U.V Creations: తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో పేరుగాంచిన నిర్మాణ సంస్థలు ఉన్నాయి. అలాంటి వాటిలో యూవీ క్రియేషన(U.V Creations) నిర్మాణ సంస్థ కూడా ఒకటి. ఈ నిర్మాణ సంస్థను ప్రభాస్ సోదరుడు నడుపుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ బ్యానర్ పై ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశాయి. ఇటీవల సాహో, రాధే శ్యామ్ వంటి సినిమాలతో డిజాస్టర్లను సొంతం చేసుకున్న ఈ నిర్మాణ సంస్థ త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా నటిస్తున్న విశ్వంభర (Vishwambhara) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇలా చిరంజీవి విశ్వంభర సినిమాతో పాటు అనుష్క(Anushka) ప్రధాన పాత్రలో నటించిన ఘాటీ(Ghaati) సినిమాని కూడా నిర్మించిన విషయం తెలిసిందే.
తరచూ వాయిదా పడుతున్న విశ్వంభర..
ఈ రెండు సినిమాలు ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా తరచు వాయిదా పడుతూ వస్తున్నాయి. నిజానికి వశిష్ట (Vastista)దర్శకత్వంలో చిరంజీవి నటించిన విశ్వంభర సినిమా ఈ ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా రామ్ చరణ్ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో వాయిదా పడింది. ఇక జూలై నెలలో ఈ సినిమా విడుదల కాబోతుందని భావించారు. ఇప్పుడు కూడా ఈ సినిమా విడుదల కాలేదని స్పష్టమవతుంది. అలాగే జులై 11వ తేదీ విడుదల కావలసిన ఘాటీ సినిమాని కూడా వాయిదా వేస్తూ యు వి నిర్మాణ సంస్థ అధికారక ప్రకటన తెలియజేశారు.
పూర్ వి.ఎఫ్.ఎక్స్
ఇలా ఓ బడా నిర్మాణ సంస్థ నుంచి విడుదల కావాల్సిన ఈ రెండు సినిమాలు వాయిదా పడటంతో ఎందుకు యువి నిర్మాణంలో తెరకెక్కిన సినిమాలే వాయిదా పడుతున్నాయనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇకపోతే ఈ రెండు సినిమాలు వాయిదా పడటానికి కారణం విఎఫ్ఎక్స్(VFX) కంపెనీలనే తెలుస్తుంది. ఈ సినిమాలకు సంబంధించి భారీ స్థాయిలో విఎఫ్ఎక్స్ ఉండబోతుందని సమాచారం. అయితే సినిమా బడ్జెట్ నియంత్రించడానికి యు.వి క్రియేషన్స్ వారు కొన్ని విఎఫ్ ఎక్స్ కంపెనీలతో కాంట్రాక్టు కుదుర్చుకున్నారట. అయితే ఈ సినిమాల విషయంలో పూర్ విఎఫ్ఎక్స్ కారణంగా సరైన అవుట్ పుట్ రాని నేపథ్యంలో ఈ సినిమాలను తరచూ వాయిదా వేస్తున్నట్టు తెలుస్తోంది.
ఉత్తమ సినిమాటిక్ అనుభవం..
ఇలా ఈ రెండు సినిమాలకు సంబంధించి విఎఫ్ ఎక్స్ పనులు పూర్తి అయిన వెంటనే ఈ సినిమాల విడుదల తేదీలను కూడా అధికారికంగా ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. బింబిసారా ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి త్రిష హీరో హీరోయిన్లుగా విశ్వంభర సినిమాలో నటించారు. అలాగే డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఘాటీ. ఈ చిత్రం కూడా ఏప్రిల్ నెలలోనే విడుదల చేయాలని నిర్మాతలు భావించారు కానీ జూలై 11వ తేదీకి వాయిదా వేశారు. తాజాగా ఈ సినిమాని వాయిదా వేస్తూ ప్రేక్షకులకు మరింత ఉత్తమ సినిమాటిక్ అనుభవాన్ని కలిగించడం కోసమే వాయిదా వేస్తున్నామని త్వరలోనే అధికారకంగా తెలియజేస్తాము అంటూ ఇటీవల ఒక నోట్ విడుదల చేశారు. దీంతో అనుష్క అభిమానులు కూడా కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
Also Read: షాకింగ్.. టబుకు 16 ఏళ్లు ఉన్నప్పుడు ఆ స్టార్ హీరో అలా చేయబోయాడా?