Vijay Sethupathi: సినిమా ఇండస్ట్రీలో మంచివాళ్ళ ముసుగులో కొంతమంది నటీనటులు, డైరెక్టర్లు,నిర్మాతలు, క్యాస్టింగ్ డైరెక్టర్లు చేసే పనులకు చాలామంది అమ్మాయిలు బలవుతూ ఉంటారు అని ఇప్పటికే ఎంతోమంది తెలిపిన విషయం తెలిసిందే. నిజానికి ఇండస్ట్రీలోకి ఎంతోమంది అమ్మాయిలు హీరోయిన్ అవుదామని కలలు కని వస్తారు. కానీ కొంతమంది మాత్రం వారి కలలను కల్లలుగానే మిగిలిస్తారు. అవకాశాల కోసం ఎంతో మంది దగ్గర లొంగిపోతారు.. ఈ విషయం పక్కన పెడితే.. తాజాగా కోలీవుడ్లో సంచలనం సృష్టిస్తున్న వార్త ఏదైనా ఉంది అంటే విజయ్ సేతుపతి(Vijay Sethupathi) పై క్యాస్టింగ్ ఆరోపణలే.
విజయ్ సేతుపతి పై క్యాస్టింగ్ ఆరోపణలు..
ఈ మధ్యకాలంలో రమ్య మోహన్(Ramya Mohan) అనే డాక్టర్ తన ఫ్రెండ్ ని విజయ్ సేతుపతి మోసం చేశాడని, ఇండస్ట్రీలో మంచి వాళ్ళ ముసుగు వేసుకున్న ఇలాంటి వాళ్లు ఎంతోమంది ఉన్నారు అంటూ సంచలన ట్వీట్ చేసింది.అంతేకాదు కేరావాన్ లోపలికి తీసుకెళ్లి మరీ కోరిక తీర్చుకుంటారంటూ ఆమె పెట్టిన ట్వీట్ క్షణాల్లో కోలీవుడ్ లో వైరల్ అవ్వడంతో ఈ ట్వీట్ పై పెద్ద ఎత్తున చర్చ నడిచింది. అయితే ఆ తర్వాత వెంటనే దాన్ని డిలీట్ చేయడంతో ఈ గొడవ అంతా సర్దుమణిగింది అనుకున్నారు.
విజయ్ సేతుపతి అలాంటి వాడే అంటున్న డైరెక్టర్ గీతాకృష్ణ..
అయితే తాజాగా ఆమె వ్యాఖ్యాలని సమర్థిస్తూ దర్శకుడు గీతాకృష్ణ (Geeta Krishna) విజయ్ సేతుపతి క్యారెక్టర్ పై సంచలన ఆరోపణ చేశారు. ఆయన తాజాగా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమిళ ఇండస్ట్రీలో నల్లగా ఉండే వారికి ఆదరణ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు విజయ్ సేతుపతికి యాక్టింగ్ కూడా ప్లస్ అయింది..దాంతో ఈయనకు వరుస అవకాశాలు వచ్చాయి. కమల్ హాసన్(Kamal Haasan),షారుఖ్ ఖాన్(Shahrukh Khan) వంటి పెద్ద హీరోల సినిమాల్లో నటించేసరికి ఈయనకి బాగా తల పొగరెక్కింది.
రెమ్యూనరేషన్ పెరిగే కొద్దీ తలపొగరు ఎక్కింది..
అంతేకాదు నేను నా సినిమాలో ఒక 10 రోజుల కాల్షీట్లు కావాలని విజయ్ సేతుపతిని అడిగితే చిన్న క్యారెక్టర్ ఇస్తే నేను చేయను. నా క్యారెక్టర్ చుట్టే పాత్రలన్నీ తిరగాలి. నాకు అందరికంటే ఎక్కువ ప్రాధాన్యత ఉండాలి.. అలా అయితేనే చేస్తానని కండిషన్ పెట్టాడు. అయితే సడన్గా ఫేమస్ అవ్వడంతో ఒకేసారి 20 నుండి 40 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు కదా.. అందుకే వచ్చిన డబ్బుని ఏం చేయాలో తెలియక ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నాడు.. హీరోయిన్ తో వచ్చే అమ్మాయిల్ని ఛాన్స్ ల పేరుతో వాడుకుంటున్నాడు. ఎంతో మంది అమ్మాయిలకు అవకాశం ఇస్తానని ముందే ప్రామిస్ చేస్తున్నాడు. ఆ తర్వాత కేరావాన్ లోకి ఆహ్వానించి తన కోరిక తీర్చేసుకుంటున్నాడు.
అమ్మాయిలతో దారుణంగా ప్రవర్తిస్తాడు -గీతాకృష్ణ
హీరోయిన్ పక్కన నటించే అమ్మాయి కేరావాన్ లోకి వస్తే 2 లక్షలు.. ఒకవేళ రూమ్లోకి వస్తే మరో రేటు పెట్టేస్తాడు. ఈయనో హిపోక్రటిక్.. అందర్నీ నమ్మించి మోసం చేస్తున్నాడు. మంచి వాడి ముసుగులో ఉన్నాడు. నేను నాకంటే చిన్న అమ్మాయితో నటించను కూతురుగా చేసిన అమ్మాయితో రొమాన్స్ ఎలా చేయగలను అని రిజెక్ట్ చేశాడు. చెప్పేవి శ్రీరంగనీతులు చేసేవి మాత్రం ఇలాంటి పనులు.. ఇంత సడన్ గా డబ్బులు ఎక్కువైపోతే ఏం చేస్తాడు ఇలాంటి చెత్త పనులే చేస్తాడు అంటూ దర్శకుడు గీతాకృష్ణ విజయ్ సేతుపతి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
also read:Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!