Mancherial Vande Bharat Express: ద్ర ప్రభుత్వం మేకిన్ ఇండియాలో భాగంగా అందుబాటులోకి తీసుకొచ్చిన సెమీ హైస్పీడ్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు దేశ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సుమారు 139 వందేభారత్ రైళ్లు పలు మార్గాల్లో సేవలను అందిస్తున్నాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులకు ఈ రైళ్లు వేగవంతమైన, సౌకర్యవంతమై ప్రయాణ అనుభవాన్ని అందిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో పలు వందేభారత్ రైళ్లు సేవలను అందిస్తున్నాయి. త్వరలో మరో పట్టణానికి కూడా వందేభారత్ రైలు అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు.
ఇంతకీ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఏం చెప్పారంటే?
ఉత్తర తెలంగాణలోని కీలక పారిశ్రామిక ప్రాంతమైన మంచిర్యాల పట్టణానికి వందేభారత్ రైలును నడపాలని చాలా కాలంగా ఆ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర రైల్వే మంత్రి ఈ రైలు గురించి కీలక ప్రకటన చేశారు. కొత్త వందేభారత్ రైలు నడిపేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని లోక్ సభలో తెలిపారు. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానం చెప్పారు. కేంద్రమంత్రి సమాధానంతో మంచిర్యాల ప్రజలకు కొత్త ఆశలు కలిగిస్తున్నాయి. అధ్యయం తర్వాత వందేభారత్ రైలుకు ఆమోదం తెలిపితే మంచిర్యాల అభివృద్ధిలో కీలక అడుగుపడనుంది.
కాగజ్ నగర్ లో హాల్టింగ్ కోసం చాలా కాలంగా డిమాండ్
వాస్తవానికి ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి నాగపూర్ వరకు వందేభారత్ రైలు సేవలు అందిస్తుంది. ఈ రైలు వరంగల్ లోని కాజీపేట, కరీంనగర్ లోని రామగుండంతో పాటు బల్లార్ష, చంద్రాపూర్, సేవగ్రాం స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. మంచిర్యాల, కాగజ్ నగర్ ఆపాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో మంచిర్యాలకు కొత్త వందేభారత్ గురించి రైల్వే మంత్రి కీలక ప్రకటన చేయడం ఆ ప్రాంత ప్రజలకు సంతోషాన్ని కల్పిస్తోంది.
Read Also: ఏపీ నుంచి నేరుగా అరుణాచలానికి వందే భారత్.. ఇది కదా గుడ్ న్యూస్ అంటే!
తెలంగాణలో 4 వందేభారత్ రైళ్ల సేవలు
ప్రస్తుతం తెలంగాణ నుంచి 4 వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ రైళ్లు దేశంలోని ముఖ్యమైన నగరాలను కలుపుతున్నాయి. వీటిలో ఒకటి సికింద్రాబాద్ – విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ ప్రెస్. రెండవది సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్. మూడవది సికింద్రాబాద్ – బెంగళూరు వందే భారత్ ఎక్స్ ప్రెస్. నాలుగవది సికింద్రాబాద్ – నాగపూర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్. ఈ రైళ్లు దేశంలోని పలు ప్రాంతాలకు ప్రయాణ సౌకర్యాన్ని వేగవంతం చేస్తుంది. తాజాగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పినట్లు సర్వే పూర్తయ్యి మంచిర్యాలకు వందేభారత్ రైలు వస్తే, ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలకు ప్రయాణం మరింత ఆహ్లాదకరంగా మారే అవకాశం ఉంది.
Read Also: మీకు తెలుసా? రాత్రిళ్లు కూడా మెట్రో రైళ్లు నడుస్తాయి, కానీ జనాలతో కాదు.. ఎందుకంటే?