Mirai Movie : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డీలా పడుతున్నాయి. చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాలలో తేజ సజ్జ నటించిన హనుమాన్ ఒకటి. గత ఏడాది రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. భారీ విజయాన్నందుకోవడంతో ఈ సినిమాకు సీక్వెల్ గా మరో సినిమా రాబోతుందని ఎప్పుడో అనౌన్స్ చేశారు. ఆ సినిమా ఇప్పట్లో లేకపోవడంతో తేజా మరో మూవీని చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మిరాయ్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది.
‘మిరాయ్’ కోసం బాలీవుడ్ నిర్మాత..
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న మూవీ మిరాయ్. ఇందులో తేజ ఓ యోధుడిగా కనిపించబోతున్నాడు. మంచు మనోజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్ బొమ్మపై ఎక్స్‌పెక్టేషన్స్ స్కైని తాకేలా ఉన్నాయి. ఏప్రిల్ 18నే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా వీఎఎక్స్, కొంత షూటింగ్ పెండింగ్ వల్ల సెప్టెంబర్ 5కి రిలీజ్ విడుదల కాబోతుంది.. అయితే ఈ మూవీకి బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. నార్త్ హక్కుల కోసం బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ రంగంలోకి దిగాడు. ఇప్పటికే బాహుబలి, దేవరలాంటి చిత్రాలతో ప్రాఫిట్ చూసిన కరణ్ జోహార్ మిరాయ్ కోసం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో భారీ డీల్ చేసుకున్నాడు.. ఇది మామూలు విషయం కాదు..
Also Read:‘వీరమల్లు’ వీరకుమ్ముడు.. రెండో రోజు వసూళ్ల జోరు.. ఎన్ని కోట్లంటే..?
మిరాయ్ నుంచి సాంగ్ రిలీజ్..
తేజా సజ్జా మిరాయ్ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. విడుదలకు కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో ప్రమోషన్స్ మొదలు పెట్టారు.. ఈ క్రమంలో మూవీ నుంచి సాంగ్ ను రిలీజ్ చేశారు. ప్రేక్షకులను ఆ సాంగ్ బాగా ఆకట్టుకుంటుంది.. ఫస్ట్ సింగిల్ ‘వైబ్ ఉంది బేబీ’ విడుదలైంది. కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా, అర్మాన్ మాలిక్ తన చిలిపి గాత్రం తో పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. యూత్‌ఫుల్, ఎనర్జిటిక్ వోట్ లో సాగిన ఈ పాట సోషల్ మీడియాను ఊపేస్తోంది. ప్రస్తుతం యూట్యూబ్ లో రిలీజ్ అయిన కొన్ని నిమిషాల్లోనే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీ పై భారీ అంచనాలే క్రియేట్ అయ్యాయి. ఫైనల్ గా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.. ఈ మూవీ తర్వాత జై హనుమాన్ షూటింగ్ లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఆ మూవీని త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం..