ వెలాజ్క్వెజ్ రంగంలోకి దిగుతాడు. ఆమెతో కలిసి దర్యాప్తు మొదలు పెడతాడు.

Advertisement

హార్పర్ మామూలు సీరియల్ కిల్లర్‌ లా కనిపించడు. అతని నేరాల వెనుక సమయం, ప్రదేశం, బాధితుల ఎంపికకు సంబంధించిన ఓ విచిత్రమైన నమూనా ఉంటుంది. అతను తన టార్గెట్లను ముందుగానే గమనించి, వారి జీవితాల్లోకి చొరబడతాడు. ఒక్కో మహిళ జీవితంలో ఏదో ఒక ప్రత్యేకతను గమనించి వారిని తన వేటకు ఎంచుకుంటాడు. కిర్బీకి మాత్రం అతని గురించి తెలుసుకునే విషయంలో ఓ ప్రత్యేకమైన సమస్య ఉంటుంది. ఆమె చుట్టూ ఉన్న ప్రపంచం మారిపోతుండటంతో, తాను గుర్తుంచుకున్న విషయాలు నిజమా కాదా అనే అనుమానం కూడా వస్తుంది.

అయినా తనపై జరిగిన దాడి, తాజా హత్య మధ్య సంబంధాన్ని నిరూపించడానికి ప్రయత్నిస్తుంది. డాన్‌ తో కలిసి గతంలోని కేసులను పరిశీలించిన కొద్దీ ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయని తెలుస్తుంది. వేర్వేరు కాలాల్లో కనిపించకుండా పోయిన మహిళలు, పరిష్కారం కాని హత్యలు, ఒకే తరహా ఆధారాలు అన్నీ హార్పర్ వైపు చూపిస్తాయి. హార్పర్ తన రహస్యాన్ని దాచుకోవడానికి మరోసారి కిర్బీని టార్గెట్ చేస్తాడు. కానీ ఈసారి ఆమె గతం నుంచి పారిపోవడం కాదు… తనను వెంటాడుతున్న మనిషి ఎవరో తెలుసుకుని ఎదుర్కోవాలని నిర్ణయించుకుంటుంది. మరి చివరికి ఆమె ఆ కిల్లర్ భరతం పట్టిందా ? వాడిని ఎలా బయట పెట్టింది ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటి ? అన్నది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.

తెలుగులో చూడొచ్చా ?

Advertisement

ఎలిజబెత్ మాస్ (Elisabeth Moss), వాగ్నర్ మౌరా (Wagner Moura), ఫిలిప్పా సూ (Phillipa Soo) కలిసి నటించిన ఈ సిరీస్‌ ను సిల్కా లూయిసా (Silka Luisa) రూపొందించారు. ఇప్పుడు Apple TVలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ఆడియో లేదు కానీ తెలుగు సబ్‌టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎంచక్కా థ్రిల్లర్ ప్రియులు ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయవచ్చు.

Read Also: రాత్రికి రాత్రే పాపులర్… సోషల్ మీడియా స్టార్స్ లైఫ్ ఇంత ఘోరంగా ఉంటుందా ? మస్ట్ వాచ్ మలయాళం థ్రిల్లర్

Tags

Related News

చనిపోయిన బిడ్డను తిరిగి తెచ్చే నానీ… ఆ ఇంట్లోకి అడుగు పెట్టాక వెన్నులో వణుకు పుట్టించే వింతలు

ఓటీటీలోకి మమిత బైజు ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

17 ఏళ్ల తర్వాత కిల్లర్ కి విడుదల… అమాయకులను ఇరికించే లాయర్లను వేటాడే కిల్లర్… ఇంటెన్స్ సైకో థ్రిల్లర్

మనుషుల్ని వేటాడే కోటీశ్వరులు… వేటలో చిక్కుకున్న అమ్మాయే వేటగాళ్లను వేటాడితే ? బ్లడీ సర్వైవల్ థ్రిల్లర్

బిగ్ బాస్ తరహాలో మరో రియాలిటీ షో.. తెలుగులో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

సైకోతో ఇంటర్వ్యూ… ట్విస్టులతో మెంటలెక్కించే సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్

టీవీ రేటింగ్స్ కోసం నేరస్థులను లైవ్‌ లో పట్టుకునే రియాలిటీ షో… హై-టెన్షన్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×