E-Paper
Advertisement

Ustad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బజ్ లేకపోవడంతో గగ్గోలు పెడుతున్న బయ్యర్స్..

Ustad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బజ్ లేకపోవడంతో గగ్గోలు పెడుతున్న బయ్యర్స్..
Advertisement

Ustad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చుట్టూ ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో జరుగుతున్న చర్చ నిజంగా ఆందోళనకరంగానే ఉంది. గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ అనగానే అంచనాలు ఆకాశంలో ఉండాలి, కానీ గ్రౌండ్ లెవల్ రియాలిటీ దానికి భిన్నంగా కనిపిస్తోంది. బయ్యర్లు, ఎగ్జిబిటర్లు గగ్గోలు పెట్టడానికి గల ప్రధాన కారణాలను విశ్లేషిస్తే కొన్ని చేదు నిజాలు కనిపిస్తాయి. సినిమా రిలీజ్ డేట్‌ను మార్చి 26 నుండి మార్చి 19కి హఠాత్తుగా మార్చడం బయ్యర్లను ఇబ్బంది పెట్టింది. ప్రమోషన్ల కోసం తగినంత సమయం లేకపోవడం, విడుదలైన పాటలు, టీజర్లు ‘గబ్బర్ సింగ్’ రేంజ్ ఇంపాక్ట్ చూపించలేకపోవడం సినిమాపై హైప్‌ను పెంచలేకపోయాయి.

Read also-Oscar Awards 2026: 98వ ఆస్కార్ అవార్డ్ విజేతలు వీరే.. సత్తా చాటిన ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’!

‘ధురంధర్ 2’ ప్రభావం

Advertisement

హిందీలో భారీ అంచనాలున్న ‘ధురంధర్ 2’ (రణ్‌వీర్ సింగ్ నటించిన చిత్రం) తో పోటీ పడటం సినిమా ఓపెనింగ్స్‌పై ప్రభావం చూపుతోంది. మల్టీప్లెక్స్‌లు, ఓవర్సీస్ మార్కెట్‌లో ఆ సినిమా వైపు ప్రేక్షకులు మొగ్గు చూపడం వల్ల ‘ఉస్తాద్’ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెంచిన టికెట్ రేట్లు (సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 247, మల్టీప్లెక్స్‌లో రూ. 302) ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు దూరం చేస్తున్నాయి. కేవలం పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రమే ఈ రేట్లకు సినిమా చూడగలరు, కానీ బయ్యర్లు లాభాల్లోకి రావాలంటే సామాన్య ప్రేక్షకులు కూడా రావాలి.

Read also-Illu Illalu Pillalu Today Episode: నిజం చెప్పేసిన అమూల్య.. నోరువిప్పిన ప్రేమ.. రామరాజు ఇంటికి తిరిగివచ్చిన అమూల్య..

బయ్యర్ల పరిస్థితి ఏంటి?

Advertisement

‘హరిహర వీరమల్లు’ కి కనీసం ఒక హిస్టారికల్ వాల్యూ, ఫ్రెష్నెస్ ఉండటంతో ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ ‘ఉస్తాద్’ ఒక రెగ్యులర్ మాస్ మసాలా సినిమా కావడంతో ఎగ్జిబిటర్లు భయపడుతున్నారు. ఇప్పటికే దాదాపు రూ.70 -80 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరగడంతో, మొదటి రోజే పాజిటివ్ టాక్ రాకపోతే బయ్యర్లు భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్, హరీష్ శంకర్ మార్క్ డైలాగులు థియేటర్లో క్లిక్ అయితే తప్ప ఈ సినిమా గట్టెక్కడం కష్టం. మొదటి షోకే ‘బాగుంది’ అనే టాక్ వస్తే తప్ప, ఈ బజ్ లేని ఓపెనింగ్స్ నుంచి సినిమా కోలుకోవడం అసాధ్యం. హరి హర వీరమల్లు కు వచ్చినంత బజ్ కూడా ఈ సినిమాకు రాకపోవడంతో బయ్యర్లకు ఏం చెయ్యాలో అర్థం కావడంలేదు. ప్రమోషన్ల పరంగా ఈ సినిమా ఇంకా వెనుకబడే ఉందని చెప్పాలి.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×