Unknown Facts About This Horror Movies: భయపడుతూనే హారర్ సినిమాలు చూసేందుకు ఆడియన్స్ ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఎంతటి భయానకమైన ద్రశ్యాలు ఉంటే అంతగా ఆ ఛిత్రాలు థ్రిల్ ఇస్తాయి. అందుకే హారర్ చిత్రాలు ఫ్యాన్స్ ఎక్కువ. హారర్ సినిమాలు వాటి భయానక కథలు, ఉత్కంఠభరితమైన దృశ్యాలతో ప్రేక్షకులను ఆకర్షిస్తాయి. అయితే, హారర్ సినిమాలు చిత్రీకరించే సమయంలో నిజ జీవితంలో భయానక అనుభవాలు ఎదుర్కొంటారు ఆయా సినిమాల నటీనటులు. ఇలాంటి సంఘటనలు కూడా సందర్భాలు చాలానే ఉన్నాయి. వాటి అనుభవాలను స్వయంగా ఆ చిత్రాల నటీనటుల బయటపెట్టి భయాందోళనకు గురవుతుంటారు. ఆయా సినిమాల షూటింగ్ సమయంలో జరిగిన దుర్ఘటనలు.. మరణాలు ఆ సినిమాల చుట్టూ ఒక రహస్యమైన కథనాన్ని సృష్టిస్తాయి వారంత చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆ హారర్ సినిమాల షూటింగ్ సమయంలో సంభవించిన కొన్ని దుర్ఘటనలు, మరణాల గురించి తెలుసుకుందాం.
1. ది బెల్ ఫ్రమ్ హెల్ (1973)
స్పానిష్/ఫ్రెంచ్ హారర్ సినిమా ఇది. ‘ది బెల్ ఫ్రమ్ హెల్’ షూటింగ్ సమయంలో దర్శకుడు క్లాడియో గెర్రిన్ హిల్ మరణించారు. చివరి రోజు షూటింగ్ సమయంలో, సినిమాలో చూపించిన బెల్ టవర్ నుంచి పడిపోయి ఆయన కన్నుమూశారు. ఇది ఆత్మహత్యా లేక దుర్ఘటనా అనేది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగా ఉంది. ఆయన మరణం తర్వాత, జువాన్ ఆంటోనియో బార్డెమ్ పోస్ట్-ప్రొడక్షన్ పనులను పూర్తి చేశారు.
2. ది క్రో (1993)
ఈ హారర్, యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కింది ఈ సినిమాలో. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే అనుకోని దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ సినిమా ప్రధాన పాత్ర పోషించిన నటుడు బ్రాండన్ లీ (ప్రసిద్ధ నటుడు బ్రూస్ లీ కుమారుడు) ఒక దృశ్యం షూటింగ్ సమయంలో తుపాకీ తుటా తగిలి మరణించారు. బ్లాంక్ బుల్లెట్లతో ఉపయోగించాల్సిన ప్రాప్ గన్‌లో, అనుకోకుండా ఒక బుల్లెట్ ఫ్రాగ్మెంట్ ఉండిపోయింది. ఆ గన్‌ను ఉపయోగించినప్పుడు, బ్రాండన్ లీ కడుపులో గాయపడ్డాడు. దీంతో మూవీ టీం హుటా హుటినా ఆయనను ఆస్పత్రికి తీసుకువెళ్లిన ఫలితం లేకుండ పోయింది. చికిత్స పొందుతూ బ్రాండలీ ఆసుపత్రిలో మరణించారు. నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్టు పోలీసులు పరిగణించారు.
3. ట్విలైట్ జోన్: ది మూవీ (1982)
ఇది ఒక సైన్స్-ఫిక్షన్, హారర్ ఆంథాలజీ చిత్రం. దర్శకుడు జాన్ లాండిస్ షూట్ చేసిన ఒక వియత్నాం యుద్ధ నేపథ్యంలో సాగే కథ. ఈ చిత్రంలో ఓ సన్నివేశంలో, హెలికాప్టర్ క్రాష్ అవుతుంది. దీనికి స్పెషల్ ఎఫెక్ట్స్ ఇచ్చేందుకు మూవీ టీం నిజమైన పేలుడు పదార్థాలు ఉపయోగించారు. అయితే ఆ సన్నివేశం చిత్రీకరించే సమయంలో జరిగిన ఈ దుర్ఘటనలో నటుడు విక్ మోరో మరణించారు. అలాగే సెట్ లో మరో ఇద్దరు బాల నటులు (మైకా దిన్ లీ, రెనీ చెన్) కూడా మృతి చెందడం మూవీ టీం ని తీవ్రంగా కదిలించింది. ఈ ఘటన సినిమా షూటింగ్‌లలో భద్రతా నిబంధనలను మార్చడానికి దారితీసింది.
ఆంట్రమ్ (2018)
ఈ సినిమా షూటింగ్ లోనూ మూవీ టీం భయంకరమైన సంఘటనలు ఎదురయ్యాయి. ఈ సినిమా ఒక ‘శాపగ్రస్త’ చిత్రంగా ప్రచారం చేశారు. ఈ సినిమా చూసిన 60 మంది ప్రేక్షకులు మరణించారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే, ఇవి కేవలం తప్పుడు ప్రచారమేనిన, మూవీపై కావాలని కొందరు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని మూవీ టీం వివరణ ఇచ్చింది. షూటింగ్ సమయంలో కానీ, సినిమా చూస్తున్నప్పుడు కానీ ఎటువంటి మరణాలు చోటుచేసుకోలేదని టీం స్పష్టం చేసింది.
ది ఎక్సార్సిస్ట్ (1973) ఈ సినిమాకు ఏదో శాపం ఉందనే ప్రచారం జరిగింది. షూటింగ్ సమయంలో మరణాలు జరగకపోయినా, సినిమా విడుదలకు ముందు, తర్వాత తొమ్మిది మంది సహాయక నటులు మరణించారట. అలాగే, సెట్‌లోనూ కొన్ని ప్రమాదకరమైన సంఘటనలు చోటుచేసుకన్నాయట. దీన్ని మూవీ టీం రహస్యంగా ఉంచినట్టు కథనాలు వినిపించాయి. అలాగే పోల్టర్‌గీస్ట్ సిరీస్ లోనూ ఊహించని ఘటనలు జరిగాయట. ఈ సినిమా సీరీస్ కూడా శాపగ్రస్తమనే ప్రచారం ఉంది. షూటింగ్ సమయంలో మరణాలు జరగనప్పటికీ నటులైన హీథర్ ఓ’రూర్క్ డొమినిక్ డన్ వంటి నటులు ఈ సినిమా తర్వాత మరణించడం మూవీపై అనుమానాలకు దారితీసింది.