Pawan Kalyan HHVM : పవన్ కళ్యాణ్‌కు మాస్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. కెరీర్ మొదటి నుంచే.. పవన్‌తో సినిమా చేస్తే చాలు లాస్ అవ్వమనే ఫీల్‌తో నిర్మాతలు ఉండే వాళ్లు. దీనికి కారణం ఆయనకు ఉన్న మాస్ ఫ్యాన్ బేసే. ఒక మంచి ఇంట్రడక్షన్ సీన్.. అలాగే ఓ నాలుగు ఐదు ఎలివేషన్ షాట్స్ పడితే.. ఆ ఫ్యాన్సే పెట్టిన పెట్టుబడి రిటర్న్ చేస్తారని అనుకునే వాళ్లు. అయితే ఈ మధ్య భారీ రెమ్యూనరేషన్స్, అంతకు మించిన బడ్జెట్ కారణాల వల్ల ఆ లెక్క తప్పుతుంది.
ఇప్పుడు హరి హర వీరమల్లుకు డైరెక్టర్ జ్యోతికృష్ణ మళ్లీ పాత పద్దతే నమ్ముకున్నట్టు తెలుస్తుంది. కాన్సెప్ట్ కంటే ఎలివేషన్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు టాక్ వస్తుంది. అది ఏంటో ఇప్పుడు చూద్దాం…
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హరి హర వీరమల్లు మరో 9 రోజుల్లో థియేటర్లకు రాబోతుంది. ట్రైలర్ ముందు వరకు సినిమాపై ఎలాంటి హైప్ లేదు. బజ్ లేదు. కానీ, ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్ కు ఎక్కువ స్క్రిన్ టైం ఇవ్వడంతో పాటు కొన్ని ఎలివేషన్స్ సీన్స్ చూపించారు. దీంతో పవన్ కళ్యాణ్ వన్ మెన్ షో ఉంటుందని, అది అభిమానులకు నచ్చేస్తుందనే టాక్ ఇండస్ట్రీలో సాగింది.
ఆ టాక్ తోనే… హరి హర వీరమల్లు బిజినెస్ జరిగిందని చెప్పొచ్చు. తాజాగా ఈ సినిమాకు సెన్సార్ కూడా పూర్తి అయింది. దీనికి U/A సర్టిఫికేట్ రావడం.. సినిమా సెన్సార్ బోర్డు నుంచి ఒక్క కట్ కూడా చెప్పకోవడంతో మరింత బజ్ పెరిగింది. అలాగే సెన్సార్ టాక్ బయటికి వచ్చింది.
అలా.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ విషయం ఒకటి ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో తిరుగుతుంది. అదేంటంటే…
రెండు ఇంట్రొడక్షన్ సీన్స్..
హరి హర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్‌కు రెండు ఇంట్రొడక్షన్ సీన్స్ పెట్టారట. ఒకటి అన్నీ రెగ్యులర్ సినిమాల్లా.. హీరో ఇంట్రొడక్షన్ సీన్ అయితే.. మరొకటి, పవన్ కళ్యాణ్ క్రేజ్ అండ్ ఆయన అభిమానులను దృష్టిలో పెట్టుకుని రెండో ఇంట్రొడక్షన్ సీన్ క్రియేట్ చేశారట. దాన్ని సినిమాకు సింక్ అయ్యేలా ఒక ప్లేస్‌లో సెట్ చేశారట. అంటే పవన్ కళ్యాణ్ అభిమానులకు డబుల్ ట్రీట్ పక్కా అన్నమాట.
ఇది త్రివిక్రమ్ ప్లానేనా ?
ఇలాంటిది ఇంతకు ముందే పవన్ కళ్యాణ్ సినిమాల్లో చేశాం. పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అజ్ఞాతవాసి సినిమాలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఇంట్రొడక్షన్ సీన్ ఒకటి ఉంటుంది. త
తర్వాత సెకండాఫ్ టైంలో హీరో తన కంపెనీకి బాస్‌గా గ్రాండ్ ఎంట్రీ ఇస్తాడు. ప్రయివేట్ సెక్యూరిటీతో పవన్ కళ్యాణ్ జస్ట్ అలా నడుచుకుంటూ వస్తాడు. సినిమాలో అది హైలైట్ సీన్. అభిమానులకు కూడా ఆ సీన్ ఫుల్‌గా నచ్చేసింది. ఇప్పుడు అదే తరహాలో హరి హర వీరమల్లు సినిమాలో కూడా రెండు ఇంట్రొడక్షన్ త్రివిక్రమే పెట్టి ఉంటాడు అని అంటున్నారు.
హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నప్పుడు త్రివిక్రమ్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. కొన్ని సీన్స్ ఆయన ఆద్వర్యంలోనే డైరెక్ట్ చేశారట. అందులో ఈ రెండో ఇంట్రొడక్షన్ సీన్ కూడా ఉందని టాక్ వస్తుంది.