Mithun Reddy arrested: ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. దాదాపు 6 గంటల విచారణ తర్వాత సిట్ ఆయనను అరెస్ట్ చేసింది. ఏపీ లిక్కర్ స్కాం కేసులో మిథున్ రెడ్డి ఏ4గా ఉన్నారు. రేపు సిట్ అధికారులు ఆయనను కోర్టు హాజరుపరచనున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో 12 మంది అరెస్ట్ అయ్యారు.
ఏపీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో అవకతవకలు, షెల్ కంపెనీల ద్వారా అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిగాయనే ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఆయనను విజయవాడలో విచారణకు పిలిచిన విషయం తెలిసిందే.. సుమారు ఆరు గంటల విచారణ అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన అనంతరం ఆయన కుటుంబానికి సిట్ అధికారులు సమాచారం అందించారు.
మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించారు. రెండు కోర్టులు కూడా ఆయన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించాయి. సుప్రీంకోర్టు ఆయనకు గడువు కోసం కూడా అనుమతి నిరాకరించింది. అయితే మిథున్ రెడ్డి ఈ కేసును రాజకీయ కక్షతో కూడినదిగా పేర్కొన్నారు. అరెస్టు తర్వాత ఆయనను రేపు ఆయనను సిట్ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే ఈ కేసులో మరిన్ని పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.
ఈ కేసులో సిట్ ఇవాళ తొలి ఛార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేసింది. ఈ ఛార్జ్‌షీట్‌లో సిట్ సంచలన విషయాలు బయటపెట్టింది. ఏసీబీ న్యాయాధికారికి 300 పేజీల ఛార్జ్ షీట్‌ను సమర్పించింది. ఈ ఛార్జ్ షీట్‌కు 100కు పైగా ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు దానికి యాడ్ చేసింది. మొత్తం రూ. 62 కోట్లు ఫ్రీజ్ చేసినట్లు పేర్కొంది. మొత్తం ఈ కేసులో 268మంది సాక్ష్యులను విచారించినట్లు సిట్ పేర్కొంది. 11 మంది నిందితుల స్టేట్‌మెంట్ల నివేదికలను ఛార్జ్‌షీట్‌లో బయటపెట్టింది. బంగారం షాపులు, రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు వివరించింది. షెల్ కంపెనీల ద్వారా మద్యం ముడుపులు, బ్లాక్ మనీని వైట్‌గా మార్చడం వంటి అంశాలను ఛార్జ్‌షిట్‌లో సిట్ తెలతిపింది.
ALSO READ: Aghori-Varshini: జైలులో అఘోరీ.. పబ్‌లో వర్షిణి.. వీడియో వైరల్